Doorbell: ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు స్పష్టంగా అలర్ట్ ఇచ్చే డోర్‌బెల్ ఉంటే ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ముఖ్యంగా వైర్లు లేకుండా సులభంగా అమర్చుకునే డోర్‌బెల్ అయితే మరింత ఉపయోగకరం. యాంకర్ బై పానాసోనిక్ కంపెనీకి చెందిన ఈ డోర్‌బెల్ ఫీచర్లపై ఓ లుక్కేయండి.
ఈ డోర్‌బెల్ పూర్తిగా వైర్‌లెస్ టెక్నాలజీతో పనిచేస్తుంది. కాబట్టి గోడల్లో డ్రిల్లింగ్ చేయడం లేదా విద్యుత్ వైర్లు వేయాల్సిన అవసరం ఉండదు. డోర్‌బెల్ బటన్‌ను మీకు నచ్చిన చోట అమర్చుకుని, రిసీవర్‌ను ఇంట్లో లేదా కార్యాలయంలో అనుకూలమైన ప్రదేశంలో ఉంచితే సరిపోతుంది. కొద్ది నిమిషాల్లోనే ఉపయోగించేందుకు సిద్ధమవుతుంది. అమెజాన్ లో దీని ధర కేవలం రూ. 660కే అందుబాటులో ఉంది.
25
45 మెలోడీలు.. మీకు నచ్చిన రింగ్‌టోన్ ఎంపిక
ఈ వైర్‌లెస్ డోర్‌బెల్‌లో మొత్తం 45 రకాల మెలోడీలు అందుబాటులో ఉన్నాయి. సంప్రదాయ డోర్‌బెల్ శబ్దాల నుంచి ఆధునిక సంగీత టోన్ల వరకు ఎన్నో ఎంపికలు ఉన్నాయి. మీకు నచ్చిన మెలోడీని ఎప్పుడైనా సులభంగా మార్చుకోవచ్చు. ప్రత్యేక సందర్భాలు లేదా వ్యక్తిగత అభిరుచికి అనుగుణంగా రింగ్‌టోన్‌ను ఎంచుకునే అవకాశం ఉంటుంది.
35
120 మీటర్ల వరకు పనిచేసే సిగ్నల్
ఈ డోర్‌బెల్ ప్రధాన ప్రత్యేకత 120 మీటర్ల వరకు పనిచేసే వైర్‌లెస్ రేంజ్. పెద్ద ఇళ్లు, డూప్లెక్స్ హౌస్‌లు, బహుళ అంతస్తుల భవనాలు లేదా కార్యాలయాల్లో కూడా సిగ్నల్ సరిగా అందుతుంది. ఇంట్లో ఏ గదిలో ఉన్నా లేదా ఆఫీసులో దూరంగా ఉన్నా డోర్‌బెల్ మోగితే వెంటనే వినిపించేలా దీనిని రూపొందించారు.
ఈ డోర్‌బెల్‌లో శబ్దంతో పాటు LED లైట్ సూచిక కూడా ఉంటుంది. డోర్‌బెల్ మోగినప్పుడు లైట్ కూడా వెలుగుతుంది. దీంతో వినికిడి సమస్యలు ఉన్నవారికి కూడా సందర్శకులు వచ్చిన విషయం సులభంగా తెలుస్తుంది. ఈ ఫీచర్ వృద్ధులు, ప్రత్యేక అవసరాలు ఉన్న వ్యక్తులకు కూడా ఉపయోగపడుతుంది.
55
ఇల్లు, ఆఫీసు రెండింటికీ అనువైన డిజైన్
యాంకర్ బై పానాసోనిక్ వైర్‌లెస్ డోర్‌బెల్‌ను అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా రూపొందించారు. అందువల్ల ఇండోర్‌తో పాటు అవుట్‌డోర్‌లో కూడా ఉపయోగించవచ్చు. దీని ఆధునిక డిజైన్ ఇంటి ప్రవేశ ద్వారానికి ఆకర్షణీయమైన రూపాన్ని ఇస్తుంది. ఇల్లు, అపార్ట్‌మెంట్, కార్యాలయం, షాపు వంటి ప్రదేశాల్లో కూడా చాలా బాగా పనిచేస్తుంది.