Published : Jul 30, 2025, 07:28 PM ISTUpdated : Jul 30, 2025, 07:33 PM IST
NISAR Satellite Launch భారతదేశం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాతో కలిసి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన భూ పరిశీలన ఉపగ్రహం NISARను ప్రయోగించింది. దీని వల్ల ఉపయోగాలేంటో తెలుసా?
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) మరో ఘనత సాధించింది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా (NASA) తో కలిసి రూపొందించిన 'నిసార్' ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి సక్సెస్ ఫుల్ గా పంపించింది. ప్రత్యేకమైన ఈ అంతరిక్ష ప్రయోగానికి ఆంధ్ర ప్రదేశ్ వేదికయ్యింది. శ్రీహరికోట స్పేస్ సెంటర్ నుంచి ఇస్రోకి చెందిన GSLV రాకెట్ నిసార్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి మోసుకెళ్లింది. ఈ శాటిలైట్ భూమిచుట్టూ తిరుగుతూ అత్యంత స్పష్టతతో భూమికి సంబంధించిన ఢాటాను అందిస్తుంది.
ఈ నిసార్ ప్రయోగాన్ని ఇస్రో, నాసా సంయుక్తంగా నిర్వహించాయి. ఇప్పటివరకు నిర్మించిన అత్యంత ఖరీదైన ఉపగ్రహాల్లో ఈ నిసార్ ఒకటి. ఈ మిషన్ కోసం ఖర్చచేసిన మొత్తం దాదాపు 1.5 బిలియన్ డాలర్లు...అంటే ఇండియన్ రూపాయల్లో 12 వేల కోట్లపై పైనే.
DID YOU KNOW ?
నిసార్ డేటా ఫ్రీ
నాసాతో కలిసి ఇస్రో తయారుచేసిన ఈ నిసార్ శాటిలైట్ రోజుకు సుమారు 4,300 జీబీ హై రిజల్యూషన్ డేటా సేకరిస్తుంది. ఈ డేటా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు ఉచితంగానే లభిస్తుంది.
26
NISAR శాటిలైట్ ప్రత్యేకతలు
2,392 కిలోల బరువున్న ఈ నిసార్ శాటిలైట్ భూమి చుట్టూ తిరుగుతుంది. భూమి ఉపరితలం చిత్రాలను తీయడానికి ఇది రెండు శక్తివంతమైన రాడార్ వ్యవస్థలను కలిగివుంది… ఇది నాసా L-బ్యాండ్, ఇస్రో S-బ్యాండ్‌లను ఉపయోగిస్తుంది. ఈ ఉపగ్రహం నుండి పగలు, రాత్రి అని తేడాలేకుండా ఢాటా అందుతుంది... అన్ని వాతావరణ పరిస్థితుల్లో ఇది ఖచ్చితత్వంతో పనిచేస్తుంది.
ఉపగ్రహం దాదాపు మొత్తం భూమిని, ముఖ్యంగా సముద్ర, భూ ఉపరితలాలు, మంచు ప్రాంతాలను ప్రతి 12 రోజులకు కవర్ చేస్తుంది. భూమి కొన్ని మిల్లీమీటర్లు కదిలినా కూడా గుర్తించేలా దీన్ని రూపొందించారు. ఇది 743 కి.మీ ఎత్తులో తిరుగుతున్నా అడవులు, మేఘాల కదలికలను రాత్రి సమయంలో కూడా పరిశీలించగలదు.
36
నిసార్ శాటిలైట్ వల్ల లాభాలు
భారతదేశం భూకంపాలు, వరదలు, కరువులు, కొండచరియలు విరిగిపడటం వంటి అనేక ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంటోంది. ఇటువంటి విపత్తులను ముందుగానే ట్రాక్ చేయడానికి, వేగంగా స్పందించడానికి నిసార్ సహాయపడుతుంది. ఇది హిమాలయాల్లోని హిమానీనదాలను పర్యవేక్షించడం, వ్యవసాయ పెరుగుదలను ట్రాక్ చేయడం, నీటి వనరుల నిర్వహణ, భూగర్భంలోని ఫాల్ట్ లైన్‌లను గుర్తించడంలో సహాయపడుతుంది.
