Driving Tips: కొత్తగా కారు డ్రైవింగ్ నేర్చుకుంటున్నారా? ఈ​ టిప్స్​ మీ కోసమే!

Published : Jul 30, 2025, 08:01 AM IST

Car Driving Tips : మీరు కొత్తగా కారు నడపడం నేర్చుకుంటున్నారా? లేదా ఇప్పుడిప్పుడే సొంతంగా కారు డ్రైవింగ్ చేస్తున్నారా? అయితే, ఈ టిప్స్ కచ్చితంగా పాటించండి. రోడ్డు ప్రమాదాల నుండి మిమ్మల్ని, ఇతరులను రక్షించవచ్చు.

PREV
19
ముందుగా ఇవి సరిచూసుకోండి

చాలామందికి కారు డ్రైవింగ్‌ నేర్చుకోవాలనే కోరిక. ఈ మధ్యకాలంలో మధ్య తరగతి కుటుంబాలు సైతం కారును కొనుగోలు చేస్తున్నారు. అయితే వీటన్నింటికి ముందు కారు డ్రైవింగ్‌ వచ్చి ఉండాలి. అయితే.. కారులో కూర్చోగానే హీరోలాగా ఫీల్ అయ్యి వేగంగా డ్రైవ్ చేయకండి. 

మొదటగా సీటు పొజిషన్ సరిచూడండి, తద్వారా మీరు స్టీరింగ్, పెడల్స్‌ను సౌకర్యంగా ఆపరేట్ చేయగలుగుతున్నామా? అనే చూసుకోండి. ఆ తర్వాత మిర్రర్లు సెట్ చేసుకోండి. వెనుక, సైడ్ వ్యూ స్పష్టంగా కనిపిస్తుందా? లేదా? అనేది తెలుసుకోండి. చివరగా, సీట్‌బెల్ట్ పెట్టుకోండి. మీరు కంఫర్ట్‌గా ఉన్నప్పుడే కారును స్టార్ట్ చేయండి. 

29
మొబైల్ కు దూరం

డ్రైవింగ్ సమయంలో మొబైల్ ను దూరంగా ఉంచండి. కారు నడిపే సమయంలో వాట్సాప్, ఫేస్బుక్ వాడకండి. ఒక్క సెకను ఫోన్‌ వైపు చూసినా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఆ క్షణమే ప్రాణాలకు ముప్పు కావచ్చు. ఏ విషయాలను ఆలోచించకుండా డ్రైవింగ్‌ పైనే పూర్తి శ్రద్ధ పెట్టండి.

39
దూరం పాటించండి

మీ ముందు వెళ్తున్న వాహనాలకు దగ్గరగా వెళ్లకండి. బ్రేకింగ్ సమయంలో ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువ. మీ వాహనానికి ముందు వాహనానికి కనీసం 15 అడుగుల దూరం పాటిస్తే, ఏ అనుకోని పరిస్థితినైనా సురక్షితంగా ప్రమాదాల నుంచి తప్పించుకుంటారు. 

49
వర్షాకాలంలో జాగ్రత్త

వర్షాకాలంలో తడిసిన రోడ్డుపై డ్రైవింగ్‌ చేసేటప్పుడు ఎక్కువ జాగ్రత్త అవసరం. వేగాన్ని తగ్గించి, బ్రేక్‌ను మెల్లగా వాడండి. జారుడు ప్రదేశాలు, ఎత్తైన ప్రదేశాలు, ఘాట్ రోడ్లపై డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. 

59
యూ టర్న్-లో జాగ్రత్త

బ్లైండ్ స్పాట్‌ను తక్కువ అంచనా వేయకండి. టర్న్ చేయాలంటే.. సెంటర్ మీడియన్ చివర, మీ భుజం అదే లైన్‌లోకి వచ్చినప్పుడే మలుపు వేయండి. అప్పుడే సురక్షితంగా, సరిగ్గా టర్న్ అవుతారు. 

69
ఓవర్ టేక్ చేసేటప్పుడు

ఓవర్‌టేక్ చేసే ముందు పాస్ లైట్,  హార్న్ తప్పనిసరిగా ఇవ్వండి. సరైన సమయంలో ఓవర్ టేక్ చేయండి. మలుపుల దగ్గర ఓవర్‌టేక్ చేయడం ప్రమాదకరం. 

79
ఘాట్ రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు

ఘాట్ రోడ్డులో, ఎత్తైన ప్రాంతంలో డ్రైవింగ్ చేసేటప్పుడు ఫస్ట్ గేర్‌నే వెళ్లండి. ఇలా చేయడం వల్ల ఇంజిన్ పవర్‌ని పూర్తిగా ఉపయోగించుకోవచ్చు. అలాగే దిగే సమయంలో కూడా ఫస్ట్ గేర్ వాడండి, ఇది బ్రేకింగ్‌కి సహాయపడుతుంది. దిగే సమయంలో న్యూట్రల్‌లో ప్రయాణించకూడదు. వాహనం నియంత్రణ తప్పే అవకాశం ఉంది. ఇది అత్యంత ప్రమాదకరం.

89
పార్కింగ్ సమయంలో

రివర్స్ కెమెరా ఉన్నా, నేరుగా వెనక్కు చూసి హద్దులు, వ్యక్తులు ఉన్నారా? లేదా? అనేది ఖచ్చితంగా నిర్ధారించుకోవాలి. అవసరమైతే ఎవరి సహాయమైనా అడగండి. కెమెరాపై పూర్తిగా ఆధారపడకండి. 

99
అలసిపోతే..

డ్రైవింగ్ సమయంలో అలసిపోయినట్లైతే వెంటనే కారు ఆపండి. శరీరం అలసిపోయినప్పుడు డ్రైవింగ్ చేయడం ప్రమాదకరం. కాఫీ లేదా శీతల పానీయాలు తాగి, కొంత సమయం విశ్రాంతి తీసుకోండి. తేలికగా అనిపించిన తర్వాతే మళ్లీ ప్రయాణాన్ని కొనసాగించండి.

Read more Photos on
click me!

Recommended Stories