Tech News: కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టేశాం. ఈ ఏడాది పలు రంగాల్లో అభివృద్ధి పరుగులు పెట్టనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా ఈ ఏడాదిలో పలు అత్యాధునిక గ్యాడ్జెట్లు మార్కెట్లో సందడి చేయనున్నాయి. అవేంటంటే..
2026లో టెక్నాలజీ ప్రపంచం పూర్తిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఫోల్డబుల్ ఐఫోన్‌పై అందరి దృష్టి ఉన్నా, ఆ ఒక్క డివైస్‌తోనే మార్పు ఆగిపోదు. యాపిల్‌తో పాటు గూగుల్, సామ్‌సంగ్, మోటరోలా సంస్థలు కూడా కొత్త తరహా డివైస్‌లతో మార్కెట్‌ను కదిలించేందుకు సిద్ధమవుతున్నాయి. ఫోల్డబుల్ ఫోన్లు, XR గ్లాసెస్ లాంటి ఉత్పత్తులు వినియోగదారుల అనుభవాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లనున్నాయి.
25
యాపిల్ తొలి ఫోల్డబుల్ ఐఫోన్ నుంచి భారీ అంచనాలు
యాపిల్ తన మొదటి ఫోల్డబుల్ ఐఫోన్‌ను 2026 రెండో అర్ధభాగంలో విడుదల చేసే అవకాశం ఉంది. లీకుల ప్రకారం ఈ ఫోన్‌లో 7.8 అంగుళాల మెయిన్ డిస్‌ప్లే, 5.5 అంగుళాల కవర్ డిస్‌ప్లే ఉండనుంది. ముఖ్యంగా క్రీజ్ కనిపించని డిస్‌ప్లే టెక్నాలజీపై యాపిల్ ప్రత్యేకంగా పనిచేస్తున్నట్లు సమాచారం. ధర విషయానికి వస్తే ఇది రూ.2 లక్షలకుపైగా ఉండొచ్చని అంచనా. ఈ ఫోన్ ఫోల్డబుల్ సెగ్మెంట్‌ను పూర్తిగా మార్చేస్తుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.
35
గూగుల్ XR గ్లాసెస్‌తో కొత్త డిజిటల్ అనుభవం
గూగుల్ 2026లో ఆండ్రాయిడ్ XR గ్లాసెస్‌ను మార్కెట్‌లోకి తీసుకురానుంది. ఈ స్మార్ట్ గ్లాసెస్‌లో ఇన్-లెన్స్ మైక్రో LED డిస్‌ప్లే ఉంటుంది. యూజర్లు గ్లాసెస్ ధరిస్తే ఫోన్ స్క్రీన్ లాంటి విజువల్స్ నేరుగా కనిపిస్తాయి. మ్యూజిక్ వినడం, వీడియో కాల్స్ చేయడం, మ్యాప్స్ ద్వారా నావిగేషన్, ఇమేజ్ జనరేషన్ వంటి ఫీచర్లు ఇందులో అందుబాటులో ఉండనున్నాయి. గూగుల్ జెమినీ ఏఐ సపోర్ట్‌తో ఈ గ్లాసెస్ పూర్తిగా స్మార్ట్ అసిస్టెంట్‌లా పనిచేయనున్నాయి.
సామ్‌సంగ్ ట్రై-ఫోల్డ్ ఫోన్‌తో మల్టీటాస్కింగ్ కొత్త స్థాయి
సామ్‌సంగ్ ఇప్పటికే తన తొలి ట్రై-ఫోల్డ్ ఫోన్‌ను దక్షిణ కొరియాలో విడుదల చేసింది. త్వరలోనే ఈ ఫోన్ అమెరికా సహా ఇతర దేశాల్లో కూడా అందుబాటులోకి రానుంది. పూర్తిగా అన్‌ఫోల్డ్ చేస్తే ఇందులో 10 అంగుళాల AMOLED డిస్‌ప్లే లభిస్తుంది. ఒకేసారి మూడు యాప్‌లను ఉపయోగించే అవకాశం ఈ ఫోన్ ప్రత్యేకత. 5,600mAh శక్తివంతమైన బ్యాటరీతో దీర్ఘకాలిక వినియోగానికి ఇది అనుకూలంగా ఉంటుంది. మల్టీటాస్కింగ్ చేసే వారికి ఇది గేమ్ ఛేంజర్‌గా మారనుంది.
55
మోటరోలా తొలి బుక్ స్టైల్ ఫోల్డబుల్‌కు రంగం సిద్ధం
మోటరోలా ఇప్పటికే ఫ్లిప్ స్టైల్ ఫోల్డబుల్ ఫోన్లతో మార్కెట్‌లో తనదైన గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు బుక్ స్టైల్ ఫోల్డబుల్ ఫోన్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. రాబోయే రోజుల్లోనే మోటరోలా తన తొలి బుక్ స్టైల్ ఫోల్డబుల్‌ను ఆవిష్కరించే అవకాశం ఉంది. ఈ ఫోన్ సామ్‌సంగ్ జెడ్ ఫోల్డ్ సిరీస్‌కు గట్టి పోటీ ఇవ్వనుందని అంచనా. డిజైన్, ఫీచర్లు, ధర పరంగా ఇది వినియోగదారులను ఆకట్టుకునేలా ఉండొచ్చని టెక్ వర్గాలు భావిస్తున్నాయి.