ChatGPT: ఓపెన్ ఏఐ సంస్థకు చెందిన చాట్ జీపీటీకి రోజురోజుకీ ఆదరణ పెరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఏఐ ప్లాట్‌ఫామ్‌ని ఉపయోగిస్తున్నారు. ఇక మార్కెట్లో పెరిగిన పోటీ నేపథ్యంలో చాట్ జీపీటీ సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది.
OpenAI సంస్థ ప్రకటించిన వివరాల ప్రకారం.. డిసెంబరు నుంచి వయసు నిర్ధారణ (Age Verification) పూర్తి చేసిన పెద్దలకు మాత్రమే ChatGPTలో ప్రత్యేకంగా “మ్యాచ్యూర్ కంటెంట్” కనిపిస్తుంది. సీఈఓ సామ్ ఆల్ట్‌మన్ ఈ విషయమై మాట్లాడుతూ.. “పెద్దలను పెద్దలుగా చూస్తూ, వారికి కావాల్సిన కంటెంట్ యాక్సెస్ ఇవ్వడం మా సూత్రం” అని చెప్పుకొచ్చారు.
25
“మానసిక ఆరోగ్యం” కోసం మొదట కఠిన నిబంధనలు
OpenAI మొదట ChatGPTలో చాలా కఠిన నియంత్రణలు పెట్టింది. దీని ప్రధాన కారణం — మానసిక ఒత్తిడి లేదా డిప్రెషన్‌లో ఉన్న యూజర్లు తప్పుగా ప్రభావితమవకుండా చూడటం. అయితే, ఈ నియంత్రణల వలన మానసికంగా ఆరోగ్యంగా ఉన్న యూజర్లకు చాట్‌బాట్ అంత ఆసక్తికరంగా లేకపోయిందని ఆల్ట్‌మన్ చెప్పారు.
35
కొత్త అప్‌డేట్‌లో యూజర్లకు మరింత స్వేచ్ఛ
తొలిదశలోనే OpenAI రానున్న రోజుల్లో ChatGPTకి పెద్ద అప్‌డేట్ వస్తుందని తెలిపింది. దీంతో యూజర్లు స్వయంగా ChatGPT ప్రవర్తనను మార్చుకోగలరు. టోన్ మార్చుకోవచ్చు (ఉదాహరణకి స్నేహపూర్వకంగా లేదా హ్యూమన్‌లా మాట్లాడేలా), ఎమోజీలు ఎక్కువగా వాడేలా చేయవచ్చు, స్నేహితుడిలా వ్యవహరించేలా మార్చుకోవచ్చు. ఆల్ట్‌మన్ మాటల్లో.. “మీరు ChatGPTని మనిషిలా, ఎమోజీలతో, స్నేహపూర్వకంగా స్పందించాలనుకుంటే అది సాధ్యమవుతుంది.” అని చెప్పుకొచ్చారు.
డిసెంబరు నుంచి ChatGPTలో వయసు నిర్ధారిత (Verified Adult) యూజర్లకు మాత్రమే “మ్యాచ్యూర్ కంటెంట్” యాక్సెస్ లభిస్తుంది. ఇందులో ఎరోటికా వంటి కంటెంట్ కూడా ఉంటుంది. ఇది సాధారణ యూజర్లకు అందుబాటులో ఉండదు. ఈ నిర్ణయం “పెద్దలను పెద్దలుగా గౌరవించాలి” అనే OpenAI సూత్రం ఆధారంగా తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది.
55
భద్రతా చర్యలతో ప్రైవసీ
మానసిక ఆరోగ్యం విషయంలో OpenAI కొత్త సాంకేతిక సాధనాలను, భద్రతా వ్యవస్థలను అభివృద్ధి చేసింది. దీంతో సేఫ్‌గా నియంత్రణలు తగ్గించడం సాధ్యమవుతుందని ఆల్ట్‌మన్ చెప్పారు. అంటే, చాట్‌బాట్ ఇప్పుడు బాధ్యతతో, అలాగే మరింత సహజంగా స్పందించే విధంగా రూపుదిద్దుకోనుంది.