ATM: కార్డు లేకుండా ఏటీఎమ్‌లో డ‌బ్బులు తీసుకోవ‌చ్చు.. ఫోన్‌పే, గూగుల్ పే ఉంటే చాలు

Published : May 23, 2025, 02:35 PM IST

ఒక‌ప్పుడు డ‌బ్బులు కావాలంటే బ్యాంకు వెళ్లి విత్‌డ్రా ఫామ్ తీసుకొని పెద్ద లైన్‌లో నిల‌బ‌డే వాళ్లం కానీ ప్ర‌స్తుతం కాలం మారింది. చేతిలో ఏటీఎమ్ కార్డు ఉంటే చాలు క్ష‌ణాల్లో డ‌బ్బులు వ‌చ్చేస్తున్నాయి. అయితే మారిన కాలంతో పాటు ఏటీఎమ్ సేవ‌లు కూడా మారాయి. 

PREV
16
భారీగా పెరిగిన యూపీఐ పేమెంట్స్:

ప్ర‌స్తుతం దేశంలో డిజిట‌లైజేష‌న్ భారీగా పెరిగింది. ముఖ్యంగా డిజిట‌ల్ ఎకాన‌మీ ఓ రేంజ్‌లో పెరుగుతోంది. జేబులో క్యాష్ క్యారీ చేసే వారి సంఖ్య తగ్గుతోంది. చిన్న చాక్లెట్ నుంచి పెద్ద పెద్ద లావాదేవీల వ‌ర‌కు యూపీఐ యాప్స్‌ను ఉప‌యోగిస్తున్నారు. ప్ర‌తీ ఒక్క‌రికీ స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి రావ‌డం, ఇంట‌ర్నెట్ ఛార్జీలు త‌గ్గ‌డంతో యూపీఐ పేమెంట్స్ పెరిగాయి.

26
ఇప్ప‌టికీ క్యాష్ అవ‌స‌రం:

అయితే డిజిట‌ల్ పేమెంట్స్ ఇంత‌లా విస్త‌రిస్తున్న త‌రుణంలో కూడా చాలా మంది డ‌బ్బుల‌తో లావాదేవీలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఏటీఎమ్‌ల నుంచి క్యాష్ విత్‌డ్రా చేస్తున్నారు. అయితే ఏటీఎమ్ నుంచి క్యాష్ విత్‌డ్రా చేయాలంటే క‌చ్చితంగా ఏటీఎమ్ కార్డు ఉండాల‌ని మ‌న‌కు తెలిసిందే. కానీ ఏటీఎమ్ లేక‌పోయినా డ‌బ్బులు విత్ డ్రా చేసుకోవ‌చ్చు.

36
అందుబాటులో ప‌లు యాప్స్‌:

సాధార‌ణంగా ఏటీఎమ్‌ల నుంచి కార్డు లేకుండా డ‌బ్బు విత్‌డ్రా చేసుకోవ‌డానికి కొన్ని ర‌కాల యాప్స్ ఉన్నాయి. ఎస్‌బీఐకి చెందిన యోనో, ఐసీఐసీ మొబైల్ యాప్‌, యాక్సిస్ యాప్ వంటివి అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ యాప్స్‌తో కేవ‌లం స‌ద‌రు బ్యాంకుల ఏటీఎమ్స్‌లోనే ఉప‌యోగించుకునే అవ‌కాశం ఉంటుంది.

46
ఫోన్ పే, గూగుల్ పేతో కూడా:

ఏ ఏటీఎమ్‌లో అయినా కార్డు లేకుండా డ‌బ్బుల‌ను విత్‌డ్రా చేసుకునే అవ‌కాశం ఉంద‌ని మీకు తెలుసా.? మీ ఫోన్‌పే లేదా గూగుల్ పే యాప్ ద్వారా ఏటీఎమ్ నుంచి డ‌బ్బులు ఎంచ‌క్కా తీసుకోవ‌చ్చు. ఇందుకోసం ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ ఇప్పుడు తెలుసుకుందాం.

56
యూపీఐ క్యూాఆర్ ఆప్షన్

* ఇందుకోసం ముందుగా మీకు స‌మీపంలోని ఏటీమ్‌కు వెళ్లి. స్క్రీన్‌పై క‌నిపించే యూపీఐ క్యూఆర్ క్యాష్ అనే ఆప్ష‌న్‌ను క్లిక్ చేయాలి.

* ఆ త‌ర్వాత మీరు ఎంత అమౌంట్‌ను విత్‌డ్రా చేయాల‌నుకుంటున్నారో అమౌంట్‌ను ఎంట‌ర్ చేసి కంటిన్యూ బ‌ట‌న్‌పై క్లిక్ చేయాలి.

* వెంట‌నే స్క్రీన్‌పై ఒక క్యూఆర్ కోడ్ జ‌న‌రేట్ అయి డిస్‌ప్లే అవుతుంది.

66
స్కాన్ చేసి పిన్ ఎంటర్ చేయాలి.

* మీ పోన్‌లోని ఫోన్‌పే లేదా గూగుల్ పే వంటి యాప్‌తో ఆ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలి.

* ఆ త‌ర్వాత వెంట‌నే మీ యూపీఐ పిన్ అడుగుతుంది. పిన్ ఎంట‌ర్ చేయాలి. వెంట‌నే ఏటీఎమ్ నుంచి క్యాష్ వ‌చ్చేస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories