Digital India Super Apps: మీ మొబైల్‌లో తప్పక ఉండాల్సిన ప్రభుత్వ యాప్స్‌ ఇవీ.. వీటితో పనులన్నీ ఈజీ !

Published : Jul 06, 2026, 10:17 AM IST

Digital India Super Apps: ట్రాఫిక్ పోలీస్ ఆపినా, ఐడీ కార్డ్ అడిగినా నో టెన్షన్.. మీ మొబైల్‌లో ఈ యాప్స్ ఉంటే చాలు. మీ స్మార్ట్‌ఫోన్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన 8 కేంద్ర ప్రభుత్వ యాప్స్ తో మీ పనులన్నీ ఈజీ అవుతాయి. ఆ యాప్స్‌ వివరాలు మీకోసం.

PREV
19
మీ మొబైల్‌లో ఈ 8 ప్రభుత్వ యాప్స్ ఉన్నాయా? డిజిటల్ ఇండియా సూపర్ యాప్స్ లిస్ట్ ఇదే

భారతదేశం డిజిటల్ వైపు వేగంగా దూసుకుపోతోంది. మనకు కావాల్సిన సేవలను వేలిముద్రతో పొందేలా కేంద్ర ప్రభుత్వం ఎన్నో మొబైల్ యాప్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. స్మార్ట్‌ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరి మొబైల్‌లో కచ్చితంగా ఉండాల్సిన 8 ముఖ్యమైన ప్రభుత్వ యాప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

29
1. డిజీ లాకర్

సర్టిఫికెట్లు, డాక్యుమెంట్ల హార్డ్ కాపీలను వెంట పట్టుకెళ్లే రోజులు పోయాయి. డిజీ లాకర్ (DigiLocker) యాప్ ఉంటే మీ ఒరిజినల్ డాక్యుమెంట్లు అన్నీ మీ మొబైల్‌లోనే భద్రంగా ఉంటాయి. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, టెన్త్ క్లాస్ మార్క్స్ మెమో వంటి కీలక పత్రాలను ఇందులో డిజిటల్ రూపంలో సేవ్ చేసుకోవచ్చు. చట్టపరంగా ఈ డిజిటల్ కాపీలకు పూర్తి గుర్తింపు ఉంటుంది. ట్రాఫిక్ పోలీసులు అడిగినా లేదా ఎక్కడైనా ఐడీ ప్రూఫ్ చూపించాలన్నా ఇది వంద శాతం వాలిడ్ అవుతుంది.

39
2. ఉమంగ్

ఉమంగ్ (UMANG) యాప్ అనేది ఒక రకమైన ఆల్ ఇన్ వన్ సూపర్ యాప్. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వందలాది సేవలు ఈ ఒక్క యాప్ ద్వారానే యాక్సెస్ చేయవచ్చు. ఈపీఎఫ్ఓ (EPFO) బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం, పాన్‌కార్డ్ కోసం అప్లై చేయడం, గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవడం, పెన్షన్ సేవలు పొందడం లాంటివి ఇందులో ఈజీగా అయిపోతాయి. వేర్వేరు పనుల కోసం రకరకాల యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోకుండా ఈ ఒక్క యాప్ ఉంటే చాలు.

49
3. ఎం పరివాహన్

వాహన దారులు, డ్రైవర్లకు ఎం పరివాహన్ (mParivahan) యాప్ ఒక వరం లాంటిది. మీ వాహనానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్ కాపీ, పొల్యూషన్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి వివరాలన్నీ ఇందులో డిజిటల్ ఫార్మాట్‌లో స్టోర్ అవుతాయి. రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ దీనిని అధికారికంగా అప్రూవ్ చేసింది. అంతేకాదు, మీ కారు లేదా బైక్‌పై ఏవైనా ట్రాఫిక్ ఫైన్లు ఉన్నాయా లేదా అనేది కూడా ఈ యాప్‌లో చాలా సులువుగా చెక్ చేసుకోవచ్చు.

59
4. ఆధార్ యాప్

మన దేశంలో ఆధార్ కార్డ్ ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆధార్ (mAadhaar) యాప్ ద్వారా మీ ఫిజికల్ ఆధార్ కార్డును జేబులో పెట్టుకుని తిరగాల్సిన అవసరం ఉండదు. ఈ యాప్‌లో మీ ఆధార్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అవసరమైనప్పుడు క్యూఆర్ కోడ్ చూపించి వెరిఫికేషన్ పూర్తి చేయవచ్చు. మీ ఆధార్ బయోమెట్రిక్ డేటాను ఎవరూ దుర్వినియోగం చేయకుండా లాక్ లేదా అన్‌లాక్ చేసుకునే సూపర్ సెక్యూరిటీ ఫీచర్ కూడా ఇందులో ఉంది.

69
5. ఐఆర్ సీటీసీ రైల్ కనెక్ట్

ట్రెయిన్ జర్నీ చేసే వారికి ఈ యాప్ (IRCTC Rail Connect) కచ్చితంగా తెలిసి తీరాలి. ఐఆర్ సీటీసీ రైల్ కనెక్ట్ యాప్ ద్వారా రైలు టికెట్లను చాలా వేగంగా, సులభంగా బుక్ చేసుకోవచ్చు. తత్కాల్ టికెట్ బుకింగ్స్, సీట్ల అవైలబిలిటీ చెక్ చేయడం, పీఎన్ఆర్ స్టేటస్ తెలుసుకోవడం, లైవ్ ట్రైన్ రన్నింగ్ స్టేటస్ ట్రాక్ చేయడం వంటివన్నీ ఈ యాప్ ద్వారా ఈజీగా చూసుకోవచ్చు. ప్రయాణాలను ప్లాన్ చేసుకోవడానికి ఇది బెస్ట్ అఫీషియల్ యాప్.

79
6. మై గవ్

ప్రభుత్వ నిర్ణయాల్లో, పాలనలో ప్రజలను భాగస్వామ్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అద్భుతమైన ప్లాట్‌ఫామ్ మై గవ్ యాప్ (MyGov). ప్రభుత్వం చేపట్టే వివిధ కార్యక్రమాలకు సంబంధించి మీ ఐడియాలను, సూచనలను ఇక్కడ షేర్ చేయవచ్చు. రకరకాల పోటీల్లో పాల్గొని సర్టిఫికెట్లు, బహుమతులు గెలుచుకోవచ్చు. ప్రభుత్వ తాజా పాలసీలు, కొత్త స్కీమ్‌ల గురించిన అఫీషియల్ అప్‌డేట్స్ అన్నీ ఇందులో లభిస్తాయి.

89
7. భీమ్

డిజిటల్ పేమెంట్స్ రంగంలో విప్లవం సృష్టించిన యాప్ భీమ్ (Bharat Interface for Money). యూపీఐ (UPI) ఆధారంగా పనిచేసే ఈ యాప్ ద్వారా బ్యాంక్ అకౌంట్ నుంచి నేరుగా, చాలా సురక్షితంగా డబ్బులు పంపవచ్చు, రిసీవ్ చేసుకోవచ్చు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి క్షణాల్లో పేమెంట్స్ చేయవచ్చు. మొబైల్ రీఛార్జ్, కరెంట్ బిల్లులు, గ్యాస్ బిల్లుల వంటి యూటిలిటీ పేమెంట్స్ అన్నీ కూడా ఈ యాప్ (BHIM) ద్వారా సింపుల్‌గా అయిపోతాయి.

99
8. ఆరోగ్య సేతు 2.0

కరోనా సమయంలో మనందరికీ అండగా నిలిచిన ఆరోగ్య సేతు యాప్ (Aarogya Setu 2.0) ఇప్పుడు సరికొత్త వెర్షన్ 2.0 రూపంలో అందుబాటులో ఉంది. కేవలం కోవిడ్ అప్‌డేట్స్ మాత్రమే కాకుండా, ఇప్పుడు ఇది ఒక కంప్లీట్ హెల్త్ యాప్‌గా మారింది. ఇందులో మీ 'ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్' (ABHA) ఐడీని క్రియేట్ చేసుకోవచ్చు. మీ మెడికల్ రికార్డులను డిజిటల్‌గా భద్రపరుచుకోవచ్చు. బ్లడ్ డోనర్స్ సమాచారం, హెల్త్ అడ్వైజరీలు వంటి కీలక ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories