Foldable Bluetooth Keyboards:వర్క్ ఫ్రమ్ హోమ్, ట్రావెలింగ్‌కు బెస్ట్ గా అందుబాటు ధరలో ఫోల్డబుల్ బ్లూటూత్ కీబోర్డ్స్ ఉన్నాయి. టాబ్లెట్స్, స్మార్ట్‌ఫోన్‌ల కోసం తక్కువ బడ్జెట్‌లో లభించే 5 బెస్ట్ ఫోల్డబుల్ బ్లూటూత్ కీబోర్డ్స్ ఫీచర్లు, ధరల వివరాలు మీకోసం.
బడ్జెట్ ధరలో సూపర్ గాడ్జెట్స్.. టాబ్లెట్స్ కోసం 5 బెస్ట్ వైర్‌లెస్ ఫోల్డబుల్ కీబోర్డ్స్
ఆఫీస్ వర్క్ కోసం లేదా బిజినెస్ ట్రిప్స్ కోసం ఎక్కువగా ట్రావెల్ చేసే వారికి స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లు చాలా ముఖ్యం. అయితే వీటిలో లాంగ్ టైమ్ టైప్ చేయడం కొంచెం కష్టం. అందుకే ఫోల్డబుల్ బ్లూటూత్ కీబోర్డ్స్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఇవి మీ లగేజ్ బ్యాగ్‌లో అస్సలు స్పేస్ తీసుకోవు. ప్రయాణాల్లో చాలా ఈజీగా క్యారీ చేయవచ్చు.
ఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్ డివైజ్‌లతో ఇవి ఈజీగా కనెక్ట్ అవుతాయి. రీఛార్జబుల్ బ్యాటరీలు, మల్టీ డివైజ్ కనెక్టివిటీ, సైలెంట్ కీస్ వంటి ఫీచర్లు వీటిలో ఉంటున్నాయి. అమెజాన్‌లో రూ. 2500 లోపు లభించే 5 బెస్ట్ ఫోల్డబుల్ బ్లూటూత్ కీబోర్డ్స్ వివరాలు ఇప్పుడు చూద్దాం.
తక్కువ బడ్జెట్‌లో ఫోల్డబుల్ బ్లూటూత్ కీబోర్డ్ కావాలనుకునే వారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్. దీని ధర కేవలం రూ. 898 మాత్రమే. దీని కస్టమర్ రేటింగ్ 4.4/5 గా ఉంది. ఇది చాలా తక్కువ బరువు ఉంటుంది. బ్లూటూత్ 5.0 సపోర్ట్ చేస్తుంది. దీనిని ఈజీగా బ్యాక్‌ప్యాక్‌లో పెట్టుకోవచ్చు. దీని ఎర్గోనామిక్ డిజైన్ వల్ల టైపింగ్ చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. స్టూడెంట్స్, ట్రావెలర్స్, రిమోట్ వర్కర్లకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే లిథియం పాలిమర్ బ్యాటరీ 100 కంటే ఎక్కువ గంటల వర్కింగ్ టైమ్‌ను ఇస్తుంది. దీనికి 1 సంవత్సరం వారంటీ కూడా ఉంది.
ఈ పోర్ట్రానిక్స్ చిక్లెట్ ఫోల్డబుల్ కీబోర్డ్ ధర రూ. 1,211 కాగా, కస్టమర్ రేటింగ్ 4.0/5 గా ఉంది. ఇది ఒక మినీ పాకెట్ సైజ్ కీబోర్డ్. ఇందులో పెద్ద ఎర్గోనామిక్ కీస్ ఉంటాయి. దీనివల్ల ఎక్కువ సమయం టైప్ చేసినా చేతులు అలసిపోవు. రీఛార్జబుల్ బ్యాటరీతో వచ్చే ఈ వైర్‌లెస్ కీబోర్డ్‌ను వన్ టచ్ బటన్‌తో ఈజీగా కనెక్ట్ చేయవచ్చు. ఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్ టాబ్లెట్లు, స్మార్ట్‌ఫోన్‌లతో ఇది పర్ఫెక్ట్‌గా పనిచేస్తుంది. ఆఫీస్ వర్క్ కోసం ప్రయాణాలు చేసే వారికి ఇది బెస్ట్ కంపానియన్.
ఈ కీబోర్డ్ ధర రూ. 1,311 గా ఉంది. దీని కస్టమర్ రేటింగ్ 3.9/5. ఇది బ్లూటూత్ 5.1 టెక్నాలజీతో పనిచేస్తుంది. దీని ప్రత్యేకత ఏంటంటే, ఒకేసారి మూడు డివైజ్‌లకు దీనిని కనెక్ట్ చేసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్, లాప్‌టాప్ మధ్య ఈజీగా స్విచ్ అవ్వచ్చు. ఇందులో టైప్-సి రీఛార్జబుల్ బ్యాటరీ ఉంటుంది. సైలెంట్ టైపింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. దీనితో పాటు ఒక అటాచబుల్ హోల్డర్ కూడా వస్తుంది, ఇది ప్రయాణాల్లో చాలా కంఫర్ట్‌ను ఇస్తుంది.
ఎక్కువ పర్ఫార్మెన్స్, పోర్టబిలిటీ కోరుకునే వారికి ఇది కరెక్ట్ చాయిస్. దీని ధర రూ. 2,299, రేటింగ్ 3.9/5 గా ఉంది. ఇది చాలా అల్ట్రా-థిన్ ఉంటుంది. ఈజీగా బ్యాగ్‌లలో సర్దేయవచ్చు. ఆండ్రాయిడ్, విండోస్, ఐఓఎస్ డివైజ్‌లకు క్విక్ వైర్‌లెస్ కనెక్టివిటీని అందిస్తుంది. ఇందులో వైర్‌లెస్ మౌస్ టచ్‌ప్యాడ్ కూడా ఇన్ బిల్ట్‌గా వస్తుంది. ప్రయాణాలు చేసే వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కు ఇది బాగా సెట్ అవుతుంది.
66
5. జికార్ట్ ఫోల్డబుల్ బ్లూటూత్ కీబోర్డ్ విత్ టచ్‌ప్యాడ్
మీకు ప్రీమియం ఆప్షన్ కావాలనుకుంటే దీనిని ఎంచుకోవచ్చు. దీని ధర రూ. 2,495 కాగా, కస్టమర్ రేటింగ్ 5.0/5 గా ఉంది. ఇందులో అదనంగా ఒక టచ్‌ప్యాడ్ కంట్రోల్ ఉంటుంది. దీనివల్ల మీరు విడిగా మౌస్ వాడాల్సిన అవసరం లేదు. దీని నియర్ ఫుల్ సైజ్ లేఅవుట్ వల్ల నార్మల్ కీబోర్డ్‌పై టైప్ చేసిన ఫీలింగ్ వస్తుంది. స్టేబుల్ బ్లూటూత్ కనెక్టివిటీ, రీఛార్జబుల్ బ్యాటరీ సపోర్ట్ దీని సొంతం. మొబైల్ వర్క్‌స్టేషన్ లాగా వాడుకోవడానికి ఇది సూపర్ గాడ్జెట్.