Jio Recharge Plan: జియో వినియోగదారుల కోసం అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. జియో ఈ ప్లాన్‌తో 84 రోజుల వాలిడిటీ, డైలీ 2GB డేటా, అన్లిమిటెడ్ 5G డేటాతో పాటు అమెజాన్ ప్రైమ్, జియో హాట్ స్టార్ వంటి ఓటీటీ సర్వీసులను ఫ్రీగా అందిస్తోంది.
జియో సూపర్ రీఛార్జ్ ప్లాన్: హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్ ఫ్రీ
రిలయన్స్ జియో దేశవ్యాప్తంగా టెలికాం రంగంలో సంచలనాలతో ముందంజలో ఉంది. వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పండుగల సీజన్‌లో కంపెనీ ఆకర్షణీయమైన ప్లాన్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. తక్కువ ధరలో ఎక్కువ ప్రయోజనాలు కోరుకునే కస్టమర్ల కోసం జియో రూ.1029 ప్లాన్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. ఈ ప్లాన్‌లో 84 రోజుల వాలిడిటీతో పాటు అనేక అదనపు ప్రయోజనాలు ఉన్నాయి. టాప్ ఓటీటీ సేవలను ఇందులో ఫ్రీగా అందిస్తోంది.
25
84 రోజుల వాలిడిటీతో జియో అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్ ప్రయోజనాలు
రూ.1029 ప్లాన్‌లో 84 రోజుల వరకు వాలిడిటీ ఉంటుంది. ఈ రీఛార్జ్ పై వినియోగదారులు రోజుకు 2GB హై-స్పీడ్ డేటా పొందుతారు. మొత్తం 168GB డేటా అందుతుంది. అయితే, 5జీ నెట్ వర్క్ ఏరియాలలో మీరు అన్లిమిటెడ్ 5G డేటాను పొందుతారు. దీంతో మీరు స్ట్రీమింగ్, డౌన్‌లోడ్స్‌కు డేటా అయిపోతుందనే ఆందోళన పడాల్సిన అవసరం వుండదు. డైలీ 100 SMS ఉచితంగా లభిస్తాయి. అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ప్రయోజనాలు కూడా ఉంటాయి.
35
ఫ్రీ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్లు
ఈ ప్లాన్ ప్రధాన ఆకర్షణ వినోద సేవలు ఉచితంగా లభించడం. వినియోగదారులు 84 రోజుల పాటు అమెజాన్ ప్రైమ్ లైట్ (Amazon Prime Lite) సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా పొందుతారు. దీంతో పాటు జియో హాట్ స్టార్ (JioHotstar) మొబైల్/టీవీ సబ్‌స్క్రిప్షన్ 3 నెలల పాటు ప్రీగా వస్తుంది. మూవీస్, వెబ్ సిరీస్, లైవ్ స్పోర్ట్స్ స్ట్రీమింగ్ కోరుకునే వారికి ఇది బెస్ట్ రీఛార్జ్ ప్లాన్ అని చెప్పవచ్చు.
జియో హోమ్ (JioHome) 2 నెలల ఫ్రీ ట్రయల్ కూడా ఈ రీఛార్జ్ ప్లాన్ పై లభిస్తుంది. అలాగే, జియో ఏఐ క్లౌడ్ (JioAICloud) స్టోరేజ్ 50 జీబీ వరకు ఉచితంగా అందుతుంది. ఈ డిజిటల్ సేవలు జియో ప్లాన్ విలువను మరింత పెంచుతున్నాయి. క్లౌడ్ స్టోరేజ్ తో మీరు మీ డేటాను ఎక్కడైనా యాక్సెస్ చేయవచ్చు. ఇది పూర్తిగా సురక్షితంగా ఉంటుందని కంపెనీ తెలిపింది.
55
వినియోగదారులకు సరైన ఫెస్టివ్ ఆఫర్
పండుగల నేపథ్యంలో వినియోగదారుల డిమాండ్ దృష్ట్యా జియో ఈ ప్రయోజనాలను ప్రకటించింది. తక్కువ ఖర్చుతో మూడు నెలల పాటు ఎక్కువ డేటా, కాలింగ్, వినోదం అందించడం ఈ ప్లాన్ ప్రత్యేకత. డిజిటల్ కంటెంట్ ఎక్కువగా ఉపయోగించే కస్టమర్లకు ఇది బెస్ట్ ఎంపికగా నిలుస్తోంది.
ఈ ప్లాన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు జియో అధికారిక వెబ్‌సైట్‌లో లభిస్తాయి. రీచార్జ్ చేసే ముందుగా వినియోగదారులు పూర్తి ప్రయోజనాలను పరిశీలించవచ్చు. 84 రోజుల పాటు భారీ డేటా, వాయిస్ కాలింగ్, పాప్‌లర్ ప్లాట్‌ఫారమ్‌ల సబ్‌స్క్రిప్షన్లు ఉచితంగా అందించడంతో పాటు మీకు జియో హోమ్ ఫ్రీ ట్రయల్ కూడా లభించడంతో ఈ రీఛార్జ్ ప్లాన్ ప్రత్యేకంగా నిలుస్తోంది.