క్లౌడ్‌ఫ్లేర్ ఆగితే ప్ర‌పంచ‌మే ఆగిపోతుంది.. అస‌లేంటీ క్లౌడ్‌ఫ్లేర్.? ఎందుకు ఉప‌యోగిస్తారు.?

Published : Nov 19, 2025, 11:06 AM IST

Cloudflare: ప్ర‌ముఖ సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో మంగ‌ళ‌వారం అంత‌రాయం ఏర్ప‌డిన విష‌యం తెలిసిందే. దీనికి ప్ర‌ధాన కార‌ణం క్లౌడ్‌ఫేర్‌లో త‌లెత్తిన స‌మ‌స్య అని తేలింది. దీంతో అస‌లేంటీ క్లౌడ్‌ఫేర్ అన్న చ‌ర్చ మొద‌లైంది. 

PREV
17
తీవ్ర అంత‌రాయం

మంగ‌ళ‌వారం సాయంత్రం ఎక్స్‌తో స‌హా ప‌లు సోష‌ల్ మీడియా సైట్స్‌లో అంత‌రాయం ఏర్ప‌డింది. ఎక్స్‌లో యూజర్లు పోస్ట్‌లను చూడలేకపోవడమే కాకుండా, కొత్త ట్వీట్‌లను కూడా అప్‌లోడ్ చేయలేకపోయారు. ఓపెన్ ఏఐ సంస్థ‌ల సేవ‌లు సైతం నిలిచిపోయాయి. అయితే దీనంతటికీ క్లౌడ్‌ఫేర్‌లో ఏర్ప‌డిన అంత‌రాయం కార‌ణ‌మ‌ని తేలింది. ఈ నేప‌థ్యంలో అస‌లేంటీ క్లౌడ్‌ఫేర్‌.? ఇది ఎందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది.? లాంటి వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం.

27
క్లౌడ్‌ఫ్లేర్ అంటే ఏంటి.?

క్లౌడ్ ఫ్లేర్ అమెరికాకు చెందిన పెద్ద ఇంటర్నెట్ కంపెనీ. ప్రపంచంలోని అనేక వెబ్‌సైట్లు తమ సేవలు సురక్షితంగా ఉండేందుకు, వేగంగా ఓపెన్ అయ్యేందుకు దీనిని ఉప‌యోగిస్తారు.

ఇది ముఖ్యంగా మూడు పనులు చేస్తుంది:

* సైబర్ దాడుల నుంచి రక్షణ (DDoS దాడులు లాంటి ప్రమాదాల్ని అడ్డుకుంటుంది)

* వెబ్‌సైట్ల వేగాన్ని పెంచుతుంది.

* సైట్‌కి వచ్చే ట్రాఫిక్‌ను చెక్ చేయడం — యూజర్ నిజంగా మనిషేనా లేదా బాటా అన్న విష‌యాన్ని తెలుసుకోవ‌డానికి.

* ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షల వెబ్‌సైట్లలో 20% క్లౌడ్‌ఫేర్ సేవలను ఉపయోగిస్తున్నాయి.

* అంటే క్లౌడ్‌ఫ్లేర్‌లో చిన్న సమస్య వచ్చినా కూడా దాని దెబ్బ ఇంటర్నెట్‌లో చాలా పెద్ద స్థాయిలో కనిపిస్తుంది.

37
ఈ అంత‌రాయం ఎందుకు వ‌చ్చింది.?

ఈ అంత‌రాయానికి ఒక చిన్న టెక్నికల్ లోపమే కార‌ణం. కానీ ఆ చిన్న లోపం ప్రపంచవ్యాప్తంగా పెద్ద ప్రభావం చూపింది. ప్రమాదకర ట్రాఫిక్‌ను గుర్తించడానికి క్లౌడ్‌ఫ్లేర్ ఒక కాన్ఫిగరేషన్ ఫైల్ ఆటోమేటిక్‌గా తయారు చేస్తుంది.

ఆ ఫైల్‌లో ఎంట్రీలు ఊహించిన దానికంటే ఎక్కువగా చేరిపోయాయి. ఫైల్ చాలా పెద్దదిగా మారడంతో క్లౌడ్‌ఫ్లేర్ ట్రాఫిక్ హ్యాండ్లింగ్ సాఫ్ట్‌వేర్ దాన్ని ప్రాసెస్ చేయలేక క్రాష్ అయింది. దీని ఫ‌లితంగా.. క్లౌడ్‌ఫ్లేర్ సర్వీసులు నిలిచిపోయాయి. వాటిపై ఆధారపడిన అన్ని వెబ్‌సైట్లు ఒకేసారి డౌన్ అయ్యాయి.

క్లౌడ్‌ఫ్లేర్ CTO డేన్ నెక్ట్ ప్రకారం:

* అసలు కారణాన్ని గుర్తించిన వెంటనే పాత వెర్షన్‌కి తిరిగి మార్చారు.

* ఎటువంటి హ్యాకింగ్ లేదా దాడి జరిగిందనే ఆధారాలు లేవు

* ఇది పూర్తిగా టెక్నికల్ తప్పిదం మాత్రమే

47
క్లౌడ్‌ఫ్లేర్ CTO డేన్ నెక్ట్ ప్రకారం:

* అసలు కారణాన్ని గుర్తించిన వెంటనే పాత వెర్షన్‌కి తిరిగి మార్చారు.

