Realme 16T 5G: ఏఐ టూల్స్‌తో ఫొటోలు, వీడియోలు.. రియ‌ల్‌మీ నుంచి క‌ళ్లు చెదిరే స్మార్ట్‌ఫోన్

Published : May 23, 2026, 09:41 AM IST

Realme 16T 5G: రియ‌ల్‌మీ భార‌త మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. రియ‌ల్‌మీ 16టీ పేరుతో తీసుకొచ్చిన ఈ 5జీ స్మార్ట్‌ఫోన్‌లో క‌ళ్లు చెదిరే ఫీచ‌ర్ల‌ను అందించారు. ఇంత‌కీ ఫోన్‌లో ఎలంటి ఫీచ‌ర్లు ఉన్నాయి.? ధ‌ర ఎంత‌.? లాంటి పూర్తి వివ‌రాలు..  

PREV
15
8,000mAh బ్యాటరీ.. మూడు రోజుల బ్యాకప్

Realme 16Tలో ప్రధాన ఆకర్షణ 8,000mAh భారీ బ్యాటరీ. సాధారణ వినియోగంలో ఈ ఫోన్ ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే మూడు రోజుల వరకు పనిచేస్తుందని కంపెనీ పేర్కొంది. ఇందులో 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటంతో బ్యాటరీ త్వరగా ఛార్జ్ అవుతుంది. అలాగే 15W రివర్స్ ఛార్జింగ్ ఫీచర్ ద్వారా ఇతర పరికరాలను కూడా ఛార్జ్ చేయవచ్చు. ఇంకా బ్యాటరీ ఆరోగ్యాన్ని దీర్ఘకాలం కాపాడేందుకు ప్రత్యేక 7 సంవత్సరాల బ్యాటరీ హెల్త్ సొల్యూషన్ అందించారు. స్మార్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, అధునాతన బ్యాటరీ రక్షణ వ్యవస్థతో బ్యాటరీ పనితీరు ఎక్కువకాలం నిలిచి ఉండేలా రూపొందించారు.

25
144Hz డిస్‌ప్లే, మీడియాటెక్ ప్రాసెసర్

ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.78 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉంది. ఇది 729x1570 పిక్సెల్స్ రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. దీంతో వీడియోలు, గేమింగ్, సోషల్ మీడియా వినియోగంలో స్మూత్ అనుభవం లభిస్తుంది. ఫోన్‌కు శక్తినిచ్చేది మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఆక్టాకోర్ చిప్‌సెట్. రోజువారీ పనులతో పాటు మల్టీటాస్కింగ్‌ను కూడా సులభంగా నిర్వహించగల సామర్థ్యం ఇందులో ఉంది.

35
AI కెమెరా ఫీచర్లతో 50MP సోనీ సెన్సర్

ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ అందించారు. ఇందులో 50MP సోనీ IMX852 ప్రధాన కెమెరాతో పాటు 2MP మోనోక్రోమ్ సెన్సర్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16MP Sony IMX480 ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. AI ఆధారిత లుమా క‌ల‌ర్ ఇమేజ్ ఇంజ‌న్ టెక్నాల‌జీ.. స్కిన్ క‌లర్‌, ముఖ కవళికలు, ఫోటో నాణ్యతను సహజంగా మెరుగుపరుస్తుందని కంపెనీ చెబుతోంది. అలాగే RAW HDR ప్రాసెసింగ్, ప్రత్యేక వైట్ బ్యాలెన్స్ ట్యూనింగ్‌తో ఫోటోల్లో మంచి లైటింగ్, సహజమైన రంగులు కనిపిస్తాయి.

45
AI టూల్స్‌తో ఫోటోలు, వీడియోలకు కొత్త లుక్

Realme 16Tలో పలు కొత్త AI ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఏఐ పాప‌వుట్ Collage, ఏఐ స్టైల్‌మీ, AI ఇన్‌స్టా క్లిక్ వంటి టూల్స్ ద్వారా వినియోగదారులు సులభంగా క్రియేటివ్ ఫోటోలు, స్టైలిష్ పోర్ట్రెయిట్లు, షార్ట్ వీడియోలు రూపొందించుకోవచ్చు. సోషల్ మీడియా కోసం కంటెంట్ తయారు చేసే వారికి ఈ ఫీచర్లు ఉపయోగపడతాయి. ఫోటో ఎడిటింగ్, వీడియో క్రియేషన్ కోసం అదనపు యాప్‌ల అవసరాన్ని కూడా తగ్గిస్తాయి.

55
ధర, వేరియంట్లు

Realme 16T 5G మూడు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధ‌ర రూ. 26,999కాగా, 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ ధ‌ర రూ. 28,999, 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్ ధ‌ర రూ. 31,999కి ల‌భిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ మే 27, 2026 నుంచి విక్రయాలకు అందుబాటులో ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు, రియ‌ల్‌మీ అధికారిక వెబ్‌సైట్, అలాగే ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు. ప్రీబుకింగ్ చేసిన వారికి అదనపు ఆఫర్లు, బ్యాంక్ డిస్కౌంట్లు కూడా లభించనున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories