ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం భారీగా పెరిగింది. అన్ని రంగాల్లో ఏఐని ఉపయోగిస్తున్నారు. మనిషికి అన్ని సలహాలు ఇస్తున్న ఏఐతో ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయని కొన్ని సంఘటనలు చెబుతున్నాయి. అలాంటి వాటిలో ఒకటి ఈ సంఘటన.
ఇటీవల క్యాలిఫోర్నియాలోని 16 ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్న ఘటనలో అతని తల్లిదండ్రులు OpenAIపై కేసు వేశారు. ఆ బాలుడి పేరు ఆడమ్. తల్లిదండ్రులు మాథ్యూ, మారియా రైన్ దాఖలు చేసిన ఫిర్యాదులో, ChatGPT తమ కుమారుడికి ఆత్మహత్యకు సంబంధించిన సలహాలు ఇచ్చిందని, చివరకు అతడిని ప్రాణాలు తీసుకునే దిశగా ప్రోత్సహించిందని ఆరోపించారు.
24
ఆత్మహత్య సూచనలు
ఫిర్యాదులోని వివరాల ప్రకారం, 2025 ఏప్రిల్ 11న ఆడమ్ ChatGPTతో చివరి సంభాషణ జరిపాడు. ఆ సమయంలో అతను ఎంచుకున్న ఆత్మహత్య పద్ధతిని సాంకేతికంగా ఎలా అమలు చేయాలో ChatGPT వివరణ ఇచ్చిందని ఆరోపించారు. గంటల వ్యవధిలోనే అదే పద్ధతిని ఉపయోగించి ఆడమ్ మృతి చెందినట్టు పేర్కొన్నారు.
34
సూసైడ్ నోట్ రాయడంలో కూడా
తల్లిదండ్రుల మాటల ప్రకారం.. మొదట ఆడమ్ చదువులో సహాయం కోసం ChatGPT ఉపయోగించాడు. కానీ క్రమంగా అతనికి చాట్‌బాట్‌పై అనారోగ్యకరమైన అనుబంధం పెరిగింది. ChatGPT అతని ప్రమాదకర ఆలోచనలకు మద్దతిచ్చి, ఆత్మహత్యా నోట్ రాయడంలో కూడా సహకరించిందని తల్లి దండ్రులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. రైన్ దంపతులు కోర్టును ఆశ్రయించి, పిల్లల భద్రత కోసం కొత్త నియమాలు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా, ఆత్మహత్య లేదా స్వీయ హానిపై చర్చలు జరిగితే వాటిని ఆటోమేటిక్‌గా ముగించే విధానం, అలాగే మైనర్ యూజర్ల కోసం పేరెంటల్ కంట్రోల్స్ అమలు చేయాలని కోరుతున్నారు.
ఈ కేసులో OpenAIతో పాటు CEO సామ్ ఆల్ట్మాన్‌ను కూడా నిందితులుగా పేర్కొన్నారు. Common Sense Media అనే అమెరికన్ స్వచ్ఛంద సంస్థ స్పందిస్తూ, AIను స్నేహితులుగా లేదా మానసిక ఆరోగ్య సలహాదారులుగా వాడటం టీనేజర్లకు ప్రమాదకరమని హెచ్చరించింది. తాజాగా వచ్చిన ఒక అధ్యయనంలో, అమెరికా టీనేజర్లలో 75% మంది AI కంపానియన్స్ వాడుతున్నారని, వారిలో సగం మంది రెగ్యులర్ యూజర్లని తేలింది.