OnePlus Pad Lite: రూ. 13 వేలలో ఇన్ని ఫీచర్లేంటీ భయ్యా.. వన్‌ప్ల‌స్ నుంచి సూప‌ర్ ట్యాబ్

Published : Jul 24, 2025, 03:44 PM IST

చైనాకు చెందిన ప్ర‌ముఖ ఎల‌క్ట్రానిక్ దిగ్గజం వ‌న్‌ప్ల‌స్ మార్కెట్లోకి కొత్త ట్యాబ్‌ను తీసుకొచ్చింది. వ‌న్‌ప్ల‌స్ ప్యాడ్ లైట్ పేరుతో లాంచ్ చేసిన ఈ ట్యాబ్‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
బడ్జెట్‌ సెగ్మెంట్‌లో వన్‌ప్లస్‌ కొత్త ఎంట్రీ

వన్‌ప్లస్‌ తన ప్యాడ్‌ సిరీస్‌ను మరింత విస్త‌రించే క్ర‌మంలో కొత్త ట్యాబ్‌ను విడుదల చేసింది. తక్కువ ధరలో అందుబాటులోకి తెచ్చిన ఈ టాబ్లెట్‌ 11 అంగుళాల LCD డిస్‌ప్లేతో, 16:10 యాస్పెక్ట్ రేషియో, 500 నిట్స్‌ బ్రైట్‌నెస్‌ సపోర్ట్‌తో వస్తోంది. హై-రెస్‌ ఆడియో సర్టిఫికేషన్‌ కలిగిన క్వాడ్‌ స్పీకర్‌ సెటప్‌ ఈ డివైజ్‌లో ఉంది. 

7.39మిల్లీమీటర్ల మందం, 530 గ్రాముల బరువుతో ఉన్న ఈ ప్యాడ్‌ ఎరో బ్లూ రంగులో లభ్యమవుతుంది. బ్యాక్ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 5 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.

25
బ్యాటరీ సామర్థ్యం

ఈ టాబ్లెట్‌లో 9,340 mAh బ్యాటరీను అందించారు. కంపెనీ ప్రకారం, ఒకసారి ఫుల్‌ ఛార్జింగ్‌ చేస్తే 80 గంటల మ్యూజిక్‌ ప్లేబ్యాక్‌ లేదా 11 గంటల వీడియో స్ట్రీమింగ్‌ సాధ్యమవుతుంది. స్టాండ్‌బై మోడ్‌లో ఇది 54 రోజుల పాటు ఉండగలదని చెబుతున్నారు. అదనంగా 33W సూపర్‌వూక్‌ ఛార్జింగ్‌కు స‌పోర్ట్ చేస్తుంది.

35
అద్భుత‌మైన ప‌నితీరు

వన్‌ప్లస్‌ ప్యాడ్‌లైట్‌లో మీడియాటెక్‌ హీలియో G100 ప్రాసెసర్‌ అమర్చారు. ఇది ఆక్సిజన్‌ఓఎస్‌ 15.0.1తో పనిచేస్తుంది. స్క్రీన్‌ మిర్రరింగ్‌, క్లిప్‌బోర్డ్‌ షేరింగ్‌, వన్‌ప్లస్‌ డివైజ్‌ల మధ్య గ్యాలరీ సింక్‌ వంటి ప్రత్యేక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అలాగే రెండు యాప్‌లను ఒకేసారి వినియోగించుకునేందుకు వన్‌ప్లస్‌ కాన్వాస్‌ మల్టిటాస్కింగ్‌ ఫీచర్‌ను అందించారు.

45
కిడ్స్‌ మోడ్‌, ఐ ప్రొటక్షన్‌

పిల్లలు కూడా సురక్షితంగా ఉపయోగించుకునేందుకు కిడ్స్‌ మోడ్‌ను జోడించారు. దీని ద్వారా తల్లిదండ్రులు కంటెంట్‌ను కంట్రోల్‌ చేయవచ్చు. అదనంగా కంటి రక్షణ కోసం ఐ ప్రొటక్షన్‌ మోడ్‌ను కూడా అందించారు. దీని వల్ల ఎక్కువ సేపు చదవడం లేదా వీడియోలు చూసినా కళ్లపై ఒత్తిడి లేకుండా చేస్తుంది.

55
ధ‌ర ఎంతంటే.?

ఈ టాబ్లెట్‌ రెండు వేరియంట్లలో వస్తోంది. 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజీ వైఫై మోడ‌ల్ ధ‌ర రూ. 12,999గా నిర్ణ‌యించారు. కాగా 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ వైఫై + 4జీ ఎల్‌టీఈ వేరియంట్ ధ‌ర రూ. 14,999గా నిర్ణ‌యించారు. లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా రూ. 2,000 కార్డ్‌ డిస్కౌంట్‌ కూడా ఉంది. ఆగస్టు 1 నుంచి వన్‌ప్లస్‌.ఇన్‌, అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, క్రోమా, రిలయన్స్‌ డిజిటల్‌, విజయ్‌ సేల్స్‌, బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌ వంటి స్టోర్లలో అందుబాటులోకి రానుంది.

Read more Photos on
click me!

Recommended Stories