దీపావళి ఆఫర్లు: ఐఫోన్ 16 ప్రో ఎక్కడ తక్కువ ధరకు లభిస్తుందో తెలుసా? బిగ్ డిస్కౌంట్

Published : Oct 14, 2025, 11:59 PM ISTUpdated : Oct 15, 2025, 12:11 AM IST

iPhone 16 Pro Diwali offers: దీపావళి 2025 సందర్భంగా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, క్రోమా, విజయ్ సేల్స్ వంటి ప్లాట్‌ఫామ్‌లు ఐఫోన్ 16 ప్రో పై భారీ డిస్కౌంట్లు ప్రకటించాయి. అయితే, ఎక్కడ ఐఫోన్ 16 ప్రో లభిస్తుందో ఇక్కడ తెలుసుకుందాం.

PREV
15
దీపావళి 2025 షాపింగ్ సీజన్.. బిగ్ ఆఫర్లు

దీపావళి 2025 సందర్భంగా దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు భారీ ఆఫర్లు ప్రకటించాయి. ఫ్లిప్ కార్ట్, అమెజాన్, క్రోమా, విజయ్ సేల్స్ వంటి రిటైల్ బ్రాండ్లు ఐఫోన్ 16 ప్రో (iPhone 16 Pro) తో పాటు ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, టాబ్లెట్లు వంటి డివైస్‌లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లు అందిస్తున్నాయి.

ఆపిప్ ఇటీవల ఐఫోన్ 17 (iPhone 17) సిరీస్‌ను విడుదల చేసింది. అయినప్పటికీ, ఐఫోన్ 16 ప్రో కొనుగోలుదారులలో మంచి డిమాండ్‌ ఉన్న ఫోన్ గా కొనసాగుతోంది. దీని 6.3-అంగుళాల Super Retina XDR డిస్‌ప్లే, 120Hz ProMotion టెక్నాలజీతో ఆకర్షణీయమైన విజువల్ అనుభవాన్ని ఇస్తాయి. టైటానియం ఫ్రేమ్, మ్యాట్ గ్లాస్ బ్యాక్ కలయికతో ఈ మోడల్ ప్రీమియం డిజైన్‌ను కలిగి ఉంది.

25
ప్రముఖ ప్లాట్‌ఫామ్‌లలో ఐఫోన్ 16 ప్రో ధరలు

ఫ్లిప్ కార్ట్ : 256GB ఐఫోన్ 16 ప్రో ₹1,04,999కి అందుబాటులో ఉంది. దీని అసలు ధర ₹1,19,900. ఈ తగ్గింపుతో పాటు ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డు వినియోగదారులు అదనంగా ₹4,000 తగ్గింపు పొందవచ్చు. అలాగే పాత ఫోన్ ఎక్స్చేంజ్ ఆఫర్ ద్వారా గరిష్టంగా ₹61,900 వరకు తగ్గింపు లభిస్తుంది. 128 జీబీ వేరియంట్ ₹94,999 లకు అందుబాటులో ఉంది.

క్రోమా : 256GB వెర్షన్ ఐఫోన్ 16 ప్రో ₹1,13,490కి లభిస్తోంది. ఇది తక్కువ తగ్గింపు అయినప్పటికీ, విశ్వసనీయ రిటైల్ సేవ కోరుకునే వారికి మంచి అప్షన్ గా ఉంది.

విజయ్ సేల్స్ : 256GB మోడల్ ఐఫోన్ 16 ప్రో ₹1,14,900కి లభిస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా EMI లేకుండా చెల్లించినప్పుడు వెంటనే ₹5,000 తగ్గింపు అందిస్తుంది.

రిలయన్స్ డిజిటల్ : ఐఫోన్ 16 ప్రో 256GB వేరియంట్ ₹1,19,900కి అందుబాటులో ఉంది.

బిగ్ బాస్కేట్ : అద్భుతమైన డీల్‌గా 128GB ఐఫోన్ 16 ప్రో వేరియంట్ ₹99,990కు అందుబాటులో ఉంది.

35
ఐఫోన్ 16 ప్రో ఎందుకు ఇప్పటికీ బెస్ట్ ఎంపిక?

ఐఫోన్ 17 సిరీస్ విడుదలైనప్పటికీ, ఐఫోన్ 16 ప్రో ఇంకా పనితీరు, డిస్‌ప్లే నాణ్యత, నిర్మాణం పరంగా బలమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది. ఈ దీపావళి సీజన్‌లో బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్చేంజ్ డీల్స్, ఫెస్టివ్ డిస్కౌంట్లు కలిసి దీనిని మరింత ఆకర్షణీయంగా డీల్ గా, మంచి ఎంపికగా మారుస్తున్నాయి.

45
ఐఫోన్ 16 ప్రో లో అద్భుతమైన కెమెరా సెటప్

ఐఫోన్ 16 ప్రో లో 5x ఆప్టికల్ జూమ్ లెన్స్ కెమెరా ఉంది. ఇది గతంలో ఐఫోన్ ప్రో మ్యాక్స్ మోడల్‌లో మాత్రమే ఉన్న ఫీచర్. దీంతో దూరంలోని వస్తువులను స్పష్టంగా చిత్రీకరించవచ్చు. 48MP అల్ట్రా-వైడ్ కెమెరా తక్కువ లైటింగ్‌లో కూడా స్పష్టమైన ఫోటోలు అందిస్తుంది. మొబైల్ ఫోటోగ్రఫీకి ఇది బెస్ట్ ఎంపికగా నిలుస్తోంది.

55
శక్తివంతమైన A18 Pro చిప్

ఆపిల్ A18 Pro చిప్‌తో ఐఫోన్ 16 ప్రో పనిచేస్తుంది. దీని ద్వారా మల్టీటాస్కింగ్, గేమింగ్, హై-ఎండ్ అప్లికేషన్లు స్మూత్‌గా నడుస్తాయి. భవిష్యత్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లకు కూడా ఇది ఫ్యూచర్-ప్రూఫ్ పనితీరును ఇస్తుంది.

ప్రీమియం డిస్‌ప్లే, సూపర్ బిల్డ్ క్వాలిటీ

6.3 అంగుళాల Super Retina XDR డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. దీని టైటానియం ఫ్రేమ్, మ్యాట్ గ్లాస్ బ్యాక్ కలయిక ఫోన్‌కు బలమైన, స్టైలిష్ రూపాన్ని ఇచ్చాయి.

దీపావళి 2025 సందర్భంగా iPhone 16 Pro కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు ఇది సరైన సమయం. Flipkartలో అత్యధిక తగ్గింపు ఉండగా, BigBasketలో బడ్జెట్ ఫ్రెండ్లీ ఆఫర్ లభిస్తోంది. ప్రీమియం డిజైన్, శక్తివంతమైన పనితీరు, అద్భుతమైన కెమెరా కలయికతో iPhone 16 Pro ఈ సీజన్‌లో అత్యుత్తమ టెక్ డీల్‌గా నిలుస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories