Artificial Intelligence : చాట్ జిపిటి, జెమినిని అస్సలు అడగకూడని విషయాలివే... అడిగారో అంతే సంగతి..!

Published : Jan 05, 2026, 09:29 AM IST

ChatGPT, Gemini : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చాట్ బాట్స్ కేవలం సమాచారం కోసం మాత్రమే ఉపయోగపతాాయి. కొన్ని విషయాల్లో వీటిని ఆశ్రయించడం ప్రమాదకరం కావచ్చు. అలాంటి అంశాలేేవో తెలుసా? 

PREV
17
AI ఎక్కడ వాడకూడదు..?

Artificial Intelligence : ఈ జనరేషన్ విద్యార్థుల నుంచి ఉద్యోగులు, వ్యాపారుల వరకు అందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాడుతున్నారు. ప్రతి ఒక్కరి స్మార్ట్ ఫోన్ లో చాట్‌జిపిటి, గూగుల్ జెమిని, గ్రోక్, పెర్‌ప్లెక్సిటీ లాంటి ఏఐ టూల్స్ ఉంటున్నాయి. ఇంకా చెప్పాలంటే ఇవి యువతరం జీవితంలో భాగమైపోయాయి. చదువుకునే విద్యార్థులు సబ్జెక్ట్ అంశాల నుండి ఉద్యోగులు కొత్తకొత్త స్కిల్స్ నేర్చుకునే వరకు అనేక విషయాల్లో ఈ ఏఐ ఉపయోగపడుతోంది.

అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై అతిగా ఆధారపడటం మంచిదికాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరీముఖ్యంగా సున్నితమైన సమాచారాన్ని అందించడం, నేరపరమైన అంశాల గురించి తెలుసుకోవడం.. ఇలాంటి కొన్ని ప్రశ్నలు ఏఐని అడగటం పెద్ద ప్రమాదానికి దారితీసే అవకాశాలున్నాయని అంటున్నారు. మీ ప్రైవసీ, భద్రతను దృష్టిలో ఉంచుకుని AI చాట్‌బాట్‌లను అస్సలు అడగకూడని 6 విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

27
1. డాక్టర్‌కు బదులుగా AI... అస్సలు వద్దు!

ఏఐ చాట్‌బాట్‌లు డాక్టర్లు కాదు. అవి వైద్య పదాలకు అర్థం చెబుతాయే తప్ప, మీకు ఏ జబ్బు ఉందో కచ్చితంగా చెప్పలేవు. అనారోగ్య సమస్య గురించి చెప్పి ఏఐని ఏ మందులు వాడాలో అడిగితే చెబుతుంది... కానీ ఇది ప్రమాదకరం. మీ ఆరోగ్య పరిస్థితి, మెడికల్ హిస్టరీ తెలియకుండా అది ఇచ్చే సలహా తప్పుగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్య సమస్యలపై ఏఐని కాదు డాక్టర్‌నే సంప్రదించండి. ఏఐ చాట్ బాట్స్ కేవలం సాంకేతికంగా మెరుగైనవి... వైద్యపరంగా కాదు.

37
2. బ్యాంక్ ఖాతా, పాస్‌వర్డ్... చాలా రహస్యం!

మీ బ్యాంక్ ఖాతా వివరాలు, ఆధార్ నంబర్, పాన్ కార్డ్ నంబర్, పాస్‌వర్డ్ లేదా ఓటీపీ (OTP) లాంటివి పొరపాటున కూడా చాట్‌బాట్‌లలో టైప్ చేయకండి. "మేము మీ సమాచారాన్ని సేవ్ చేయము" అని కంపెనీలు చెప్పినా, టెక్నికల్ సమస్యలు లేదా హ్యాకింగ్ వల్ల మీ వ్యక్తిగత సమాచారం లీక్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఆన్‌లైన్ మోసాలకు దారితీస్తుంది.

47
3. చట్టవిరుద్ధమైన పనులు... జైలుకు దారితీస్తాయి!

హ్యాకింగ్ ఎలా చేయాలి? పన్నులు ఎలా ఎగ్గొట్టాలి? లాంటి చట్టవిరుద్ధమైన ప్రశ్నలను AIని అడగకండి. చాలా ఏఐ టూల్స్ ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోయినా, ప్రయత్నించడమే ప్రమాదకరం. ఆన్‌లైన్‌లో మీరు చేసే ఇలాంటి సెర్చ్‌లను పర్యవేక్షించవచ్చు. ఇది మిమ్మల్ని చట్టపరమైన చిక్కుల్లో పడేయవచ్చు లేదా జైలుపాలు చేయవచ్చు.

57
4. AI చెప్పేదంతా నిజం కాదు..!

ఏఐ చాట్‌బాట్‌లు ఇంటర్నెట్‌లోని డేటాను సేకరించి సమాధానాలు ఇస్తాయి. కొన్నిసార్లు అవి పాత సమాచారాన్ని లేదా పూర్తిగా తప్పుడు సమాచారాన్ని ఇవ్వొచ్చు. కాబట్టి చట్టం, ఆర్థిక పెట్టుబడులు, ముఖ్యమైన వార్తల కోసం కేవలం AI మీద ఆధారపడకండి. ఎప్పుడూ అధికారిక సమాచారంతో సరిచూసుకోవడం అవసరం.

67
5. జీవితాన్ని మార్చే నిర్ణయాలు... మనుషులే బెస్ట్!

"నేను ఉద్యోగం మానేయాలా?", "ఈ వ్యాపారం మొదలుపెట్టాలా?" లాంటి ప్రశ్నలకు AI సరైన పరిష్కారం ఇవ్వదు. మీ కుటుంబ పరిస్థితి, ఆర్థిక స్థితి, మానసిక స్థితిని ఒక యంత్రం అర్థం చేసుకోలేదు. లాభనష్టాలను లిస్ట్ చేయడానికి AI సహాయపడొచ్చు... కానీ తుది నిర్ణయం అనుభవం ఉన్న మనుషులతో చర్చించే తీసుకోవాలి.

77
6. భావోద్వేగాలను యంత్రం అర్థం చేసుకుంటుందా?

మీరు తీవ్రమైన మానసిక ఒత్తిడిలో లేదా ఒంటరితనంలో ఉంటే AI దగ్గర ఓదార్పు వెతకడం మానుకోండి. అది సానుభూతితో మాట్లాడుతున్నట్లు అనిపించినా, దానికి నిజమైన భావోద్వేగాలు ఉండవు. తీవ్రమైన మానసిక ఆరోగ్య సమస్యలకు, స్నేహితులు, బంధువులు లేదా మానసిక ఆరోగ్య నిపుణులతో మాట్లాడటమే ఉత్తమం.

చివరగా చెప్పేదేంటంటే AI అనేది ఒక సాధనం మాత్రమే... అది మనుషులకు ప్రత్యామ్నాయం కాదు. దాన్ని తెలివిగా వాడండి, కానీ మీ జీవితపు పగ్గాలను దాని చేతిలో పెట్టకండి. ఏఐని అతిగా వాడితే ఆలోచనా సామర్థ్యం కూడా మందగించే అవకాశాలుంటాయి.

Read more Photos on
click me!

Recommended Stories