Smart phone: పాత ఫోన్‌లలో బ్యాటరీలను బయటకు తీసే అవకాశం ఉండేది. అయితే ప్రస్తుతం దాదాపు అన్ని ఫోన్లు సీల్డ్ బ్యాటరీలతో వస్తున్నాయి. ఇంతకీ ఈ మార్పు ఎందుకు చేశారు.? అసలు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫోన్ బ్యాటరీ నాన్ రిమూవబుల్‌గా ఉండడం వల్ల మందంగా తగ్గుతుంది దీంతో ఫోన్ స్లిమ్‌గా కనిపిస్తుంది. ఫోన్ బరువు తగ్గుతుంది. యూజర్లు స్లిమ్, స్టైలిష్ ఫోన్లను కోరుకుంటున్నారు. అందుకే కంపెనీలు బ్యాటరీని లోపలే జత చేసి రూపొందిస్తున్నాయి.
25
బ్యాటరీ పవర్ ఎక్కువ
ఇంతకు ముందు ఫోన్ల బ్యాటరీలు త్వరగా డిశ్చార్జ్ అయ్యేవి. అందుకే చాలామంది స్పేర్ బ్యాటరీ పెట్టుకునేవారు. దీంతో బ్యాటరీలను మార్చుకునే వారు. కానీ ఇప్పుడు ఫోన్లలో ఉన్న Lithium-ion, Lithium-Polymer బ్యాటరీలు ఇస్తున్నారు. ఇవి ఎక్కువ బ్యాకప్ ఇస్తాయి, ఫాస్ట్ ఛార్జ్ అవుతాయి, స్మార్ట్ పవర్ మెనేజ్‌మెంట్ కలిగి ఉంటాయి. కాబట్టి రోజులో బ్యాటరీ మార్చాల్సిన అవసరం చాలా తగ్గిపోయింది.
35
వాటర్‌ప్రూఫ్, డస్ట్‌ప్రూఫ్ టెక్నాలజీ కోసం
ఇప్పటి ఫోన్లు చాలా వరకు IP67 / IP68 వాటర్‌ప్రూఫ్, డస్ట్‌ప్రూఫ్ టెక్నాలజీతో వస్తున్నాయి. బ్యాటరీ తీసే ఫోన్‌లో కవర్ గ్యాప్‌లో నీరు, దుమ్ము లోపలికి వెళ్తాయి. కాబట్టి సీల్డ్ బ్యాటరీ ఫోన్లు మన్నికగా ఉంటాయి. నాన్ రిమూవబుల్ బ్యాటరీ ఫోన్లను తయారు చేస్తుండడానికి ఇది కూడా ఒక రీజన్‌గా చెప్పొచ్చు.
బ్యాటరీలో రసాయన పదార్థాలు ఉంటాయి. అవి దెబ్బ తింటే హీట్ పెరుగుతుంది, బ్యాటరీ ఉబ్బిపోవచ్చు, అరుదుగా పేలే అవకాశమూ ఉంటుంది. సీల్డ్ డిజైన్‌లో కంపెనీలు అదనంగా రక్షణ ఇస్తాయి. అందుకే ఇవి మరింత భద్రంగా ఉంటాయి.
55
ఫోన్ దొంగతనం తగ్గడానికి
ప్రస్తుతం ఫోన్‌లలో ఫైండ్ మై డివైజ్, సిమ్ లాక్, ఐఎమ్ఈఐ ట్రాకింగ్ వంటి ఫీచర్లను అందించారు. బ్యాటరీ తీసేయడం కష్టం కాబట్టి, దొంగలు వెంటనే ఫోన్ ఆఫ్ చేయలేరు. అలా అయితే ఫోన్‌ని సులభంగా ట్రాక్ చేయొచ్చు.