ChatGPT : చాట్‌జిపిటి వాయిస్ ఫీచర్‌ను ఎలా ఉపయోగించాలి… ఏఐతో మాట్లాడటానికి సెట్టింగ్స్‌ను ఎలా మార్చాలో తెలుసుకోండి. మీరు కూడా ఇక టైపింగ్ కు గుడ్ బై చెప్పి మాటలతోనే సమాధానం పొందండి.
చాట్‌జిపిటి… మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో మాట్లాడే విధానాన్ని పూర్తిగా మార్చేసింది. టైపింగ్ చేయడం కంటే మీ వాయిస్‌ని ఉపయోగించి సమాధానాలు పొందే విధానాన్ని తీసుకువచ్చింది. ఇది ఓ మేధావితో నిజంగా మాట్లాడి సరైన సమాధానం పొందినట్లు అనుభూతిని ఇస్తుంది. ఇలా చాట్‌జిపిటి వాయిస్ ఫీచర్‌తో యూజర్లు నేరుగా AIతో మాట్లాడొచ్చు. ఇది చాలా సహజమైన, అడ్డంకులు లేని అనుభవాన్ని అందిస్తుంది. ఈ ఫీచర్‌ను ఎలా ఎనేబుల్ చేయాలో, వాయిస్ స్పష్టంగా ఉండటానికి ఎలాంటి టిప్స్ పాటించాలో ఇక్కడ తెలుసుకుందాం.
26
మీ మాటలకు ఏఐ సమాధానం
చాట్‌జిపిటి వాయిస్ ఫీచర్ టైప్ చేయడం కాకుండా ఏఐతో నేరుగా మాట్లాడటానికి సాయపడుతుంది. టైప్ చేయడంద్వారా సమాధానం పొందినట్లే మీరు మాట్లాడితే కూడా ఏఐ వెంటనే సమాధానం ఇస్తుంది. మీరు ఇతర పనులు చేస్తున్నప్పుడు, చేతులు బిజీగా ఉన్నప్పుడు లేదా సహజమైన అనుభవం కావాలనుకున్నప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుంది. మీరు చెప్పేది విని, అర్థం చేసుకుని ఏఐ కచ్చితమైన సమాధానాలు ఇస్తుంది.
36
చాట్ జిపిటి వాయిస్ ఆప్షన్ స్టెప్ బై స్టెప్ గైడ్
హ్యాండ్స్-ఫ్రీ సహాయం కోసం చాట్‌జిపిటి వాయిస్ ఫీచర్‌ను ఎలా ఉపయోగించాలో తెలుసా? దీన్ని ఎనేబుల్ చేయడం చాలా సులభం. దానికోసం సింపుల్ స్టెప్స్ ఇక్కడ ఉన్నాయి.
1. చాట్‌జిపిటి యాప్ ఓపెన్ చేయండి : వాయిస్ చాట్ కోసం చాట్‌జిపిటి యాప్‌ను తెరవండి.
2. సెట్టింగ్స్‌కు వెళ్లండి: సెట్టింగ్స్‌లో 'వాయిస్' లేదా 'స్పీచ్' ఆప్షన్‌ను కనుగొనండి.
3. మైక్రోఫోన్ యాక్సెస్ అనుమతించండి: చాట్‌జిపిటి యాప్ మీ మైక్రోఫోన్‌ను ఉపయోగించడానికి అనుమతించండి.
4. వాయిస్‌ను ఎంచుకోండి (ఆప్షనల్): కొన్ని వెర్షన్లలో మీరు AI వాయిస్ లేదా భాషను ఎంచుకోవచ్చు.
5. మాట్లాడటం ప్రారంభించండి: మైక్ ఐకాన్‌పై నొక్కి మాట్లాడటం మొదలుపెడితే ఏఐ వెంటనే స్పందిస్తుంది.
ఏఐతో మాట్లాడున్నారా..? ఖచ్చితమైన సమాధానం కోసం చిట్కాలు
AIతో మాట్లాడేటప్పుడు ఖచ్చితమైన సమాధానాల కోసం కొన్ని చిట్కాలు
• స్పష్టంగా మాట్లాడండి.
• వాఖ్యాలను చిన్నగా ఉండేలా చూడండి
• వాఖ్యాల మధ్య విరామం ఇవ్వండి.
• బ్యాక్‌గ్రౌండ్ శబ్దం లేకుండా చూసుకోండి.
56
ChatGPT వాయిస్ ఉపయోగాలు
చాట్‌జిపిటితో వాయిస్ ఉపయోగించడం టైపింగ్ కంటే వేగవంతమైనదే కాదు చాలా సౌకర్యవంతమైనది కూడా. వంట చేసేటప్పుడు, డ్రైవింగ్ చేసేటప్పుడు లేదా చేతులు బిజీగా ఉన్నప్పుడు దీన్ని వాడొచ్చు. టైప్ చేయడం లేదా స్క్రీన్ చూడటం కష్టంగా ఉన్నవారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇది రోబోతో కాకుండా, నిజమైన వ్యక్తితో మాట్లాడుతున్న అనుభూతిని ఇస్తుంది.
66
చాట్‌జిపిటి వాయిస్‌తో మీరు చేయగల పనులు
• త్వరిత ప్రశ్నలు: వాతావరణం, గణితం వంటి ప్రశ్నలు అడగవచ్చు.