WhatsApp Call Recording : ఈ సింపుల్ ట్రిక్స్ తో.. వాట్సాప్‌ కాల్స్ కూడా రికార్డ్ చేయొచ్చు

Published : May 21, 2026, 11:01 AM IST

సాధారణంగా మన ఫోన్లలో ఆడియో కాల్స్ రికార్డ్ చేసే ఆప్షన్ ఉంటుంది. కానీ వాట్సాప్ కాల్స్ రికార్డ్ చేయడం కుదరదు. అయితే కొన్ని సింపుల్ ట్రిక్స్ వాడితే వాట్సాప్ కాల్స్‌ను కూడా సులభంగా రికార్డ్ చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం. 

PREV
15
వాట్సాప్ కాల్ రికార్డ్ చేయడం ఎలా..?

చాలా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో స్క్రీన్ రికార్డర్ ఫీచర్ ఉంటుంది. దీని సాయంతో వాట్సాప్ కాల్స్ రికార్డ్ చేయొచ్చు. ఫోన్‌లోని స్క్రీన్ రికార్డర్ ఓపెన్ చేసి 'రికార్డ్ ఆడియో' ఆప్షన్ ఆన్‌లో ఉందో లేదో చెక్ చేసుకోండి. ఆ తర్వాత వాట్సాప్ కాల్ చేయండి. కాల్ ముగిశాక ఆ రికార్డింగ్ మీ ఫోన్ గ్యాలరీలో సేవ్ అవుతుంది. కొన్ని ఫోన్లలో ఇంటర్నల్ ఆడియో రికార్డ్ కాకపోతే స్పీకర్ మోడ్ ఆన్ చేసి రికార్డ్ చేయాల్సి ఉంటుంది.

25
రికార్డింగ్ యాప్స్ వాడండి..

కొన్ని ఫోన్లలో ఇన్‌బిల్ట్ స్క్రీన్ రికార్డర్ సరిగ్గా పనిచేయకపోవచ్చు. అప్పుడు ప్లే స్టోర్‌లోని రికార్డింగ్ యాప్స్ వాడొచ్చు. ఈ యాప్స్ స్క్రీన్ వీడియోతో పాటు కాల్ ఆడియోను కూడా సేవ్ చేస్తాయి. కానీ యాప్ డౌన్‌లోడ్ చేసే ముందు దాని ప్రైవసీ పాలసీ, పర్మిషన్లు తప్పక చూడాలి. లేదంటే నకిలీ యాప్స్ మీ డేటాను దొంగిలించే ప్రమాదం ఉంది.

35
ఐఫోన్ లో కాల్ రికార్డ్ చేయండిలా...

యాపిల్ ఐఫోన్లలో సెక్యూరిటీ చాలా ఎక్కువ. అందుకే వాట్సాప్ కాల్స్ సులభంగా రికార్డ్ చేయడం కుదరదు. అయితే మ్యాక్‌బుక్ సాయంతో లేదా మరో ఫోన్ స్పీకర్ మోడ్‌లో పెట్టి రికార్డ్ చేయొచ్చు. ఇలా చేసినప్పుడు ఆడియో క్వాలిటీ కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది.

45
అనుమతితో కాల్ రికార్డింగ్ చేయండి..

ఎదుటివారి అనుమతి లేకుండా వారి కాల్ రికార్డ్ చేయడం చట్టవిరుద్ధం. కాబట్టి ఎదుటివారి ప్రైవసీని గౌరవించి అవసరమైతేనే కాల్స్ రికార్డ్ చేయండి. రికార్డ్ చేసిన ఫైల్స్‌ను జాగ్రత్తగా ఉంచుకోండి. మీ ఫోన్ ఇతరుల చేతికి చిక్కితే ఈ రికార్డింగ్స్ దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉంది. కుదిరితే అవతలి వ్యక్తి అనుమతి తీసుకుని రికార్డ్ చేయడం మంచిది.

55
వాట్సాప్ కాల్ రికార్డింగ్ ఫీచర్ వస్తుందా..?

ప్రస్తుతానికి మెటా యాజమాన్యంలోని వాట్సాప్‌లో అధికారికంగా కాల్ రికార్డింగ్ ఫీచర్ లేదు. భవిష్యత్తులో యూజర్ల అవసరాన్ని బట్టి ఈ ఫీచర్ రావొచ్చని టెక్ వర్గాలు అంటున్నాయి. అప్పటివరకు స్క్రీన్ రికార్డర్ లేదా ఇతర సురక్షితమైన పద్ధతులనే వాడాల్సి ఉంటుంది. 

Read more Photos on
click me!

Recommended Stories