Best Recharge Plans: తక్కువ ధరకే ఫ్యామిలీ మొత్తానికి సరిపోయే అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్స్!

Published : Jul 09, 2025, 04:04 PM IST

ప్రస్తుతం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది దగ్గర ఫోన్ ఉండడం సాధారణం అయిపోయింది. అయితే ప్రతినెలా అందరికీ రీఛార్జ్ చేయడం కాస్త కష్టమైన పనే. అయితే జియో, ఎయిర్‌టెల్, BSNL వంటి టెలికాం సంస్థలు తమ ఫ్యామిలీ రీఛార్జ్ ప్లాన్స్‌ని అప్‌డేట్ చేశాయి. అవేంటో చూద్దాం.

PREV
15
Best Family Mobile Recharge Plans

ప్రస్తుతం డేటా, కాల్స్, OTT ఆఫర్లతో కూడిన ఫ్యామిలీ రీఛార్జ్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. జియో, ఎయిర్‌టెల్, Vi, BSNL వంటివి తమ ఫ్యామిలీ రీఛార్జ్ ఆఫర్‌లను అప్‌డేట్ చేశాయి.

ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ రెండింటికీ ఇవి వర్తిస్తాయి. మీకు ఎక్కువ డేటా, ఎక్కువ వ్యాలిడిటీ లేదా అదనపు స్ట్రీమింగ్ ఆఫర్లు కావాలంటే, ప్రతి బడ్జెట్‌కీ, అవసరానికీ తగ్గట్టుగా ప్లాన్స్ ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం. 

25
జియో ప్లాన్స్

జియో తన బడ్జెట్ ఫ్రెండ్లీ పోస్ట్‌పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్స్‌తో యూజర్లను ఆకర్షిస్తోంది. ప్రస్తుతం నెలకు రూ.449, రూ749 ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో షేర్డ్ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, SMSలు, OTT యాప్స్ యాక్సెస్ ఉన్నాయి.

జియో రూ.2025, రూ.3599, రూ. 3999 వంటి లాంగ్ టర్మ్ ప్రీపెయిడ్ ప్యాక్‌లు ఏడాది వరకు వ్యాలిడిటీ, డైలీ డేటా, జియో సినిమా, సోనీ LIV వంటి సబ్‌స్క్రిప్షన్‌లను అందిస్తున్నాయి.

35
Vi రీఛార్జ్ ప్లాన్స్

Vi తన మ్యాక్స్ ఫ్యామిలీ ప్లాన్‌ను రూ. 871కి అందిస్తోంది. ఇందులో ఇద్దరు యూజర్లకు 70GB డేటా, నైట్ రోల్‌ఓవర్, Netflix Basic సహా OTT సబ్‌స్క్రిప్షన్‌లు ఉన్నాయి. అదనంగా ఒక్కో సిమ్‌కి రూ. 299 చెల్లించి 8 మంది కుటుంబ సభ్యులను యాడ్ చేసుకోవచ్చు.

ప్రతి ఒక్కరికీ 40GB డేటా లభిస్తుంది. పెద్ద కుటుంబాలకు ఇది మంచి ఆప్షన్. Vi రూ. 979, రూ.1197 వంటి ప్రీపెయిడ్ ప్లాన్స్‌ని కూడా అందిస్తోంది. వీటిలో 3GB/రోజు డేటా, స్ట్రీమింగ్ యాక్సెస్ ఉన్నాయి.

45
ఎయిర్‌టెల్ ప్యామిలీ రీఛార్జ్ ప్లాన్స్

ఎయిర్‌టెల్ అత్యంత విస్తృతమైన పోస్ట్‌పెయిడ్ ఫ్యామిలీ ఆఫర్‌లను అందిస్తోంది. ఇద్దరు సభ్యులకు రూ. 699 నుంచి ఐదుగురు సభ్యులకు రూ. 1749 వరకు ప్లాన్స్ ఉన్నాయి. ఈ ప్లాన్స్‌లో 105GB నుంచి 320GB వరకు డేటా, ఫ్రీ వాయిస్, SMS, Amazon Prime, Disney+ Hotstar, Netflix వంటి OTT యాప్స్ ఉన్నాయి.

ఎయిర్‌టెల్ యూజర్లు డేటా రోల్‌ఓవర్‌ను కూడా పొందుతారు. ప్రీపెయిడ్ యూజర్లకు, ఎయిర్‌టెల్ ₹469లో 84 రోజుల రీఛార్జ్ మంచిది. ఇందులో అన్‌లిమిటెడ్ కాల్స్, తక్కువ డేటా ఉన్నాయి.

55
BSNL

BSNL నెలకు రూ. 999తో 4 మొబైల్ కనెక్షన్లతో కూడిన పోస్ట్‌పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ప్రతి యూజర్‌కీ 75GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, ఫ్రీ SMSలు లభిస్తాయి. OTT సబ్‌స్క్రిప్షన్‌లు లేకపోయినా, డబ్బు ఆదా చేసుకోవాలనుకునేవారికి ఇది మంచి ప్లాన్.

ప్రీపెయిడ్ యూజర్లకు, BSNL రూ. 997, రూ. 1999 వంటి లాంగ్ టర్మ్ ప్యాక్‌లను అందిస్తోంది. వీటిలో ఎక్కువ డేటా, ఏడాది వరకు వ్యాలిడిటీ ఉన్నాయి. గ్రామీణ, బడ్జెట్ యూజర్లకు ఇవి సరిపోతాయి.

Read more Photos on
click me!

Recommended Stories