గత 9 ఏళ్లలో అంతరిక్షంలో ఇండియా సాధించిన మరపురాని విజయాలు, చంద్రయాన్-3 మిషన్!!

First Published | Aug 23, 2023, 7:52 PM IST

గత 9 ఏళ్లలో భారతదేశం సాధించిన అంతరిక్ష విజయాలకు కొత్త కోణాన్ని జోడిస్తూ, చంద్రయాన్ 3   మిషన్ సక్సెస్ భారతదేశంలోని అంతరిక్ష అద్భుతాలను తెలుసుకోవడానికి మాకు సహాయపడిందని కేంద్ర ప్రభుత్వం ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. నేడు చంద్రయాన్ 3 మెరుగైన టెక్నాలజీతో  చంద్రుడిపైకి దిగింది. ఈరోజు సాయంత్రం 6.00 నుండి 6:30 గంటల మధ్యలో  ల్యాండ్ అయినట్లు ఇస్రో ప్రకటించింది. ఈ క్షణాన్ని చూసేందుకు భారతీయులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసారు.
 

ఇస్రో సాధించిన ఘనత

గత 9 ఏళ్లలో 424 విదేశీ ఉపగ్రహాల్లో 389  ఇస్రో ప్రయోగించింది. అంతరిక్ష పరిశోధనలో మన స్కిల్స్ కి ఇది నిదర్శనం. 
 

స్పేస్ బడ్జెట్ 

గత పదేళ్లలో భారతదేశ అంతరిక్ష బడ్జెట్ రూ. 5615 కోట్ల నుంచి రూ. 12543 కోట్లు పెరిగింది. 
 

Latest Videos


ఉపగ్రహ(satilite) ఆదాయం

గత తొమ్మిదేళ్లలో 389 విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించడం ద్వారా దేశానికి రూ. 3,300 కోట్ల ఆదాయం సమకూరింది. ఇది దేశాల మధ్య అంతరిక్ష ఒప్పందానికి ఉదాహరణ.
 

ఇస్రో ఉపగ్రహాల సంఖ్య

2014 వరకు సంవత్సరానికి 1.2 చొప్పున ఉపగ్రహాలను ప్రయోగించేవారు. 2014 నుండి ఈ రేషియో  5.7 కి పెరిగింది. 
 

ఇస్రో ఉపగ్రహం

ఇస్రో మిసైల్ సంఖ్య 2014కి ముందు 4 నుంచి 2014 నాటికి 11కి పెరిగింది. దీంతో యువతలో అంతరిక్ష పరిశోధనల పట్ల ఆసక్తి పెరిగింది.

చంద్రయాన్ ఆర్బిటర్

చంద్రయాన్ ఆర్బిటర్ పరిశోధకులకు అద్భుతమైన శాస్త్రీయ డేటాను అందిస్తుంది. దీంతో నేడు చంద్రుడిపై అడుగు పెట్టిన చంద్రయాన్ 3ని  ప్రపంచ దేశాలు నిశితంగా చూస్తున్నాయి.
 

UVICA ప్రాజెక్ట్

ఫ్యూచర్ సైన్టిస్ట్ లను తీర్చిదిద్దేందుకు UVICA అన్యువల్ స్పెషల్ ప్రోగ్రాం  ప్రవేశపెట్టింది. తిరువనంతపురం, జమ్మూ ఇంకా అగర్తల ఇన్‌స్టిట్యూట్‌లలో 100% ప్లేస్‌మెంట్‌లతో 3 సంవత్సరాలలో 603 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
 

ప్రైవేట్ లాంచ్ ప్యాడ్

25 నవంబర్ 2022న, మొదటి ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ అండ్  మిషన్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుతో చరిత్ర సృష్టించింది. ఇది అంతరిక్ష పరిశోధనలో కొత్త శకానికి నాంది పలికింది.

SSLV - D2 ఉపగ్రహం

స్పేస్ కిడ్స్ కార్యక్రమం ద్వారా 750 మంది స్కూల్ విద్యార్థినుల సహకార ప్రయత్నం చారిత్రాత్మకమైన SSLV-D2 మూడు ఉపగ్రహాలను ప్రయోగించడానికి దారితీసింది.
 

నాసాతో భారతదేశ భాగస్వామ్యం

అంతరిక్ష పరిశోధనల తదుపరి దశ కోసం నాసాతో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. చంద్రయాన్ 3 విజయం ఈ ఒప్పందాన్ని మరింత బలోపేతం చేసింది. చంద్రయాన్ 3 విజయం తదుపరి దశగా మానవులను చంద్రునిపైకి దింపడానికి ఆర్టెమిస్ కార్యక్రమానికి సహాయపడుతుంది. నిసార్ శాటిలైట్ రూ. 470 కోట్లు కేటాయించారు. ఇస్రో ఇంకా నాసా వివిధ ప్రాజెక్టులలో చేతులు కలిపాయి.
 

140 స్టార్టప్ కంపెనీలు

2020 నాటికి భారత అంతరిక్షంలో 140 స్టార్టప్‌లు సహాయపడుతున్నాయి.  IN-SPAce పరిశ్రమ, విద్యాసంస్థ ఇంకా ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థను నిర్మించడం ద్వారా ఈ అంతరిక్ష అన్వేషణను తిరిగి రాస్తోంది.

click me!