Viral Video: జెమినీ ఏఐ దుస్తుల్లోని పుట్టు మ‌చ్చ‌ల‌ను కూడా స్కాన్ చేస్తుందా? ఈ వీడియో చూస్తే దడుసుకోవాల్సిందే.

Published : Sep 18, 2025, 07:16 AM IST

Viral Video: ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ రోజుకో అద్భుతాన్ని ఆవిష్క‌రిస్తోంది. ఈ క్ర‌మంలోనే తాజాగా బనానా ట్రెండ్ పేరుతో ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి. అయితే ఇది ప్రైవ‌సీకి ప్ర‌మాద‌క‌రంగా మారే ప్ర‌మాదం ఉంద‌న్న వాద‌నలు తెర‌పైకి వ‌స్తున్నాయి. 

PREV
15
బనానా AI చీర ట్రెండ్

ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్నది ‘బనానా AI చీర ట్రెండ్’. ఎప్పటికప్పుడు మోడ్రన్ డ్రెస్సుల్లో ఫొటోలు పోస్ట్ చేసే యువతులు కూడా ఈ కొత్త ట్రెండ్‌ను పెద్ద ఎత్తున వాడుతున్నారు. గూగుల్ జెమినీ టూల్ ద్వారా ఇచ్చిన ప్రాంప్ట్‌ల ఆధారంగా సినిమాటిక్ లుక్‌లో ఫొటోలు, వీడియోలు సృష్టించి వాటిని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తున్నారు. అయితే ఈ ట్రెండ్‌లో ఒక యువతి అనుభవం ఊహించని విధంగా మారి చర్చనీయాంశమైంది.

25
వింటేజ్ లుక్ కోసం ప్రయత్నించ‌గా

ఒక యువతి తన ఫొటోను గూగుల్ జెమినీలో అప్‌లోడ్ చేసి “చీరలో ఎలా కనిపిస్తానో” తెలుసుకోవాలని అనుకుంది. వింటేజ్ స్టైల్లో రూపొందించిన ఆ ఫొటోను చూసి మొదట ఆమె ఆనందించినా, కాసేపటికి ఆ ఫొటోలో కనిపించిన ఒక డీటైల్ ఆమెను కలవరపరిచింది.

35
పుట్టుమచ్చ చూసి షాక్

తన భుజంపై ఉన్న పుట్టుమచ్చ AI ద్వారా సృష్టించిన చీర ఫొటోలో స్పష్టంగా కనిపించింది. అయితే ఆ యువ‌తి ఏఐకి ఇచ్చిన ఫొటోలో మాత్రం ఆ పుట్టుమ‌చ్చ క‌వ‌ర్ అయ్యేలా చుడిదార్‌ను ధ‌రించింది. ఈ విష‌య‌మై ఆ యువ‌తి మాట్లాడుతూ.. “నా శరీరంపై ఉన్న ఆ గుర్తు గూగుల్ జెమినీకి ఎలా తెలిసింది?” అని ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేసింది. యువ‌తి పంచుకున్న‌ ఈ అనుభవం AI ట్రెండ్ ఎంతవరకు సురక్షితమో అనే చర్చకు దారితీసింది.

45
వైర‌ల్ అవుతోన్న వీడియోల

‘జలక్ భావ్ నానీ’ అనే యువతి ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్ పోస్ట్ చేస్తూ తనకు ఎదురైన షాకింగ్ అనుభవాన్ని వివరించింది. ఇటీవల పంజాబీ డ్రెస్‌లో, దానిపై చున్నీ వేసుకుని తీసుకున్న ఫొటోను అప్‌లోడ్ చేస్తే, గూగుల్ జెమినీ దానిని నల్ల చీర లుక్‌గా మార్చిందని తెలిపింది. ఫొటోను గమనించి చూసినప్పుడు తన భుజంపై ఉన్న పుట్టుమచ్చ కనిపించిందని, అది ఎలా సాధ్యమైందో అర్థం కాలేదని ఆమె చెప్పింది.

యువతి పోస్ట్ చేసిన వీడియో.. 

55
నెటిజ‌న్లు ఏమంటున్నారంటే.?

జలక్ ప్రశ్నలకు పలువురు నెటిజన్లు స్పందించారు. “ముందుగా మీరు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన ఇతర ఫొటోలు కూడా AI సిస్టమ్ స్కాన్ చేస్తుంది. వాటిని పరిశీలించి డేటా ఆధారంగా కొత్త ఫొటోలను రూపొందిస్తుంది” అని కామెంట్లలో స్పష్టం చేశారు. దీంతో ఈ కొత్త ట్రెండ్ సరదా అనిపించినా, వ్యక్తిగత గోప్యతపై సందేహాలు కలిగిస్తున్నట్టు చర్చ మొదలైంది.

Read more Photos on
click me!

Recommended Stories