
Google CEO Sundar Pichai : గూగుల్... టెక్నాలజీ రంగంలో ఓ విప్లవాన్ని సృష్టించిన సంస్థ. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరు ఈ గూగుల్ ను ఉపయోగిస్తారు... నేటితరం యువత ఇందులో మునిగితేలుతున్నారు. ఇలాంటి ప్రతిష్టాత్మక సంస్థను నడిపించేది ఓ భారతీయుడు... అందుకే ఈ విషయాన్ని మనమెంతో గర్వంగా చెప్పుకుంటాం. దాదాపు దశాబ్దకాలంగా గూగుల్ సీఈవో గా వ్యవహరిస్తూ కంపెనీని సక్సెస్ బాటలో నడిపుతున్నారు సుందర్ పిచాయ్.
అయితే చాలాకాలంగా గూగుల్ కు సేవలందిస్తున్న సుందర్ పిచాయ్ ను సీఈవో బాధ్యతల నుండి తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని టెక్ సర్కిల్ లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయనను తప్పించి గూగుల్ లో అత్యంత కీలకమైన వ్యక్తికి ఈ బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలా సుందర్ ను ఎందుకు తప్పించాలనుకుంటున్నారు? గూగుల్ కొత్త సీఈవో ఎవరు? అనే అంశాలపై ఇక్కడ చర్చిద్దాం.
గూగుల్ తో సుందర్ పిచాయ్ కి విడదీయరాని అనుబంధం ఉంది. అతడు 2004 లో ఈ సంస్థలో చేరారు... అంటే దాదాపు రెండు దశాబ్దాలకు పైగా సేవలందిస్తున్నారు. అతడి పనితీరు నచ్చడంతో గూగుల్ వ్యవస్థాపకులు లారీ ఫేజ్, సెర్గీ బ్రిన్ ల తర్వాత సీఈవోగా బాధ్యతలు అప్పగించారు. ఇన్వెస్టర్స్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయకుండా సుందర్ కూడా మంచి గ్రోత్ చూపించారు. క్రోమ్, ఆండ్రాయిడ్, గూగుల్ మ్యాప్, యూట్యూబ్ వంటి అనేక అద్భుతమైన సాంకేతికతను అందిస్తూవచ్చింది గూగుల్.
అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పోటీలో గూగుల్ కాస్త వెనకబడిందనే చెప్పాలి. ఓపెన్ ఏఐ చాట్ జిపిటి తో గూగుల్ చాట్ బార్డ్, జెమినిలు పోటీ పడలేకపోతున్నాయి. గూగుల్ ఏఐ చాట్ బాట్స్ తప్పుడు సమాచారాన్ని అందిస్తున్నాయనే అపప్రద మూటగట్టుకుంది. ఇలా గూగుల్ ఇన్నోవేషన్ విషయంలో వెనకబడిపోయిందని భావిస్తున్న ఇన్వెస్టర్లు సీఈవోగా కొత్తవారిని నియమించాలని చూస్తున్నారట... అందుకే సుందర్ పిచాయ్ ను తప్పించేందుకు సిద్దమైనట్లు టెక్ వర్గాల టాక్.
ఒకవేళ సుందర్ పిచాయ్ ను గూగుల్ సీఈవో బాధ్యతల నుండి తప్పిస్తే మరోసారి కోఫౌండర్ సెర్గీ బ్రిన్ కు ఆ బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయి. సుందర్ కు ముందు ఈయనే ఈ సీఈవో బాధ్యతలు చూసుకున్నారు... అయితే సహోద్యోగితో అక్రమ సంబంధాన్ని కలిగివున్నాడనే ఆరోపణలతో తొలగించారు. ఈ కేసు ప్రస్తుతం చివరిదశలో ఉంది... ఇందులోంచి సెర్గీ బయటపడే అవకాశాలుండటంతో మళ్లీ గూగుల్ బాధ్యతలు చేపట్టాలని చూస్తున్నాడట. అందుకే ఇన్వెస్టర్స్ పై ఒత్తిడి తీసుకువచ్చి సుందర్ ను తప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
2015 లో సెర్గీ సీఈవో బాధ్యతల నుండి తప్పుకున్నాక ఆండ్రాయిడ్ సృష్టికర్త ఆండీ రూబిన్ ను నియమిస్తారని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా సుందర్ పిచాయ్ పేరు తెరపైకి వచ్చింది. ఆగస్ట్ 11, 2015 లో గూగుల్, 2019 లో మాతృసంస్థ ఆల్పాబెట్ సీఈవో బాధ్యతలు చేపట్టారు. చాలా కష్టపడి గూగుల్ ను అందనంత ఎత్తులో నిలబెట్టారు... ఇతడి సారథ్యంలోని కంపెనీ ఆదాయం 4 రెట్లు పెరిగింది. అలాగే గూగుల్ ను వివాదాలకు దూరంగా ఉంచారు సుందర్ పిచాయ్.
తమిళనాడులోని మధురైలో ఓ తమిళ హిందూ కుటుంబంలో రేగునాథ పిచాయ్-లక్ష్మి దంపతులకు జన్మించాడు సుందర్ పిచాయ్. ఇతడి విద్యాభ్యాసమంతా చెన్నైలోనే సాగింది. ఖరగ్ పూర్ ఐఐటీ నుండి ఇంజనీరింగ్ పూర్తిచేశాడు. అనంతరం అమెరికా వెళ్లి పెన్సిల్వేనియా యూనివర్సిటీ నుండి ఎంబిఏతో పాటు ఎంఎస్ పూర్తిచేశారు.
పిచాయ్ తన కెరీర్ ను మేనేజ్మెంట్ కన్సల్టెంగ్ సంస్థ మెకిన్స్&కో లో మెటీరియల్స్ ఇంజనీర్ గా ప్రారంభించారు. అనంతరం 2004 లో గూగుల్ లో చేరారు... గూగుల్ టూల్ బార్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ప్రాడక్ట్ మేనేజర్ పనిచేశారు. గూగుల్ టూర్ బార్ భవిష్యత్ లో అంతం కాబోతోందని గ్రహించి మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కొత్త బ్రౌజర్ ను తయారుచేసుకోవాలని కంపెనీకి సూచించాడు. దీని ఫలితమే 2008 గూగుల్ క్రోమ్ లాంచ్... ఇది అద్భుత విజయం సాధించడంతో పిచాయ్ గూగుల్ లో కీలక వ్యక్తిగా మారిపోయాడు. అచెలంచెలుగా ఎదిగి గూగుల్ సీఈవో స్థాయికి చేరుకున్నారు.