electric vehicles:ఈ రాష్ట్రంలో ఎలక్ట్రిక్, సి‌ఎన్‌జి వాహనాలపై బంపర్ ఆఫర్.. రిజిస్ట్రేషన్ ఫీజు, ఇతర పన్నులు కట్

Ashok Kumar   | Asianet News
Published : May 30, 2022, 12:03 PM IST

ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు లేదా నాలుగు చక్రాల వాహనాల కొనుగోలుదారులు ఇకపై మోటారు వాహనాల రిజిస్ట్రేషన్ ఫీజులు, ఇతర పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదని పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సిఎన్‌జి వాహనాలను కొనుగోలు చేయాలనుకునే వారికి కూడా రాష్ట్రంలో ఇదే విధమైన మినహాయింపు ఇవ్వబడుతుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది.

PREV
15
electric vehicles:ఈ రాష్ట్రంలో ఎలక్ట్రిక్, సి‌ఎన్‌జి వాహనాలపై బంపర్ ఆఫర్.. రిజిస్ట్రేషన్ ఫీజు, ఇతర పన్నులు కట్

ఎలక్ట్రిక్ వాహనాలు లేదా సిఎన్‌జిని ఎంచుకునే కొత్త కారు లేదా ద్విచక్రవాహన కొనుగోలుదారులు రిజిస్ట్రేషన్ ఫీజు, ఇతర పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదని మమతా బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వం పేర్కొంది. ఈ నిర్ణయం  ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఈ ఆఫర్ 31 మార్చి 2024 వరకు వాలిడిటీ అవుతుంది. 

25

గత రెండు నెలల్లో ఎవరైనా వాహనాన్ని కొనుగోలు చేసినట్లయితే వారు రిజిస్ట్రేషన్ ఫీజు ఇంకా చెల్లించిన ఇతర పన్నుల వాపసును క్లెయిమ్ చేయలేరు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 1 2022 నుండి మార్చి 31, 2024 మధ్య పన్ను చెల్లించిన ఖచ్చితమైన రోజులకు పన్ను చెల్లుబాటు పొడిగింపు రూపంలో ఆర్థిక ప్రోత్సాహకాలను అందిస్తుంది. 
 

35

ఈ నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్‌లో ఇచ్చిన హామీని నెరవేర్చింది. మే 25న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులో, “బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ వాహనాలపై పెట్టుబడులను ప్రోత్సహించడానికి అలాగే కార్బన్  తగ్గించడానికి ఇంకా పెట్రోల్/డీజిల్‌పై ఆధారపడటాన్ని తగ్గించడానికి ఏదైనా ఆర్థిక ఉపశమనం లేదా మినహాయింపు” ఇవ్వాలని భావించారు. 
 

45


ఒకప్పుడు భారతదేశపు ప్రముఖ కార్ అంబాసిడర్‌గా నిలిచిన కోల్‌కతా సమీపంలోని హిందుస్థాన్ మోటార్ ప్లాంట్‌ను పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్న నేపధ్యంలో ఈ నిర్ణయం వచ్చింది. ఎలక్ట్రిక్ కార్లను అభివృద్ధి చేసేందుకు హిందుస్థాన్ మోటార్స్ ప్యుగోట్ (ప్యూగోట్)తో ఎంఓయూ కుదుర్చుకుంది. మొదటి EV ఇప్పటి నుండి దాదాపు రెండేళ్లలో భారతీయ రోడ్లపైకి రావచ్చు. 
 

55

హిందుస్థాన్ మోటార్స్ దశాబ్దాల ఆపరేషన్ తర్వాత 2021 ప్రారంభంలో పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర్‌పరాలో  ఫ్యాక్టరీని మూసివేయవలసి వచ్చింది. ఇక్కడ అంబాసిడర్ కార్లను 1957 నుండి తయారు చేస్తుంది. కానీ గతకొన్ని సంవత్సరాలలో మోడల్‌కు డిమాండ్ లేకపోవడం, అప్పులు పెరగడం వంటి సమస్యల కారణంగా ప్లాంట్‌ను మూసివేయవలసి వచ్చింది.
 

Read more Photos on
click me!

Recommended Stories