Phone Overheating : ఫోన్ వేడెక్కకుండా ఉండాలంటే ఏం చేయాలి?

Published : Jan 02, 2026, 06:40 PM IST

Phone Overheating : స్మార్ట్‌ఫోన్ తరచూ వేడెక్కుతోందా? దీనివల్ల బ్యాటరీ పాడవడమే కాకుండా ప్రమాదాలు జరగవచ్చు. ఫోన్ ఓవర్‌హీటింగ్ సమస్యను తగ్గించడానికి, సురక్షితంగా ఉంచడానికి ఈ సింపుల్ చిట్కాలు మీకోసం.

PREV
16
మీ ఫోన్ తరచూ వేడెక్కుతోందా? అయితే వెంటనే ఈ పనులు చేయండి.. లేదంటే పేలిపోయే ప్రమాదం ఉంది!

ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో ఒక విడదీయరాని భాగంగా మారిపోయింది. ఉదయం నిద్రలేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు.. చదువు, ఆఫీస్ పని, గేమ్స్ ఆడుకోవడం లేదా సోషల్ మీడియా బ్రౌజింగ్ ఇలా ప్రతీ పనికి మొబైల్ ఫోన్ వినియోగం తప్పనిసరి అయింది. అయితే, స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు తరచూ ఎదుర్కొనే ప్రధాన సమస్య ఫోన్ వేడెక్కడం. చాలా మంది తమ ఫోన్ కొద్దిసేపు వాడగానే నిప్పులా కాలిపోతోందని ఫిర్యాదు చేస్తుంటారు.

ఈ సమస్యను తేలికగా తీసుకోకూడదు. ఫోన్ ఎక్కువ సేపు వేడిగా ఉండటం వల్ల కేవలం డివైజ్ పనితీరు దెబ్బతినడమే కాకుండా, బ్యాటరీ, ఫోన్ లోపల ఉండే సున్నితమైన అంతర్గత హార్డ్‌వేర్ కూడా పాడయ్యే ప్రమాదం ఉంది. కొన్ని సందర్భాల్లో ఫోన్ అధిక వేడికి గురైతే పేలిపోయే ప్రమాదం కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొబైల్ ఫోన్ చేతిలో పట్టుకోలేనంతగా వేడెక్కుతుంటే, వెంటనే అప్రమత్తం కావాలి. ఈ సమస్య నుండి మీ ఫోన్‌ను రక్షించుకోవడానికి చేయాల్సిన పనులు గమనిస్తే..

26
అనవసరమైన యాప్స్ వెంటనే క్లోజ్ చేయండి

మనం ఫోన్‌లో ఒక యాప్ వాడిన తర్వాత దాన్ని పూర్తిగా క్లోజ్ చేయకుండా, మరో యాప్‌కి వెళ్తుంటాము. ఇలా చేయడం వల్ల ఆ యాప్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతూనే ఉంటాయి. బ్యాక్‌గ్రౌండ్‌లో నడిచే యాప్స్ ఫోన్ ప్రాసెసర్‌పై ఒత్తిడిని పెంచుతాయి, ఇది ఫోన్ వేడెక్కడానికి ప్రధాన కారణం. కాబట్టి, మీ మొబైల్ ఏమాత్రం వేడెక్కినట్లు అనిపించినా, వెంటనే రీసెంట్ యాప్స్ క్లియర్ చేయండి. అనవసరంగా రన్ అవుతున్న యాప్స్‌ను మూసివేయడం వల్ల ప్రాసెసర్‌పై భారం తగ్గి, ఫోన్ ఉష్ణోగ్రత సాధారణ స్థితికి వస్తుంది.

36
ఫోన్ కవర్‌ను తొలగించండి

ఫోన్ కింద పడితే పగిలిపోకుండా ఉండేందుకు మనం రకరకాల బ్యాక్ కవర్లను వాడుతుంటాం. కానీ, కొన్ని రకాల మందపాటి కవర్లు ఫోన్ నుండి వెలువడే వేడిని బయటకు పోనివ్వకుండా అడ్డుకుంటాయి. ఎలక్ట్రానిక్ పరికరాలు వాడేటప్పుడు కొంత వేడి విడుదల కావడం సహజం, కానీ కవర్లు ఆ వేడిని లోపలే బంధించడం వల్ల ఫోన్ ఓవర్‌హీట్ అవుతుంది. ఫోన్ వేడిగా అనిపించినప్పుడు వెంటనే దానికి ఉన్న కవర్‌ను తీసివేయండి. ఇలా చేయడం వల్ల గాలి తగిలి ఫోన్ త్వరగా కూల్ అవుతుంది.

46
ఎండలో ఫోన్ వాడకాన్ని తగ్గించండి

సూర్యకాంతి నేరుగా ఫోన్‌పై పడేలా వాడటం చాలా ప్రమాదకరం. బయట ఎండలో ఉన్నప్పుడు ఫోన్‌ను ఎక్కువగా వాడటం వల్ల ఓవర్‌హీటింగ్ సమస్య రెట్టింపు అవుతుంది. సూర్యరశ్మి, ఫోన్ స్క్రీన్ బ్రైట్‌నెస్ పెరగడం వల్ల ఫోన్ చాలా త్వరగా వేడెక్కుతుంది. కాబట్టి, సాధ్యమైనంత వరకు ఎండలో ఫోన్‌ను వాడకండి. ఒకవేళ వాడాల్సి వచ్చినా, నీడలో మాత్రమే వినియోగించండి. కారు డ్యాష్‌బోర్డ్ మీద లేదా కిటికీల దగ్గర ఎండ తగిలేలా ఫోన్‌ను ఉంచకండి.

56
సాఫ్ట్‌వేర్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయండి

చాలా మంది మొబైల్‌కు వచ్చే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ, పాత సాఫ్ట్‌వేర్‌లోని బగ్స్ లేదా లోపాల వల్ల ఫోన్ ప్రాసెసర్ సరిగా పనిచేయక వేడెక్కే అవకాశం ఉంది. మొబైల్ కంపెనీలు ఈ సమస్యలను పరిష్కరించడానికి ఎప్పటికప్పుడు సెక్యూరిటీ ప్యాచ్‌లు, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను విడుదల చేస్తాయి. మీ ఫోన్‌లో అప్‌డేట్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఇన్‌స్టాల్ చేసుకోండి. దీనివల్ల ఫోన్ హ్యాంగ్ అవ్వకుండా ఉండటమే కాకుండా, హీటింగ్ సమస్యలు కూడా తగ్గుతాయి.

66
ఛార్జింగ్ పెట్టి ఫోన్ వాడకండి

ఇది చాలా మంది చేసే ప్రమాదకరమైన తప్పు. ఫోన్‌ను ఛార్జింగ్‌లో పెట్టి గేమ్స్ ఆడటం లేదా మాట్లాడటం వల్ల బ్యాటరీపై విపరీతమైన ఒత్తిడి పడుతుంది. ఛార్జింగ్ అవుతున్నప్పుడు బ్యాటరీ సహజంగానే కొంచెం వేడెక్కుతుంది, ఆ సమయంలో ఫోన్‌ను వాడితే ఆ వేడి మరింత పెరుగుతుంది. ఇది బ్యాటరీ లైఫ్‌ను దెబ్బతీయడమే కాకుండా, కొన్నిసార్లు ఫోన్ పేలిపోవడానికి కూడా దారితీయవచ్చు. మీ ఫోన్ త్వరగా వేడెక్కుతుంటే, ఛార్జింగ్ సమయంలో దాన్ని అస్సలు ముట్టుకోకండి.

ఈ చిన్నపాటి జాగ్రత్తలు పాటించడం వల్ల మీ స్మార్ట్‌ఫోన్ పనితీరు మెరుగుపడటమే కాకుండా, అది ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories