
టెక్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూసే బ్లాక్ ఫ్రైడే సేల్ సీజన్ ప్రారంభమైంది. ఈ క్రమంలోనే ఆపిల్ ఫోన్ల పై ప్రముఖ ఎలక్ట్రానిక్స్ రిటైల్ చైన్ క్రోమా ఈ ఏడాది అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ ఆఫర్‌ను ప్రకటించింది.
సాధారణంగా రూ.82,900 ధర గల ఆపిల్ ఐఫోన్ 17 (Apple iPhone 17)... ప్రత్యేక ఆఫర్లను క్లబ్ చేసుకున్నవారికి కేవలం రూ.45,900కే లభిస్తోంది. ఇది ఐఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి అద్భుతమైన ఆఫర్.
ఈ డీల్ ఆన్‌లైన్‌లో అందుబాటులో లేదు. దేశవ్యాప్తంగా ఉన్న క్రోమా రిటైల్ స్టోర్లలో మాత్రమే ఉంది. నవంబర్ 30 వరకు ఈ ఆఫర్ కొనసాగుతుందని తెలిపింది.
క్రోమా ఈ ధరను మూడు వేర్వేరు ప్రయోజనాలను కలిపి అందిస్తుంది.
1. బ్యాంక్ క్యాష్‌బ్యాక్ – రూ.1,000
ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో చెల్లింపు చేస్తే వెంటనే వర్తించే డిస్కౌంట్.
2. ఎక్స్ఛేంజ్ విలువ – రూ.29,000 వరకు
మీ పాత స్మార్ట్‌ఫోన్ మోడల్, వయస్సు, కండిషన్ ఆధారంగా ట్రేడ్-ఇన్ విలువ నిర్ణయిస్తారు.
3. ఎక్స్ఛేంజ్ బోనస్ – రూ.7,000
పాత ఫోన్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి వర్తించే అదనపు ప్రోత్సాహకం ఇది.
ఈ మూడు కలిపి రూ.82,900 ఐఫోన్ 17 ధరను రూ.45,900 లకు తీసుకొచ్చింది.
ఆపిల్ ఈ సంవత్సరం విడుదల చేసిన iPhone 17 బేస్ మోడల్, డిజైన్ నుంచి అంతర్గత పనితీరుకు వరకు అనేక ప్రధాన అప్ గ్రేడ్ లను కలిగి ఉంది.
ఐఫోన్ 17 డిస్‌ప్లే, డిజైన్
• 6.3-అంగుళాల సూపర్ రెటినా XDR OLED
• 120Hz ప్రోమోషన్ రిఫ్రెష్ రేట్
• 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్
• సెరామిక్ షీల్డ్ 2 ప్రొటెక్షన్
• IP68 డస్ట్/వాటర్ రెసిస్టెన్స్
• రంగులు: లావెండర్, మిస్ట్ బ్లూ, సేజ్, బ్లాక్, వైట్
ఈ డిస్‌ప్లే మరింత సున్నితమైన స్క్రోలింగ్, స్పష్టమైన దృశ్యాలు, HDR10 & డాల్బీ విజన్ సపోర్ట్‌తో విజువల్ అనుభూతిని పూర్తిగా మార్చేస్తుంది.
ఐఫోన్ 17 A19 చిప్ సెట్, 3nm టెక్నాలజీతో రూపొందించారు.
• 6-కోర్ CPU
• 5-కోర్ GPU
• 8GB RAM
• 256GB & 512GB స్టోరేజ్ ఆప్షన్లు
• iOS 26
గేమింగ్, హై-ఎండ్ మల్టీటాస్కింగ్, వీడియో ఎడిటింగ్ వంటి పనులు మరింత వేగంగా, మెరుగ్గా చేసుకోవచ్చు.
ఐఫోన్ 17 కెమెరా సెటప్
• 48MP + 48MP డ్యూయల్ ఫ్యూజన్ సిస్టమ్
• 120° అల్ట్రా-వైడ్
• 4K డాల్బీ విజన్
• 8x ఆప్టికల్-క్వాలిటీ జూమ్
ఫ్రంట్ కెమెరా
• 18MP సెంటర్ స్టేజ్ సెల్ఫీ కెమెరా
వీడియో కాల్‌లలో మీ ముఖాన్ని ఆటోమేటిక్‌గా ఫ్రేమ్‌లో ఉంచే ఆపిల్ సెంటర్ స్టేజ్ టెక్నాలజీ ఇక్కడ కూడా అందుబాటులో ఉంది.
ఆపిల్ ఐఫోన్ 17 బ్యాటరీ & ఛార్జింగ్
• 3692mAh బ్యాటరీ – 30 గంటల వీడియో ప్లేబ్యాక్
• 40W ఫాస్ట్ ఛార్జింగ్ – 30 నిమిషాల్లో 50%
• 25W MagSafe వైర్‌లెస్ ఛార్జింగ్
రోజువారీ వాడకంలో బ్యాటరీ పనితీరు చాలా వరకు మెరుగుపడింది.
ఐఫోన్ 17లో కొత్తగా వచ్చిన Apple Intelligence ఫీచర్లు
• లైవ్ ట్రాన్స్ లేట్
• ఫోటో ప్లే గ్రౌండ్
• రైటింగ్ టూల్స్
• ఏఐ అసిస్టెంట్
ప్రతి పనిని మరింత స్మార్ట్‌గా చేయడానికి ప్రత్యేకంగా రూపొందించారు.
• కొత్త ఐఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్న వారికి
• మంచి కండిషన్‌లో పాత ఫోన్ ఉన్నవారికి
• డిసెంబర్ షాపింగ్‌లో భారీ సేవింగ్ కోరుకునే వినియోగదారులకు
• AI ఫీచర్లతో కూడిన కొత్త తరం డివైస్ అవసరం ఉన్నవారికి
ఈ బ్లాక్ ఫ్రైడే ఆఫర్ 2025లో అత్యధిక డిమాండ్ ఉన్న డీల్స్‌లో ఒకటిగా మారే అవకాశం ఉంది.