ఈ ఉపగ్రహం చాలా ఖచ్చితమైన ఢాటాను చాలా తొందరగా అందిస్తుంది. దీనవల్ల ఏదైనా ప్రమాద సూచనలుంటే శాస్త్రవేత్తలు, విపత్తు బృందాలు, ప్రభుత్వ అధికారులు వేగంగా స్పందించవచ్చు.. ఈ ఉపగ్రహ సమాచారం ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడానికి వీలుంటుంది.
నిసార్ ఉపగ్రహ ప్రయోగం ఇండియా, అమెరికా సంయుక్తంగా చేపట్టిన ప్రయోగం... రెండు దేశాల అంతరిక్ష సంస్థల సమిష్టి కష్టమిది. ఈ ఉపగ్రహాన్ని నిర్మించడానికి NASA, ISRO శాస్త్రవేత్తలు దాదాపు 10 సంవత్సరాలు కలిసి పనిచేశారు.
NASA L-బ్యాండ్ రాడార్, 12 మీటర్ల వెడల్పు గల రిఫ్లెక్టర్‌ను తయారు చేసింది. ఇది నేల, మంచు కింద భాగాలు, అడవుల లోపల మార్పులను గుర్తిస్తుంది. మట్టిలో తేమ, భూస్కలనం వంటి వాటిని ట్రాక్ చేస్తుంది. ISRO S-బ్యాండ్ రాడార్, ఉపగ్రహ నిర్మాణాన్ని చేపట్టింది... ఈ రాడార్ పంటలు, భూభాగ మార్పులు, మంచు కరుగుదల వంటి ఉపరితల మార్పులను గుర్తిస్తుంది. ఈ ఉపగ్రహ భాగాలను విడిగా నిర్మించిన తరువాత ISRO ఉపగ్రహ కేంద్రంలో ఒకటిచేసారు… తాజాగా ప్రయోగించారు.
56
ఇకపై నిసార్ ప్రయాణం ఇలా సాగుతుంది
శ్రీహరి కోట నుండి విజయవంతంగా అంతరిక్షంలోని దూసుకెళ్లింది నిసార్. ఇక ఈ మిషన్ దశల వారిగా ముందుకు వెళుతూ పనిని ప్రారంభిస్తుంది.
విస్తరణ: నాసాకు చెందిన పెద్ద రాడార్ రిఫ్లెక్టర్ అంతరిక్షంలోకి చేరుకుని పెద్ద గొడుగులా ఓపెన్ అవుతుంది.
కమిషనింగ్: ఈ 90 రోజుల దశలో అన్ని వ్యవస్థలను తనిఖీ చేసి పరీక్షిస్తారు. సైన్స్ ఆపరేషన్ల కోసం అబ్జర్వేటరీని సిద్ధం చేయడానికి ఈ రోజులు ఇన్-ఆర్బిట్ చెక్అవుట్‌కు అంకితం చేయబడతాయని ISRO తెలిపింది.
సైన్స్ ఆపరేషన్లు: ఉపగ్రహం పూర్తి సమయం పనిని ప్రారంభిస్తుంది. పరిశోధన, ప్రజా వినియోగం కోసం డేటాను భూమికి తిరిగి పంపుతుంది.
66
నిసార్ ఉపగ్రహంతో భవిష్యత్ అవసరాలు
ఈ మిషన్ కేవలం సాంకేతికత గురించి మాత్రమే కాదు... ఇది భూమికి సహాయం చేయడానికి చేపట్టింది. భూమిలోని మార్పులను నిశితంగా ట్రాక్ చేయడం ద్వారా విపత్తుల సమయంలో వేగంగా చర్య తీసుకోవడానికి, భవిష్యత్తు కోసం మెరుగ్గా ప్రణాళిక వేయడానికి NISAR మనకు సహాయపడుతుంది.