Apple: భార‌త్‌లో ఐఫోన్ త‌యారీకి ఎంత ఖ‌ర్చ‌వుతుందో తెలుసా? అమెరికాతో పోల్చితే అంత త‌క్కువా..

Published : May 25, 2025, 07:32 AM ISTUpdated : May 25, 2025, 02:21 PM IST

ప్ర‌ముఖ స్మార్ట్‌ఫోన్ త‌యారీ సంస్థ యాపిల్ భార‌త్‌లో ప్లాంట్ల‌ను ఏర్పాటు చేస్తున్న విష‌యం తెలిసిందే. దీంతో అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ సుంకాల భారాన్ని పెంచేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. 

PREV
16
భార‌త్‌లో ఏర్పాటు చేయ‌డానికి అదే అసలు ఉద్దేశం

భారత్‌ వంటి దేశాల్లో ఐఫోన్లను తయారు చేయడం వల్ల యాపిల్‌కు పెద్ద మొత్తంలో ఖర్చు తగ్గుతుంది. ఇదే కారణంగా యాపిల్ ఇండియాలో తన అసెంబ్లింగ్‌ యూనిట్లు పెంచడంపై దృష్టి పెడుతోంది. తాజా గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (GTRI) నివేదిక ప్రకారం భారత్‌లో తయారీ వ్యయం అమెరికాతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది.

26
అసెంబ్లింగ్‌ ఖర్చుల్లో భారీ తేడా:

GTRI నివేదిక ప్రకారం, ఒక ఐఫోన్‌ను భారత్‌లో అసెంబుల్ చేయాలంటే సుమారు 30 అమెరికన్ డాలర్లు మాత్రమే ఖర్చవుతుంది. అదే అమెరికాలో అదే ఐఫోన్ అసెంబ్లీకి 390 డాలర్లు అవసరమవుతాయి. అంటే దాదాపు 13 రెట్లు ఎక్కువ. దీనికి ప్రధాన కారణం కార్మిక ఖర్చులు.

36
కార్మిక వేతనాల్లో వ్యత్యాసం

భారత్‌లో సగటు కార్మికుడి నెలవేతనం 230 డాలర్లు (దాదాపు రూ. 19,000) మాత్రమే. అదే అమెరికాలో కనీస వేతన చట్టాల ప్రకారం ఇది 2,900 డాలర్లు (రూ. 2.4 లక్షల వరకూ) ఉంటుంది. ఈ తేడా వల్లే అసెంబ్లింగ్‌ ఖర్చులో భారీ వ్య‌త్యాసం ఉంటుంది.

46
పీఎల్‌ఐ పథకం ద్వారా యాపిల్‌కు ప్రయోజనాలు

భారత ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) స్కీం కూడా యాపిల్ వంటి గ్లోబల్ కంపెనీలకు అదనపు ఆదాయాన్ని కలిగిస్తోంది. ఈ పథకం ద్వారా తయారీ కంపెనీలకు ట్యాక్స్ బెనిఫిట్లు, సబ్సిడీలు లభిస్తున్నాయి. ఫలితంగా ఎక్స్‌పోర్ట్‌ను ప్రోత్సహిస్తూ, దేశీయంగా ఉద్యోగావకాశాలు కూడా పెరుగుతున్నాయి.

56
ట్రంప్ కీల‌క వ్యాఖ్య‌లు

ఈ నేప‌థ్యంలోనే యాపిల్ సంస్థ‌ను ఉద్దేశించి ట్రంప్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. "భారత్‌లో ప్లాంట్లు పెట్టొచ్చు. కానీ అమెరికాలో సుంకాలు లేకుండా ఐఫోన్లను విక్రయించాలంటే, అమెరికాలోనే తయారీ జరగాలి" అని వ్యాఖ్యానించారు. యాపిల్‌ తమ ఉత్పత్తిని భారత్‌ నుంచి అమెరికాకు దిగుమతి చేసుకుంటే 25 శాతం దిగుమతి సుంకం చెల్లించాల్సి ఉంటుంది.

66
భార‌త్‌నే ఎందుకు ఎంచుకుంది

ప్రపంచంలో భారత్‌ రెండవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌. యాపిల్‌ ఇటీవల హైదరాబాద్‌లో R&D సెంటర్‌తో పాటు తమిళనాడు, కర్ణాటకలో భారీగా పెట్టుబడులు పెట్టింది. మేక్ ఇన్ ఇండియా నినాదానికి అనుగుణంగా కంపెనీ తమ ప్రొడక్షన్ సామర్థ్యాన్ని ఇండియాలో పెంచుతోంది. అంతేకాదు రానున్న కొన్ని రోజుల్లోనే యాపిల్ తయారీ సామర్థ్యంలో 25% వరకూ భారత్‌ లో ఉత్పత్తి చేయాలని ల‌క్ష్యంగా పెట్టుకుంది.

Read more Photos on
click me!

Recommended Stories