ఇన్‌స్టాగ్రామ్ విజయవంతంలో రీల్స్ ఒక కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక రీల్ పూర్తికాగానే మరో రీల్ చూడాలంటే స్క్రీన్‌పై స్క్రోల్ చేయాలనే విషయం తెలిసిందే. అయితే ఇకపై ఆ అవసరం లేకుండా కొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది ఇన్‌స్టాగ్రామ్.
ఆటో స్క్రోల్ పేరుతో తీసుకొస్తున్న ఈ ఫీచర్ సహాయంతో ఇకపై స్క్రోల్ చేయాల్సిన అవసరం ఉండదు. ఒక వీడియో పూర్తవగానే దానంతటదే తదుపరి వీడియోకి జంప్ అవుతుంది. దీని వల్ల యూజర్లు ప్రతీ సారి స్క్రోల్ చేయాల్సిన పని ఉండదు.
25
క్రియేటర్లకు లాభం
ఈ ఫీచర్ వల్ల రీల్ క్రియేటర్లకు మంచి ప్రయోజనం ఉండనుంది. ఎందుకంటే వినియోగదారులు ఎక్కువ వీడియోలు చూడగలగడం వల్ల వ్యూస్ కూడా పెరిగే అవకాశం ఉంది. అలా అయితే అల్గారిథంలో రీచ్ మెరుగవుతుంది. ముఖ్యంగా సినిమా ప్రమోషన్, షార్ట్ న్యూస్, టెక్ టిప్స్ ఇచ్చే క్రియేటర్లకు ఇది మంచి అవకాశంగా మారనుంది.
35
హెచ్చరిస్తోన్న నిపుణులు
అయితే ఈ ఆటో స్క్రోల్ వల్ల సమస్య కూడా వచ్చే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల స్క్రీన్ టైమ్ మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. చేతితో స్క్రోల్ చేయాలంటే కొంతకైనా బ్రేక్ ఉంటుంది. కానీ ఆటో స్క్రోల్ వల్ల కంటెంట్ నిరంతరం కొనసాగుతుండటంతో డిజిటల్ అడిక్షన్ పెరిగే ప్రమాదం ఉందని మానసిక ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది ముఖ్యంగా టీనేజర్లు, యువతలో ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఇన్‌స్టాగ్రామ్ ఈ ఫీచర్‌ను ఇప్పుడు కొంతమంది ఎంపిక చేసిన యూజర్లతో పరీక్షిస్తోంది. యూజర్ బిహేవియర్, యూజ్ టైం, ఎంగేజ్‌మెంట్ లాంటి అంశాలను విశ్లేషించిన తర్వాత ఇది ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది. టెస్టింగ్ సక్సెస్ అయితే వచ్చే నెలలో ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.
55
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?
ఆటో స్క్రోల్ ఫీచర్ ఉపయోగించే సమయంలో టైమ్ లిమిట్ సెట్టింగ్ పెట్టుకోవడం మంచిది. ప్రతి రీల్‌కి మధ్యలో ఒకసారి బ్రేక్ తీసుకోవడం అవసరం. చిన్నపిల్లల ఫోన్లలో పేరెంటల్ కంట్రోల్ ఆప్షన్లను యాక్టివ్ చేయాలి. టెక్నాలజీ అనేది ఎంత అడ్వాన్స్‌డ్ అయినా సరే కచ్చితంగా లిమిట్ అంటూ ఉండాలి.