Arattai: మెసేజింగ్ యాప్ అనగానే చాలా మందికి ముందుగా గుర్తొచ్చేది వాట్సాప్. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది ఉపయోగించే మెసేజింగ్ యాప్‌గా వాట్సాప్ పేరుగాంచింది. అయితే తాజాగా ఈ యాప్‌కు పోటీగా ఒక కోత్త యాప్ వచ్చేస్తోంది.
స్వదేశీ టెక్ దిగ్గజం జోహో కార్పొరేషన్ రూపొందించిన మెసేజింగ్ యాప్ అరట్టై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కేవలం మూడు రోజుల్లోనే ఈ యాప్ డౌన్‌లోడ్లు భారీగా పెరిగాయి. ప్రారంభంలో రోజువారీగా 3 వేల వరకు మాత్రమే సైన్‌అప్స్ ఉండగా, ఇప్పుడు అవి ఒక్కసారిగా 3.5 లక్షలకు చేరాయి. ఈ సమాచారం జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
25
అరట్టై యాప్ ప్రత్యేకతలు
‘అరట్టై’ అంటే తమిళంలో మాట్లాడుకోవడం అన్న అర్థం. ఈ యాప్‌ను 2021లో లాంచ్ చేసినప్పటికీ, ఇప్పుడు విపరీతమైన ఆదరణ పొందుతోంది. వ్యక్తిగత చాట్స్, గ్రూప్ సంభాషణలు, ఫొటోలు, వీడియోలు షేర్ చేసే సదుపాయాలు ఇందులో ఉన్నాయి. వాయిస్ నోట్స్, స్టోరీస్, బ్రాడ్‌కాస్ట్ ఛానల్స్ కూడా ఇందులో భాగం కావడంతో ఇది పూర్తి స్థాయి మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌గా మారింది.
35
ఎన్నో ఫీచర్లు
అరట్టై యాప్‌లో టెక్స్ట్, మీడియా, ఫైల్ షేరింగ్ వంటి ప్రాథమిక ఫీచర్లతో పాటు, ఆడియో-వీడియో కాల్స్ కూడా (ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో) అందుబాటులో ఉన్నాయి. డెస్క్‌టాప్, ఆండ్రాయిడ్-టీవీ ఇంటిగ్రేషన్‌తో మల్టీ డివైజ్ సపోర్ట్ ఉండటం ప్రత్యేకత. అంతేకాకుండా, వ్యాపారుల కోసం అవసరమైన టూల్స్ కూడా ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా, ప్రైవసీ రక్షణపై కంపెనీ ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. వినియోగదారుల వ్యక్తిగత డేటాను ఎట్టి పరిస్థితుల్లోనూ మోనిటైజ్ చేయబోమని జోహో స్పష్టం చేసింది.
2021 నుంచే ఈ యాప్ అందుబాటులో ఉన్నప్పటికీ, ఇటీవల కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ప్రోత్సహించడంతో ఇది ప్రజాదరణ పొందింది. దీంతో కేవలం మూడు రోజుల్లోనే అరట్టై యాప్ డౌన్‌లోడ్లు 100 రెట్లు పెరిగాయి. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్ స్టోర్లలో నెట్‌వర్కింగ్ విభాగంలో టాప్ పొజిషన్‌లో నిలిచింది. అయితే వినియోగదారుల పెరుగుదలతో పాటు కొన్ని సాంకేతిక సమస్యలు – ఓటీపీ ఆలస్యం, కాంటాక్ట్ సింక్ లోపాలు, కాల్ ఫెయిల్యూర్లు – ఎదురవుతున్నాయి. వీటిని త్వరలోనే పరిష్కరిస్తామని జోహో తెలిపింది.
55
వాట్సప్‌కు పోటీనిస్తుందా.?
ప్రస్తుతం భారత్‌లో వాట్సప్ యూజర్లు 50 కోట్లకు పైగా ఉన్నారు. కుటుంబం, ఆఫీస్, వ్యాపార లావాదేవీల్లో వాట్సప్ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ నేపథ్యంలో అరట్టైకి ఇది పెద్ద సవాలు. ప్రస్తుతం అరట్టైలో కాల్స్ మాత్రమే ఎన్‌క్రిప్టెడ్‌గా ఉన్నా, చాట్స్ మాత్రం ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ కలిగి లేవు. ఇదే వాట్సప్‌కి ప్లస్ పాయింట్. అయితే, జోహో తన ప్రైవసీ వాగ్దానాన్ని త్వరగా అమలు చేసి, సర్వర్ సామర్థ్యాన్ని పెంచితే, భారతీయ యాప్ అరట్టై భవిష్యత్తులో వాట్సప్‌కి గట్టి పోటీగా మారే అవకాశాలు ఉన్నాయి అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.