Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్‌లో కొత్త సేల్‌.. ఐఫోన్ 16పై ఏకంగా రూ. 40 వేల డిస్కౌంట్‌.

Published : Oct 04, 2025, 07:32 AM IST

Flipkart Sale: మొన్న‌టి వ‌ర‌కు బిగ్ బిలిన్ డేస్ పేరుతో ఆఫ‌ర్లు అందించిన ఫ్లిప్‌కార్ట్ తాజాగా బిగ్ ఫెస్టివ‌ల్ ధ‌మాకా సేల్ పేరుతో మ‌రోసారి ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టించింది. ఈ సేల్‌లో భాగంగా ఐఫోన్ 16పై క‌ళ్లు చెదిరే డిస్కౌంట్స్‌ను అందిస్తోంది. 

PREV
15
బిగ్ బిలియన్ డేస్ తర్వాత కొత్త సేల్

బిగ్ బిలియన్ డేస్ సేల్‌ ముగిసిన వెంటనే ఫ్లిప్‌కార్ట్ అక్టోబర్‌ 4న మరో ప్రత్యేక ఆఫర్‌ను ప్రారంభించింది. ఈసారి “బిగ్ ఫెస్టివల్ ధమాకా సేల్” పేరుతో కస్టమర్లకు ఆకట్టుకునే ఆఫర్లు అందిస్తోంది. ముఖ్యంగా iPhone 16 సిరీస్‌తో పాటు పలు ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపులు ప్రకటించింది. బిగ్ బిలియన్ డేస్‌లో ఫోన్‌ కొనలేకపోయినవారికి ఇది మరో అవకాశం అని చెప్పవచ్చు.

25
ఐఫోన్ 16పై అద్భుతమైన తగ్గింపు

సేల్ సమయంలో iPhone 16 ధరలో గణనీయమైన తగ్గింపు కనిపిస్తోంది. లాంచ్ ధర రూ. 79,900 కాగా, ప్రస్తుతం ఇది రూ. 56,999కే లభిస్తోంది. అంటే దాదాపు రూ. 22,901 డిస్కౌంట్ పొందవచ్చు. బడ్జెట్‌లో ప్రీమియం ఐఫోన్‌ కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది మంచి అవకాశంగా భావించవచ్చు.

35
ఐఫోన్ 16 ప్రోపై భారీ ఆఫ‌ర్

ఆపిల్‌ తన వెబ్‌సైట్‌ నుంచి iPhone 16 ప్రో మోడల్‌ను తొలగించింది. అయినప్పటికీ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఇది ఇంకా లభిస్తోంది. లాంచ్ సమయంలో రూ. 1,19,900 ధర ఉన్న ఈ మోడల్‌ ఇప్పుడు కేవలం రూ. 85,999కే అందుబాటులో ఉంది. అంటే కస్టమర్లు దాదాపు రూ. 34,000 వరకు ఆదా చేసుకోవచ్చు.

45
ఐఫోన్ 16 ప్రో మాక్స్ – భారీ సేవింగ్

iPhone 16 ప్రో మాక్స్ 256GB వేరియంట్‌ను ఫ్లిప్‌కార్ట్ ఈ సేల్‌లో భారీ తగ్గింపుతో అందిస్తోంది. మొదట లాంచ్ ధర రూ. 1,44,900 కాగా, ప్రస్తుతం ఇది రూ. 1,04,999కే లభిస్తోంది. అంటే సుమారు రూ. 40,000 తగ్గింపు పొందొచ్చు. ఈ ధరలో బ్యాంక్ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్, ఎక్స్చేంజ్ బోనస్ వంటి అదనపు ప్రయోజనాలు కూడా పొందవచ్చు.

55
ఇతర స్మార్ట్‌ఫోన్‌లపై ఆఫర్లు

ఈ సేల్‌ ప్రత్యేకత కేవలం ఐఫోన్‌లకే పరిమితం కాదు. సామ్‌సంగ్ గ్యాల‌క్సీ ఎస్‌24, మోటోరోలా 60 ఫ్యూజ‌న్‌, ఒప్పో K13x 5G, మోటో జీ96 5G వంటి మోడళ్లపై కూడా గణనీయమైన తగ్గింపులు ప్రకటించింది. దీంతో కస్టమర్లు తమ అవసరాలు, బడ్జెట్‌కి తగ్గట్లు అనేక బ్రాండ్‌లలోంచి ఎంపిక చేసుకునే అవకాశం పొందుతున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories