Viral News: ప్రస్తుతం చైనాలో ఓ యాప్ తెగ వైరల్ అవుతోంది. ముఖ్యంగా ఒంటరిగా జీవించే యువత ఈ యాప్‌ను పెద్ద ఎత్తున డౌన్‌లోడ్ చేస్తున్నారు. Are You Dead పేరుతో తీసుకొచ్చిన ఈ యాప్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
చైనాలో తాజాగా ఓ యాప్ విపరీతంగా ట్రెండ్ అవుతోంది. పేరు వినగానే షాక్ ఇచ్చేలా ఉన్న ఈ యాప్ పేరు “Are You Dead?”. దీని కాన్సెప్ట్ చాలా సింపుల్. యాప్‌ను ఉపయోగించే వ్యక్తి ప్రతి రెండు రోజులకు ఒకసారి బటన్ నొక్కి తాను సురక్షితంగా ఉన్నానని కన్ఫర్మ్ చేయాలి. అలా చేయకపోతే, ముందే ఎంపిక చేసిన ఎమర్జెన్సీ కాంటాక్ట్‌కి అలర్ట్ వెళ్తుంది.
25
ఈ యాప్ ఎలా పనిచేస్తుంది?
యాప్ డౌన్‌లోడ్ చేసిన తర్వాత యూజర్ తనకు నమ్మకమైన ఒక వ్యక్తి ఫోన్ నంబర్ లేదా మెయిల్‌ను ఎమర్జెన్సీ కాంటాక్ట్‌గా సెట్ చేయాలి. ప్రతి 48 గంటలకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. దానిపై క్లిక్ చేస్తే సరిపోతుంది. నిర్ణీత సమయంలో స్పందన లేకపోతే, “ఏదో సమస్య ఉండొచ్చు” అనే మెసేజ్ ఎమర్జెన్సీ కాంటాక్ట్‌కి పంపుతుంది. ఇందులో లాగిన్, ఎక్కువ పర్సనల్ డేటా అవసరం ఉండదు.
35
యువత ఎందుకు ఈ యాప్ వాడుతున్నారు?
చైనాలో పెద్ద నగరాల్లో ఒంటరిగా జీవించే యువత సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఉద్యోగం, చదువు కారణంగా కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినా, ప్రమాదం జరిగినా… రోజులు తరబడి ఎవరికీ తెలియకుండా ఉండిపోతామేమో అనే భయం చాలామందిలో ఉంది. ఈ యాప్ “ఎవరైనా ఒకరు నన్ను గమనిస్తారు” అనే భద్రత భావన ఇస్తోంది. అందుకే యువ ఉద్యోగులు, విద్యార్థులు ఎక్కువగా దీనిని వాడుతున్నారు.
కొంతమంది యాప్ పేరు చాలా నెగటివ్‌గా ఉందని విమర్శిస్తున్నారు. అశుభంగా ఉంటుందని, పేరు మార్చాలని సూచిస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం “ఒంటరిగా జీవించే వారికి ఇది అవసరమే” అని సపోర్ట్ ఇస్తున్నారు. “ఒంటరిగా చనిపోతే ఎవరికీ తెలియకపోతే?” అనే ఆలోచన తమను భయపెడుతుందని పలువురు యూజర్లు సోషల్ మీడియాలో వెల్లడించారు.
55
ఈ యాప్‌ను ఎవరు డెవలప్ చేశారు.?
ఈ యాప్‌ను Moonscape Technologies అనే చిన్న స్టార్టప్ రూపొందించింది. కేవలం వెయ్యి యువాన్ ఖర్చుతో తయారైన ఈ యాప్ ప్రస్తుతం కోట్ల విలువకు చేరింది. ఇప్పటికే చైనాలోనే కాకుండా అమెరికా, సింగపూర్, హాంగ్‌కాంగ్ లాంటి దేశాల్లోనూ డౌన్‌లోడ్స్ పెరుగుతున్నాయి. భవిష్యత్తులో వృద్ధుల కోసం ప్రత్యేకంగా మరో వెర్షన్ తీసుకురావాలని యాప్ సంస్థ ఆలోచిస్తోంది. ఒంటరిగా జీవించే వృద్ధులకు భద్రత కల్పించడమే లక్ష్యమని చెబుతోంది.