జియో సంచలనం.. రూ. 799కే కొత్త ఫోన్, ఫీచర్లు అదుర్స్

Published : Oct 13, 2025, 06:33 PM IST

Jio Phone : రియల్‌టైమ్ లొకేషన్ ట్రాకింగ్, యూసేజ్ మేనేజ్‌మెంట్, 7 రోజుల బ్యాటరీ బ్యాకప్‌ సహా అద్భుతమైన ఫీచర్లతో కొత్త జియో భారత్ ఫోన్ మార్కెట్ లోకి వచ్చింది. దీని ధర కేవలం 799 రూపాయలు. పూర్తి వివరాలు మీకోసం.

PREV
15
భద్రతకు పెద్దపీట.. సూపర్ ఫీచర్లతో జియో భారత్ ఫోన్

రిలయన్స్ జియో భారతీయ వినియోగదారుల కోసం రూపొందించిన ‘జియో భారత్’ ఫోన్ ఇప్పుడు కొత్త సేఫ్టీ ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. పిల్లలు, మహిళలు, వృద్ధుల సేఫ్టీని దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ ఫోన్, తక్కువ ధరలో అధునాతన స్మార్ట్ ఫీచర్లను అందిస్తోంది.

ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆన్‌లైన్ మోసాలు, స్కామ్‌లు పెరుగుతున్న నేపథ్యంలో కుటుంబాలు భద్రతపై ఆందోళన చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో జియో భారత్ కొత్తగా తీసుకువచ్చిన ‘సేఫ్టీ-ఫస్ట్’ వెర్షన్‌ వినియోగదారులకు రియల్‌టైమ్ లొకేషన్ ట్రాకింగ్, యూసేజ్ మేనేజ్‌మెంట్, ఫోన్ హెల్త్ మానిటరింగ్ వంటి సదుపాయాలను అందిస్తోంది.

25
రియల్‌టైమ్ లొకేషన్ ట్రాకింగ్ సిస్టమ్

కొత్త జియో భారత్ ఫోన్‌లో అత్యంత ముఖ్యమైన ఫీచర్‌ లొకేషన్ మానిటరింగ్ సిస్టమ్‌. దీని ద్వారా వినియోగదారులు తమ కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నారో రియల్‌టైమ్‌లో తెలుసుకోవచ్చు. తల్లిదండ్రులు తమ పిల్లల లొకేషన్‌ను నిరంతరం పర్యవేక్షించవచ్చు. పిల్లలు స్కూల్‌ నుంచి ఇంటికి వచ్చే సమయంలో, బయట ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు లేదా ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఈ ట్రాకింగ్ ఫీచర్‌ వారిని భద్రంగా ఉంచడంలో సహాయపడుతుంది.

35
యూసేజ్ మేనేజ్‌మెంట్, కాల్/మెసేజ్ కంట్రోల్స్

జియో భారత్ ఫోన్‌లో యూసేజ్ మేనేజ్‌మెంట్ వ్యవస్థను కూడా అందించారు. ఈ ఫీచర్‌ ద్వారా తల్లిదండ్రులు లేదా సంరక్షకులు పిల్లల ఫోన్‌ వినియోగాన్ని పరిమితం చేయవచ్చు. అనవసరమైన కాల్స్, మెసేజ్‌లు రాకుండా ఆప్షన్లు కూడా ఉన్నాయి. దీంతో వృద్ధులు లేదా చిన్నారులకు ఇబ్బందులు వుండవు.

45
కొత్త జియో భారత్ ఫోన్ లో 7 రోజుల బ్యాటరీ బ్యాకప్

కొత్త జియో భారత్ ఫోన్ ఒకసారి ఛార్జ్ చేస్తే 7 రోజుల వరకు నడుస్తుంది. తరచుగా ఛార్జింగ్ సదుపాయం లేని గ్రామీణ ప్రాంతాల్లో లేదా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇది లాంగ్ లైఫ్ బ్యాటరీ కోరుకునే వినియోగదారులకు మంచి ఎంపిక అని చెప్పవచ్చు.

55
జియో భారత్ ఫోన్ ధర ఎంత?

ఇన్ని ప్రత్యేక ఫీచర్లతో కూడిన జియో భారత్ ఫోన్‌ కేవలం ₹799కే అందుబాటులో ఉంది. దీపావళి వేడుకల సందర్భంగా ప్రత్యేక ఆఫర్‌ కింద వినియోగదారులు మొదట రూ.100 చెల్లించి బుకింగ్ చేసుకోవచ్చు. ఈ ఫోన్‌ దేశవ్యాప్తంగా ఉన్న జియో స్టోర్స్‌, ప్రముఖ మొబైల్ రిటైల్ అవుట్‌లెట్లు, జియోమార్ట్‌, అమెజాన్‌, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ వంటి ఈకామర్స్ ఆన్ లైన్ వేదికల్లో కూడా లభిస్తోంది.

తక్కువ ధరలో అత్యుత్తమ భద్రతా ఫీచర్లు అందిస్తున్న జియో భారత్ ఫోన్‌ కుటుంబ భద్రతను కోరుకునే తల్లిదండ్రులు, వృద్ధులు, మహిళలకు ఒక బెస్ట్ ఆప్షన్. ₹799 ధరలో లభించే ఈ ఫోన్‌ ప్రస్తుతం దేశవ్యాప్తంగా వినియోగదారుల్లో ఆసక్తిని పెంచింది.

Read more Photos on
click me!

Recommended Stories