* ఎటువంటి హ్యాకింగ్ లేదా దాడి జరిగిందనే ఆధారాలు లేవు

* ఇది పూర్తిగా టెక్నికల్ తప్పిదం మాత్రమే

ఎంత ప్ర‌భావం ప‌డింది.?

ఇంటర్నెట్‌లో ఒకేసారి ఎన్నో ప్రముఖ అప్లికేషన్లు పనిచేయలేదు.

డౌన్ అయిన ప్రధాన సైట్లు, యాప్స్

X (Twitter)

ChatGPT

Spotify

League of Legends

Letterboxd

Canva

Amazon సేవలు

Moody’s

NJ Transit

Perplexity AI

Gemini AI

57
Downdetector (ఔటేజ్ ట్రాక్ చేసే సైట్ కూడా డౌన్ అయింది)

* ఈ లోపం కార‌ణంగా “Internal Server Error – Cloudflare Network”, “Please unblock challenges.cloudflare.com to proceed” వంటి మెసేజ్‌లు వ‌చ్చాయి. ఇవి క్లౌడ్‌ఫ్లేర్ సెక్యూరిటీ సిస్టమ్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల వచ్చాయి.

‘Please unblock challenges.cloudflare.com’ అంటే ఏమిటి?

* క్లౌడ్‌ఫ్లేర్ సెక్యూరిటీ చాలెంజ్ పేజీలు లోడ్ కాకపోవడం వ‌ల్ల ఈ మెసేజ్ వ‌చ్చింది.

* ఎవరు నిజమైన యూజర్, ఎవరు బాట్ అన్నది సిస్టమ్ గుర్తించలేకపోవడం వ‌ల్ల సైట్ సాధారణంగా పనిచేసినా యూజర్‌కి పేజీ ఓపెన్ కాలేదు. అంటే సెక్యూరిటీ లేయర్ పనిచేయకపోవడంతో సైట్లు ఓపెన్ కాలేవు.

67
డౌన్‌డిటెక్టర్ కూడా డౌన్ ఎందుకు అయింది?

సాధార‌ణంగా ఏ వెబ్‌సైట్ డౌన్ అయ్యిందో చెక్ చేసుకోవ‌డానికి చాలా మంది DownDetector ఓపెన్ చేస్తారు. తాజాగా కూడా దీనిని ఒకేసారి పెద్ద ఎత్తున ఓపెన్ చేశారు. అయితే ఈ సైట్ కూడా క్లౌడ్‌ఫేర్ పై ఆధారపడుతుంది. క్లౌడ్‌ఫేర్ క్రాష్ కావడంతో అది కూడా పనిచేయలేదు.

ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి?

DownDetector డేటా ప్రకారం:

సాయంత్రం 5:17 pm: 2,890 ఫిర్యాదులు

రాత్రి 8:02 pm: 2,424 ఫిర్యాదులు

56% — సర్వర్ సమస్య

30% — క్లౌడ్‌ఫ్లేర్ వెబ్‌సైట్ లోడింగ్ సమస్య

14% — DNS ఇష్యూలు

77
ఇంటర్నెట్ నిపుణుల అభిప్రాయం ఏంటంటే.?

NetBlocks డైరెక్టర్ ఆల్ప్ టోకర్ మాట్లాడుతూ.. “ఈ లోపం క్లౌడ్‌ఫ్లేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో భారీ అంతరాయం” అని తెలిపారు. సైబర్ దాడుల నుంచి కాపాడ‌డానికి ఇంటర్నెట్‌లో చాలా భాగం క్లౌడ్‌ఫేర్ ఆధీనంలో ఉంటుంది. కానీ ఇదే వ్య‌వ‌స్థ ఇప్పుడు ఫెయిల్ అయ్యింది. అంటే, రక్షణ కోసం తీసుకున్న ఒక భారీ వ్యవస్థలో లోపం జ‌రిగితే ఇంటర్నెట్ మొత్తం కుప్పకూలుతుంది. కాబ‌ట్టి క్లౌడ్‌ఫేర్ ఆగితే ప్ర‌పంచ‌మే ఆగుతుంద‌ని చెప్పాలి.

క్లౌడ్‌ఫేర్ రీ-రూట్ అంటే ఏమిటి?

* సమస్య వచ్చిన వెంట‌నే కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మరో డేటాసెంటర్‌కి మళ్లించారు.

* కొన్ని ప్రాంతాల్లో కొద్దిగా వేగం తగ్గింది

* కొంత ట్రాఫిక్ ఇతర దారుల ద్వారా పంపుతున్నారు

* అందుకే కొందరికి పేజీలు నెమ్మదిగా ఓపెన్ అయ్యాయి

* ఇది పూర్తిగా సమస్య నుంచి బయట పడే వరకు నిమిషాలకొద్దీ జరుగుతూ ఉంటుంది.

ఇటీవలి కాలంలో ఇలాంటి సమస్యలు ఎందుకు పెరిగాయి?

ఇటీవ‌ల Amazon Web Services డౌన్, Microsoft Azure సేవల్లో సమస్య, ఇప్పుడు Cloudflare డౌన్ అయ్యింది. సైబర్ సెక్యూరిటీ నిపుణులు చెబుతున్న వివ‌రాల ప్ర‌కారం.. పెద్ద టెక్ కంపెనీలు ప్రపంచ ఇంటర్నెట్‌ను బాగా నియంత్రిస్తున్నాయి. ఇవి దెబ్బ తింటే ఇంటర్నెట్‌లో అన్ని రంగాలు ప్రభావితమవుతున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories