Published : Jul 25, 2025, 01:44 PM ISTUpdated : Jul 25, 2025, 01:46 PM IST
కృత్రిమ మేథ ఉపయోగం విపరీతంగా పెరుగుతోంది. చిన్న చిన్న ప్రశ్నలకే కాకుండా వైద్య పరమైన విషయాలకు కూడా చాట్ జీపీటీ సమాధానాలు ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ యువతి పంచుకున్న వివరాలు వైరల్ అవుతున్నాయి.
ఇటీవలి కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రాముఖ్యత రోజురోజుకు పెరుగుతోంది. చిన్న సందేహం వచ్చినా ప్రజలు వెంటనే ఏఐ చాట్‌బాట్‌ల సహాయం తీసుకుంటున్నారు. అలాంటి సందర్భంలో శ్రేయ అనే యువతి తన తల్లిని చాట్ జీపీటీ సహాయంతో కాపాడుకున్న అనుభవాన్ని ఎక్స్ వేదికగా పంచుకుంది. దీంతో ఈ ట్వీట్ కాస్త వైరల్ అయ్యింది.
25
ఎంత చికిత్స చేసినా తగ్గని దగ్గు
శ్రేయ తల్లి ఏడాది రోజులుగా తీవ్రమైన దగ్గుతో బాధపడుతూనే ఉన్నారు. హోమియోపతి, ఆయుర్వేదం, అలోపతి సహా అనేక విధాలుగా చికిత్స చేసినా ఎటువంటి ఫలితం రాలేదు. పరిస్థితి క్రమంగా దిగజారుతుండటంతో వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. “ఇలాగే కొనసాగితే మరో ఆరు నెలల్లో ప్రాణహాని సంభవించే అవకాశం ఉంది” అని కూడా చెప్పారు.
35
చాట్‌జీపీటీని ప్రశ్నించగా
తల్లి ఆరోగ్యం విషయంలో తీవ్ర ఆందోళన చెందిన శ్రేయ చివరి ప్రయత్నంగా చాట్‌జీపీటీ సహాయం కోరింది. తల్లి దగ్గుకు సంబంధించిన లక్షణాలను వివరించగా, చాట్‌బాట్ అనేక కారణాల జాబితాను అందించింది. అందులో రక్తపోటు మందులు కూడా దీర్ఘకాలిక దగ్గుకు కారణమవుతాయన్న అంశం శ్రేయ దృష్టిని ఆకర్షించింది.
తల్లి బీపీ చికిత్సలో వాడుతున్న మందుల విషయాన్ని వెంటనే వైద్యుడికి తెలిపింది. పరీక్షించిన వైద్యుడు ఆ సూచనలో నిజం ఉందని గుర్తించి మందులను మార్చారు. కొన్ని రోజుల్లోనే తల్లి ఆరోగ్యం మెరుగుపడడం ప్రారంభమైంది.
55
‘చాట్‌జీపీటీ వల్లే అమ్మ బతికింది’
తల్లి కోలుకున్న తర్వాత శ్రేయ తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. “వివిధ చికిత్సల తర్వాత కూడా ఫలితం రాకపోయినా, ఏఐ చాట్‌బాట్ ఇచ్చిన సూచన వల్లే మా తల్లి ప్రాణం దక్కింది” అంటూ ఆమె రాసిన పోస్ట్ వైరల్‌గా మారింది. ఏఐని సరిగ్గా ఉపయోగించుకుంటే ఎంత బాగుంటుందో ఈ సంఘటన చెబుతోందని కొందరు నెటిజన్లు అంటున్నారు.
శ్రేయ ఎక్స్ పోస్ట్
గమనిక: ఈ కథనాన్ని శ్రేయ అనే యువతి ఎక్స్‌లో చేసిన పోస్ట్ ఆధారంగా అందించడం జరిగింది. చాట్ జీపీటీ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్ టూల్స్ వైద్యులను భర్తీ చేయలేవన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆరోగ్యానికి సంబంధించి స్వీయ చికిత్స లేదా ఇంటర్నెట్ వంటి వాటిపై ఆధారపపడం మంచిది కాదు. ఆరోగ్యం విషయంలో కచ్చితంగా వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.