X Income : సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎంతోమంది డబ్బులు సంపాదించడం చూస్తుంటాం. కాానీ ఓ 21 ఏళ్ల భారతీయ యువకుడు ఎక్స్ ద్వారా డబ్బులు సంపాదిస్తున్నాడు. అదెలాగో ఇక్కడ తెలుసుకుందాం.
X Income : నేటి యువత ప్రతిభకు సోషల్ మీడియా ఒక వేదిక. చాలామంది యువకులు సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అవ్వడమే కాకుండా మంచి ఆదాయం కూడా పొందుతున్నారు. ఇలా యూట్యూబ్ లో ఛానల్ పెట్టుకుని, ఇన్స్టాగ్రామ్ లో ప్రమోషన్స్ ద్వారా చాలామంది భారీగా డబ్బులు సంపాదిస్తున్నారు. కానీ ఓ భారతీయ యువకుడు ఎక్స్ ద్వారా డబ్బులు సంపాదిస్తున్నాడు.
24
ఎక్స్ లో ఎంత ఆదాయం?
21 ఏళ్ల ఇంజనీర్ కనవ్ సోషల్ మీడియా ఎక్స్ లో పోస్టులు చేయడంద్వారా నెలకు ₹35,000 పైగా సంపాదిస్తున్నాడు. జూలైలో ₹35,000, ఆగస్టులో ₹32,000 సంపాదించినట్లు స్వయంగా అతడే ఎక్స్ వేదికన తెలిపాడు.జూలై 5 నుండి ఆగస్టు 30 వరకు ఎక్స్ ద్వారా ₹67,420 సంపాదించిన స్క్రీన్‌షాట్‌లను కూడా పంచుకున్నాడు. ఈ ఆదాయం ఐదు విడతలుగా వచ్చింది.
34
క్యాంపస్ ఇంటర్వ్యూ ఉద్యోగం కంటే ఎక్కువ జీతం
ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేయడం ద్వారా క్యాంపస్ ఇంటర్వ్యూలో వచ్చే సగటు ఆదాయం కంటే ఎక్కువ సంపాదిస్తున్నానని కనవ్ చెబుతున్నాడు. తాను పోస్ట్ చేయడం మొదలుపెట్టి రెండు నెలలే అయ్యిందని చెప్పాడు.
అతని కాలేజీలో సగటు క్యాంపస్ ప్లేస్‌మెంట్ ప్యాకేజీ ఏడాదికి ₹2.9 లక్షలు. సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేట్ చేయడం ద్వారా ఎంత వేగంగా డబ్బు సంపాదించవచ్చో ఇది చూపిస్తుంది.
ఎక్స్ క్రియేటర్ రెవెన్యూ షేరింగ్ ప్రోగ్రామ్ ద్వారా ఆదాయం పొందవచ్చు. ఈ పథకం అర్హత ఉన్న కంటెంట్ క్రియేటర్లకు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంది.
ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో ప్రీమియం లేదా వెరిఫైడ్ ఖాతా ఉండాలి. గత మూడు నెలల్లో కనీసం 5 మిలియన్ల ఆర్గానిక్ ఇంప్రెషన్స్, 500 మంది వెరిఫైడ్ ఫాలోవర్లు తప్పనిసరి. అలాగయితే ఎక్స్ ద్వారా కూడా ఆదాయం వస్తుంది.