ఒకే యాప్.. 13 రెట్లు తేడా
ఇటీవల ఆపిల్, ఆండ్రాయిడ్ ఫోన్లలో ఒకే యాప్ లో వివిధ రకాల ధరలు ఉండటం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తాజాగా ది మావెరిక్స్ సీఈఓ చేతన్ మహాజన్ ఐఫోన్ నుండి అండ్రాయిడ్ ఫోన్‌కు మారడం గురించి చేసిన ఒక పోస్టు కొత్త చర్చకు దారితీసింది.
ఈ మార్పు సులభంగా సాగుతుందని ఆయన అనుకున్నారు. కానీ అది 20 రోజుల సవాలుగా మారింది. వాట్సాప్ చాట్‌లను కొత్త ఫోన్‌కి మార్చే ప్రయత్నం చేస్తూ ఆయన పదిసార్లు విఫలమయ్యారు. అనేక సార్లు iCloud బ్యాకప్ చేసుకోవాల్సి వచ్చింది, ఫ్యాక్టరీ రీసెట్‌లు చేయాల్సి వచ్చింది.
చివరకు ఆయనకు జెనరేటివ్ AI సాయం చేసింది. ఇది “మొబైల్‌ట్రాన్స్ (MobileTrans)” అనే యాప్‌ను సూచించింది. ఆ యాప్ ద్వారా డేటా సక్సెస్‌ఫుల్‌గా ట్రాన్స్‌ఫర్ అయింది. కానీ ధర చూసి ఆయన ఆశ్చర్యపోయారు.. ఆపిల్ యాప్ స్టోర్‌లో నెలకు ₹2,499 కాగా, అదే యాప్ అండ్రాయిడ్‌లో కేవలం ₹186 మాత్రమే ఉంది. ఇదే విషయంపై “ఒకే యాప్, ఒకే అనుభవం, కానీ 13 రెట్లు ధర తేడా” అంటూ చేతన్ చేసిన పోస్టు కొత్త చర్చకు దారితీసింది.