అప్పట్లో చైనా యాప్స్ ఇప్పుడు చైనా స్మార్ట్ ఫోన్స్.. ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. ?

First Published Oct 19, 2021, 5:49 PM IST

గత సంవత్సరం 2020లో పబ్-జి, టిక్ టాక్ తో సహా 250కి పైగా చైనీస్ యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించిన సంగతి మీకు తెలిసిందే. అయితే తాజాగా ఇప్పుడు చైనా స్మార్ట్‌ఫోన్‌లు ప్రభుత్వ లక్ష్యంగా ఉన్నాయి. నివేదిక ప్రకారం ప్రభుత్వం త్వరలో భారతదేశంలో లాంచ్ చేయబోయే అన్ని చైనీస్ స్మార్ట్‌ఫోన్‌లపై దర్యాప్తు చేయవచ్చు. 

ఈ ఇన్వెస్టిగేషన్ సమయంలో ఫోన్‌లో ఇప్పటికే ఇన్‌స్టాల్ చేసిన యాప్‌లు (pre installed apps)వినియోగదారులపై గూఢచర్యం చేస్తున్నాయో లేదో నిర్ధారించనుంది. అంతేకాకుండా ఫోన్ భాగాలను(spare parts)కూడా తనిఖీ చేయవచ్చు. ఒక వార్తా పత్రిక నివేదిక ప్రకారం ప్రభుత్వం ఈ పరిశోధన కోసం ఒక కొత్త నియమాన్ని రూపొందించవచ్చు...

ఈ నిబంధనలు  ఏ పరిశ్రమకు వర్తిస్తుంది
నివేదిక ప్రకారం కొత్త నిబంధనను ప్రవేశపెట్టిన తర్వాత మొత్తం భారతీయ మొబైల్ పరిశ్రమకు వర్తిస్తుంది, అయితే చైనా కంపెనీలపై కఠినంగా విచారణ జరుగనుంది. ఇందుకు ఫోన్‌లో ముందుగా ఇన్‌స్టాల్ చేయబడిన యాప్‌ల కోసం ప్రభుత్వం సోర్స్ కోడ్‌ను డిమాండ్ చేయవచ్చు. కొత్త రూల్ ప్రవేశపెట్టిన తర్వాత మొబైల్‌ తయారీదారులు మొబైల్‌లో ఉపయోగిస్తున్న వీడి భాగాల కంపెనీల జాబితాను కూడా పొందవచ్చు. మొత్తంగా, ప్రభుత్వం భారతదేశంలో విడుదల చేసిన అన్ని స్మార్ట్‌ఫోన్‌ల హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌లను పరిశీలించాలనుకుంటోంది.

ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నా కంపెనీలు
వివో, ఒప్పో, షియోమి, వన్‌ప్లస్ భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో దాదాపు 50 శాతం వాటాను కలిగి ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో కొత్త నిబంధన అమలు చేసిన తర్వాత ఈ కంపెనీలపై కఠినంగా దర్యాప్తు చేయవచ్చు. దర్యాప్తులో భారతదేశంలో విక్రయించే స్మార్ట్‌ఫోన్‌లు భారతీయ వినియోగదారులకు సురక్షితమేనా కాదా అనేది నిర్ధారించనుంది. ఈ నివేదికపై ప్రభుత్వం లేదా చైనీస్ మొబైల్ కంపెనీల నుండి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

ప్రీ ఇన్‌స్టాల్ చేసిన యాప్స్ ద్వారా గూఢచర్యం చేసే ప్రమాదం
ఇటీవల డబ్లిన్‌లోని ట్రినిటీ కాలేజీలో నిర్వహించిన పరిశోధనలో అన్ని కంపెనీల ఫోన్‌లలో ముందుగా ఇన్‌స్టాల్ చేసిన యాప్‌లు వినియోగదారుల డేటాను తమ సర్వర్లలో రహస్యంగా నిల్వ చేస్తున్నాయని తెలిపింది. ఈ యాప్స్ స్క్రీన్, వెబ్ యాక్టివిటీ, ఫోన్ కాల్స్, డివైజ్ వంటి సమాచారాన్ని స్టోర్ చేస్తాయి. ఈ నివేదికను తయారు చేయడానికి Samsung, Xiaomi, Huawei, Realme, LineageOS, e/OS నుండి పంపిన డేటా ఉపయోగించారు. గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న యాప్‌లలో గూగుల్, ఫేస్‌బుక్, మైక్రోసాఫ్ట్ యాప్స్ పేర్లు ఉన్నాయి.  

click me!