అమెజాన్‌లో ఐఫోన్ 15 పై భారీ డిస్కౌంట్.. కానీ, మీకు ఐఫోన్ 16 బెస్ట్.. ఎందుకో తెలుసా?

Published : Sep 02, 2025, 05:15 PM IST

iPhone 15 vs iPhone 16: ఐఫోన్ 15పై అమెజాన్‌లో భారీ తగ్గింపు ఉంది. కానీ మీరు ఇప్పుడు ఈ ఫోన్ కంటే ఐఫోన్ 16ను తీసుకోవడం మంచి నిర్ణయం. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.

PREV
16
ఐఫోన్ 15 పై బిగ్ డిస్కౌంట్

iPhone 15 vs iPhone 16: అమెజాన్‌లో ఐఫోన్ 15పై భారీ తగ్గింపులు ఉన్నాయి. ఇవి యూజర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సుమారు రూ.32,000 నుండి రూ.28,000 మధ్య డిస్కౌంట్ అందుబాటులో ఉన్న ఈ ఫోన్, తక్కువ బడ్జెట్‌తో ఆపిల్ ఫోన్ కొనాలనుకునే వారికి మంచి అవకాశంగా కనిపిస్తోంది. అయితే, నిపుణులు మాత్రం కొద్దిమొత్తం ఎక్కువైన సరే దీనికి బదులు ఐపోన్ 16ను తీసుకోవాలని చెబుతున్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఐఫోన్ 16 మోడల్‌నే ఎంచుకోవడం మంచిదని సూచిస్తున్నారు. దీనికి కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

26
1. మెరుగైన ప్రాసెసర్, మంచి పనితీరు

ఐఫోన్ 15లో A16 బయోనిక్ చిప్ ఉంది. ఇది మొదటగా ఐఫోన్ 14 ప్రో మోడళ్లలో ఉపయోగించిన ప్రాసెసర్. అయితే, ఐఫోన్ 16లో కొత్తతరం A17, A18 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఈ ప్రాసెసర్ మరింత వేగవంతమైన పనితీరు, శక్తివంతమైన ఎఫిషెన్సీ అందిస్తుంది. వచ్చే సంవత్సరాల్లో యాప్స్, iOS అప్‌డేట్లు మరింత అడ్వాన్స్ అవుతున్న కొద్దీ ఐఫోన్ 16 స్పష్టమైన తేడాలను చూపిస్తుంది. అలాగే, ఎక్కువ కాలం పాటు ఫోన్ స్లో కాకుండా పనిచేస్తుంది.

36
2. ఆపిల్ ఇంటెలిజెన్స్ (AI) సపోర్ట్

ఐఫోన్ 15 మోడళ్లలో 6GB RAM మాత్రమే ఉంది. అందువల్ల యాపిల్ అందిస్తున్న తాజా AI ఫీచర్లను ఇవి మరింత మెరుగ్గా సపోర్ట్ చేయవు. కానీ ఐఫోన్ 16లో 8GB RAM ఉంది. దీంతో ఆపిల్ ఇంటెలిజెన్స్ అనే కొత్త AI ఫీచర్లను పూర్తిగా ఉపయోగించుకోవచ్చు. కొత్తఫోన్ తీసుకునే వారికి ఇది ఒక బిగ్ అప్‌గ్రేడ్.

46
3. కెమెరా కంట్రోల్స్‌లో కొత్త ఆప్షన్స్

రెండు ఫోన్లలోనూ 48MP మెయిన్ కెమెరా ఉంది. కానీ ఐఫోన్ 16లో అదనంగా "యాక్షన్ బటన్", "కెమెరా కంట్రోల్ బటన్" ఉన్నాయి. వీటి ద్వారా ఫోటోలు, వీడియోలు తీయడంలో మరింత సౌకర్యం లభిస్తుంది. ఇది ఫోటోగ్రఫీని ఇష్టపడే వారికి పెద్ద ప్లస్ పాయింట్.

56
4. మెరుగైన డిస్ప్లే, ఎక్కువ కాలం మన్నిక

ఐఫోన్ 15లో 60Hz డిస్ప్లే మాత్రమే ఉంది. కానీ ఐఫోన్ 16లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన డిస్ప్లే లు కూడా ఉన్నాయి. ఇది మరింత స్మూత్ అనుభవాన్ని ఇస్తుంది. అదనంగా, కొత్త తరం సిరామిక్ షీల్డ్ గ్లాస్‌తో ఐఫోన్ 16ను తయారు చేశారు. ఇది ఐఫోన్ 15 కంటే 50% బలంగా ఉంటుంది. డిస్ప్లేలో పీక్ బ్రైట్‌నెస్ కూడా ఎక్కువగా ఉంటుంది.

66
5. రీసేల్ లో ఎక్కువ కాలం విలువైనది

తక్కువ ధర కారణంగా ఐఫోన్ 15 ఆకర్షణీయంగా కనిపించినా, ఐఫోన్ 16 హార్డ్‌వేర్ కారణంగా ఎక్కువకాలం మంచి పనితీరును అందిస్తుంది. శక్తివంతమైన ప్రాసెసర్, అదనపు RAM వలన భవిష్యత్తులోనూ ఇది ఫాస్ట్‌గా ఉంటుంది. దీర్ఘకాలిక పెట్టుబడిగా ఐఫోన్ 16 కొనుగోలు చేయడం వినియోగదారులకు మంచి లాభం కలిగిస్తుంది. రీసేల్ లో ఎక్కువ కాలం విలువైనదిగా ఉంటుంది.

ఐఫోన్ 15పై భారీ తగ్గింపులు ఉన్నప్పటికీ, భవిష్యత్తు దృష్ట్యా ఐఫోన్ 16లోని అప్‌గ్రేడ్‌లు మరింత ప్రయోజనకరంగా ఉంటాయి. ప్రాసెసర్, AI, కెమెరా కంట్రోల్, డిస్ప్లే, రీసేల్ విలువ.. ఇలా అన్ని కలిపి ఐఫోన్ 16ని స్మార్ట్ చాయిస్‌గా ఉంచుతున్నాయి. కాబట్టి డిస్కౌంట్ కోసం ఐఫోన్ 15 తీసుకోవడం కన్నా కొంత ఎక్కువ ఖర్చు పెట్టి ఐఫోన్ 16 ఎంచుకోవడం వినియోగదారులకు బెస్ట్ ఛాయిస్ అవుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories