ప్రతి స్మార్ట్‌ఫోన్‌లో సంచార్ సాథీ ఉండాల్సిందే.. అసలేంటిది? ఏం చేస్తుంది?

Published : Dec 01, 2025, 10:57 PM IST

Sanchar Saathi : కొత్తగా భారత మార్కెట్ లోకి వచ్చే ప్రతి స్మార్ట్‌ఫోన్‌లో సంచార్ సాథీ యాప్‌ను తప్పనిసరిగా ఇన్‌స్టాల్ చేయాలని కేంద్రం ఆదేశించింది. దీనిని డిలీట్ చేయకుండా డిఫాల్ట్ గా ఉంచాలనీ, సైబర్ భద్రత బలోపేతమే దీని ప్రధాన లక్ష్యంగా పేర్కొంది.

PREV
15
Sanchar Saathi: దేశంలో ప్రతి మొబైల్‌కు కొత్త భద్రతా కవచం

భారతదేశంలో మొబైల్‌ వినియోగం విస్తృతంగా పెరుగుతోంది. ఇదే సమయంలో సైబర్ మోసాలు, ఫోన్ దొంగతనాల సంఖ్య ఆందోళనకరంగా మారింది. దేశ వ్యాప్తంగా 100 కోట్లకు పైగా మొబైల్ వినియోగదారులు ఉండటంతో, వారి భద్రతను పటిష్టం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఇకపై భారత మార్కెట్లో అమ్మకానికి వచ్చే ఏ కొత్త స్మార్ట్‌ఫోన్ అయినా సంచార్ సాథీ (Sanchar Saathi) అనే ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ యాప్‌ను తప్పనిసరిగా ముందే ఇన్‌స్టాల్ చేసి ఇవ్వాల్సిందేనని మొబైల్ తయారీ సంస్థలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

ఈ యాప్‌ను వినియోగదారులు ఫోన్‌లోంచి తొలగించడం కూడా సాధ్యం కాని విధంగా ప్రభుత్వం నిర్దేశించింది. అంటే, ఇది ప్రతి యూజర్‌కి తప్పనిసరిగా ఉండే భద్రతా సాధనంగా మారనుంది.

25
సంచార్ సాథీ అంటే ఏమిటి? మొబైల్ భద్రత కోసం ప్రత్యేకంగా రూపొందించిన ప్లాట్‌ఫాం

సంచార్ సాథీ యాప్‌ను 2025 జనవరిలో టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) అధికారికంగా విడుదల చేసింది. ఫోన్ చోరీలు, అక్రమ సిమ్ కనెక్షన్‌లు, ఐఎంఈఐ స్పూఫింగ్ వంటి అధిక స్థాయి సైబర్ మోసాలను అరికట్టడం దీని ప్రధాన ఉద్దేశం.

సంచార్ సాథీ యాప్‌లోని ముఖ్య ఫీచర్లు ఇవే

• పోయిన లేదా దొంగిలించిన ఫోన్లను దేశవ్యాప్తంగా బ్లాక్ చేయడం

• ఐఎంఈఐ నంబర్ మార్చిన ఫోన్లను గుర్తించడం

• వినియోగదారు పేరుతో నమోదైన అన్ని సిమ్ నంబర్లను చెక్ చేయడం

• మోసపూరిత కాల్‌లు లేదా సందేశాలను రిపోర్ట్ చేసే సేఫ్టీ ఫీచర్

• కేవైఎం (Know Your Mobile) ద్వారా ఫోన్ అసలు అయినదో కాదో తెలుసుకోవడం

ప్రభుత్వం వెల్లడించిన డేటా ప్రకారం, యాప్ లాంఛ్ తర్వాత ఇప్పటి వరకు 7 లక్షలకు పైగా చోరీ ఫోన్లను గుర్తించి బ్లాక్ చేసినట్లు పేర్కొంది.

35
మొబైల్ కంపెనీలకు 90 రోజుల గడువు.. పాత ఫోన్లకూ అప్‌డేట్ తో రానున్న యాప్

ప్రభుత్వం జారీ చేసిన తాజా ఆదేశాల ప్రకారం.. యాపిల్, శాంసంగ్, ఒప్పో, వివో, షియోమీ వంటి ప్రతి మొబైల్ తయారీ సంస్థకూ ఈ యాప్‌ను కొత్త పరికరాల్లో ప్రీ-ఇన్‌స్టాల్ చేయడానికి 90 రోజుల గడువు ఇచ్చింది. ఈ మార్పు కొత్త ఫోన్లకే కాకుండా, ఇప్పటికే మార్కెట్లో ఉన్న స్మార్ట్‌ఫోన్లకూ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ద్వారా వర్తించనుంది.

అయితే, యాపిల్ వంటి గ్లోబల్ బ్రాండ్లు తమ iOS ఆపరేటింగ్ సిస్టమ్‌లో ప్రభుత్వ యాప్‌లను ముందే చేర్చడానికి ఆసక్తి చూపకపోవడం వల్ల, ఈ నిర్ణయంపై వారి స్పందన ఎలా ఉంటుందన్నది పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.

45
సంచార్ సాథీ యాప్ ఫలితాలు

ప్రభుత్వం అందించిన గణాంకాల ప్రకారం.. సంచార్ సాథీ దేశవ్యాప్తంగా మొబైల్ భద్రతను గణనీయంగా పెంచింది. ఇప్పటి వరకు 5 మిలియన్లకుపైగా డౌన్‌లోడ్లు నమోదు అయ్యాయి. దొంగిలించిన 3.7 మిలియన్ మొబైల్‌లను బ్లాక్ చేయడంలో సహాయం చేసింది. 30 మిలియన్ మోసపూరిత సిమ్ కనెక్షన్‌లు రద్దు అయ్యాయి. సైబర్ నేరాల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, ఈ యాప్ తీసుకొచ్చిన తర్వాత సైబర్ మోసాల్లో 20% నుంచి 30% వరకూ తగ్గుదల నమోదుకానుందని నిపుణులు భావిస్తున్నారు.

55
సంచార్ సాథీ యాప్ : పోయిన ఫోన్‌ను ఎలా రిపోర్ట్ చేయాలి?

యాప్ ద్వారా:

1. Google Play Store లో Sanchar Saathi యాప్ డౌన్‌లోడ్ చేయండి

2. మొబైల్ నంబర్‌తో రిజిస్టర్ అవ్వండి

3. “CEIR Services” → “Block Your Phone” సెలెక్ట్ చేయండి

4. IMEI నంబర్, ఫోన్ వివరాలు నమోదు చేయండి

5. పోలీస్ ఎఫ్ఐఆర్, ఐడీ ప్రూఫ్ అప్‌లోడ్ చేయండి

6. ఫోన్ దొరికితే “Unblock” ఆప్షన్ ద్వారా అన్‌బ్లాక్ చేసుకోవచ్చు

పోర్టల్ ద్వారా:

• sancharsaathi.gov.in వెబ్‌సైట్ ఓపెన్ చేయండి

• “Block Lost/Stolen Mobile Handset” సెలెక్ట్ చేయండి

• అవసరమైన వివరాలు, ఎఫ్ఐఆర్ అప్‌లోడ్ చేయండి

ఈ విధంగా, సంచార్ సాథీ యాప్ మొబైల్ భద్రతను కేవలం యాప్ స్థాయిలో కాదు, జాతీయ స్థాయిలో డిజిటల్ సెక్యూరిటీ వ్యవస్థలో కీలక భాగంగా నిలుస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories