DeepSeek-ChatGPT: డీప్‌సీక్‌ పతనం.. దూసుకెళ్తున్న చాట్‌ జీపీటీ.. ఇలాగైతే దాన్ని మూసేయడమే!

DeepSeek-ChatGPT: ప్రస్తుతం ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ యుగం నడుస్తోంది. కృత్రిమ మేధస్సు అన్ని రంగాల్లోనూ ప్రవేశించింది. ఇక చైనా అభివృద్ది చేసిన డీప్‌సీక్‌, అమెరికా తీసుకొచ్చి చాట్‌ జీపీటీ ఏఐ ఫ్లాట్‌ఫాంలు మార్కెట్లో అడుగుపెట్టాయి. ఈ రెండు ఫ్లాట్‌ఫాంలు తొలిరోజుల్లో వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే.. ఆరంభంలో డీప్‌సీక్‌ చాట్‌జీపీటీని వెనక్కి నెట్టేస్తుందా అన్నట్లు దూసుకెళ్లింది. కానీ డీప్‌సీక్‌ వినియోగదారులను పెంచుకోవడంలో విఫలమవుతోందని ఇది పతనానికి దారితీస్తుందని టెక్‌ దిగ్గజాలు అభిప్రాయపడుతున్నారు. దీనికి కారణం ఏంటి? అన్న వివరాలు తెలుసుకుందాం. 
 

DeepSeek Struggles as ChatGPT Surges Ahead in AI Race in telugu tbr
DeepSeek Struggles as ChatGPT Surges Ahead in AI Race

ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (AGI)ను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో చైనాలో 2023లో డీప్‌సీక్‌ అనే కంపెనీని స్థాపించారు. పరిశోధన, అభివృద్ది రంగాల్లో డీప్‌సీక్‌ను వినియోగిస్తున్నారు. కొన్ని సందర్బాల్లో కోడింగ్‌కు కూడా ఉపయోగపడుతోంది. చాట్‌జీపీటీ ఒపెన్‌ ఏఐతో అభివృద్ధి చేశారు. ఇక్కడ వినియోగదారులు సంభాషించుకునేలా రూపొందించారు. దీన్ని పరిశ్రమల్లో విస్తృతంగా వినియోగిస్తున్నారు. వ్యక్తిగత, వ్యాపార వ్యవహారాలకు సంబంధించి సలహాలు, సూచనలు ఈ టెక్నాలజీ ఇస్తోంది. 

DeepSeek Struggles as ChatGPT Surges Ahead in AI Race in telugu tbr
ChatGPT Surges Ahead in AI Race

డీప్‌సీక్ తొలిసారి మార్కెట్‌లో అడుగుపెట్టిన సమయంలో త్వరగా వినియోగదారులను ఆకర్షించింది. చాట్‌ జీపీటీకి ప్రత్యామ్నాయంగా ఈ టెక్నాలజీ వచ్చిందని దీంతోపాటు చాలా తక్కువ ఖర్చుతో చైనా ఈ ప్రాడొక్టును మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీంతో మీడియా, ప్రజల దృష్టిని డీప్‌సీక్ ఆకట్టుకుంది. అయితే.. డీప్‌సీక్‌ని వచ్చిన తొలి మూడు వారాల వరకు వినియోగదారులు భీభత్సంగా వాడారు. ఇక క్రమక్రమంగా వినియోగదారుల సంఖ్యతగ్గడం ప్రారంభమైంది. ఈ విషయాన్ని టెక్నాలీజీ సంస్థలు గణాంకాలతో చెబుతున్నాయి. 


ChatGPT Surges Ahead in AI Race

డీప్‌సీక్‌ ప్రారంభించినప్పుడు వచ్చిన పాజిటివిటీని నిలబెట్టుకోలేకపోతోంది. స్టెబిలిటీతో వినియోగదారులను పెంచుకోలేకపోతుంది. మరోవైపు చాట్‌ జీపీటీ నెమ్మదిగా యూజర్స్‌ని పెంచేసుకుంటోంది. అది స్థిరత్వాన్ని కనబరుస్తూ.. పోటీలో ముందుకు వరుసలోకి వచ్చేసింది. చాట్‌ జీపీటీ ఒక్కో యూజర్‌కు ఎక్కువ సమయం గడుపుతున్నారు. దీంతోపాటు గణనీయంగా యూజర్లు కూడా పెరిగారు. దీంతో డీప్‌సీక్‌ పతనం మొదలైందా అన్న సంకేతాలు వస్తున్నాయి. 

Look at the situation... Children also need Chat GPT

రీసెంట్‌గా విడుదలైన డేటా ప్రకారం.. చాట్‌ జీపీటీని వినియోగించే సగటు వినియోగదారుల సంఖ్య డీప్‌సీక్‌ కంటే గణనీయంగా ఉంది. సుమారు రెట్టింపు మంది ప్రజలు డీప్‌సీక్‌ కంటే చాట్‌జీపీటీని వినియోగిస్తున్నారు. అంతేకాడు.. చాట్‌ జీపీటీనీ ఎక్కువ సమయం వినియోగిస్తున్నారు. దీంట్లో కూడా డీప్‌సీక్‌ కంటే చాట్‌ జీపీటీ చాలా ముందంజలో ఉంది. దీని ప్రకారం డీప్‌సీక్‌ యూజర్లను ఆకర్షించలేకపోతోందని తెలుస్తోంది. వినియోగదారులకు కావాల్సిన సర్వీసులు ఇవ్వలేకపోవడం వల్లే  ఈ పరిస్థితి వస్తుందని మార్కెట్‌ ప్రముఖులు చెబుతున్నారు. 

ChatGPT Surges Ahead in AI Race

మార్కెట్‌లో ఒక ప్రొడక్ట్‌ విజయవంతం కావాలంటే.. దాని ప్రారంభంలో ఎంత పాజిటివ్‌ ప్రచారం అవసరమో.. తర్వాత రోజుల్లో కూడా ఆ స్థిరత్వాన్ని కొనసాగించాలి. ఒకవేళ అలా ఆధరణ పొందలేకపోతుంది అంటే.. ప్రొడక్ట్‌ సేవలు వినియోగదారులకు నచ్చడం లేదని, లేదా వారు ఆశించిన స్థాయిలో లేదని అర్థం. దీని ప్రకారం.. డీప్‌సీక్‌ వినియోగదారులను పెంచుకోవడంలోనూ .. ఉన్నవారు ఎక్కువ సమయం ఆ యాప్‌ను వినియోగించేలా చేయడంలో విఫలమవుతోంది. తక్కువ ఖర్చుతో రూపొందించిన టెక్నాలజీగా డీప్‌సీక్‌ ప్రశంసలు పొందినప్పటికీ దీర్ఘకాలంలో చాట్‌జీపీటీతో పోటీ పడాలని భావిస్తే మాత్రం అందుకు తగ్గట్లు సేవలను మెరుగుపరచాల్సి ఉంటుంది. అయితే.. ఇప్పటికే చాట్‌జీపీటీ కంటే డీప్‌సీక్‌ వెనుకంజలో ఉన్నప్పటికీ భవిష్యత్తులో డీప్‌సీక్‌కు ఇంకా అవకాశాలు ఉన్నాయని పక్కా ప్రణాళికతో వినియోగదారులకు సేవలు అందించి ఆకర్షిస్తే తప్ప లాంగ్‌రన్‌లో డీప్‌సీక్‌ చాట్‌జీపీటీ పోటీ తట్టుకునేలా లేదు. 

Latest Videos

vuukle one pixel image
click me!