ఇదేం మాస్ బ్యాటింగ్ మందానక్కా.. సెంచరీలో హాఫ్ సెంచరీ బౌండరీలా..!

Published : Oct 23, 2025, 07:03 PM IST

IND(W) vs NZ(W) : టీమిండియా ఓపెనర్లు స్మృతి మందాన, ప్రతీక రావల్ లు న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఉమెన్స్ వరల్డ్ కప్ 2025 లో కీలక సమయంలో ఈ ఇద్దరూ రెచ్చిపోయారు. దీంతో టీమిండియా భారీ స్కోరు దిశగా సాగుతోంది. 

PREV
15
టీమిండియా భారీ స్కోరు

India Women vs New Zealand Women : ఉమెన్స్ వరల్డ్ కప్ 2025 రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో టీమిండియా అదరగొడుతోంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ కు భారత ఓపెనర్లు చుక్కలు చూపించారు... ఇద్దరూ సెంచరీలు బాదడంతో టీమిండియా భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. అయితే మరో రెండు ఓవర్లు పూర్తయితే టీమిండియా బ్యాటింగ్ ముగుస్తుందనగా వర్షం అడ్డుకుంది. ప్రస్తుతం 48 ఓవర్లలో కేవలం 2 వికెట్ల నష్టానికి 329 పరుగులవద్ద నిలిచింది భారత్.

25
స్మృతి మందాన సూపర్ సెంచరీ

స్మృతి మందాన కేవలం 95 బంతుల్లోనే 109 పరుగులలో అద్భుత సెంచరీ చేసింది. ఇందులో 10 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి... ఇలా సెంచరీలో సగంకంటే ఎక్కువ పరుగులు (64 పరుగులు) బౌండరీలే ఉన్నాయంటే ఏ స్థాయిలో ఆమె విధ్వంసం సాగిందో అర్థం చేసుకోవచ్చు. కివీస్ బౌలర్లను చితక్కొడుతూ పరుగుల సునామీ సృష్టించింది స్మృతి మందాన. చివరికి సుజీ బేట్స్ మందానాను ఔట్ చేయడంతో న్యూజిలాండ్ కు కాస్త ఊరట లభించింది.

35
ప్రతీక రావల్ పరుగుల సునామీ

ఓవైపు స్మృతి మందాన దూకుడుగా ఆడుతుంటే మరోవైపు ప్రతీక రావల్ అద్భుత సహకారం అందించారు. దీంతో కేవలం ఓపెనర్లిద్దరే డబుల్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు... టీమిండియా స్కోరు 212 పరుగులు వద్ద ఉండగా స్మృతి మందాన ఔటయ్యారు. అయితే వికెట్ పడగొట్టిన సంతోషం కివీస్ టీంకు ఎక్కువసేపు నిలవలేదు... ప్రతీక రావల్ స్పీడ్ పెంచి తన బ్యాట్ కు పనిచెప్పింది. దీంతో ఆమెకూడా అద్భుత సెంచరీ సాధించింది... 134 బంతుల్లో 122 పరుగులతో (13 ఫోర్లు, 2 సిక్సర్లు) అదరగొట్టిన ప్రతీకను కివీస్ బౌలర్ అమెలియా కెర్ర్ ఔట్ చేశారు. కానీ అప్పటికే చేయాల్సిన విధ్వంసం చేశారు టీమిండియా ఓపెనర్లు.

45
కివీస్ కు చుక్కలు చూపిస్తున్న భారత బ్యాటర్లు

ఓపెనర్లు మంచి శుభారంభం అందించగా మిగతా బ్యాటర్లు దాన్ని కొనసాగిస్తున్నారు. జమీమా రోడ్రిగ్స్ (69 పరుగులు నాటౌట్) తనదైన స్టైల్లో దూకుడుగా బ్యాటింగ్ చేసింది... ఆమెకు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (10 పరుగులు) చక్కటి సహకారం అందిస్తున్నారు.. దీంతో టీమిండియా నిర్ణీత ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 329 పరుగులు చేసింది... ఇంకా రెండు ఓవర్లు మిగిలున్నాయి. అంటే కివీస్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచనుంది. 

55
భారత్ కే కాదు కివీస్ కూ చావోరేవో

స్వదేశంలో జరుగుతున్న ఉమెన్స్ వరల్డ్ కప్ 2025 మెగా టోర్నీని టీమిండియా విజయాలతో ఆరంభించింది. దీంతో అన్ని జట్లకంటే ముందే సేమీస్ కు చేరుకుంటుందని అభిమానులు భావించారు... కానీ వారి అంచనాలను తలకిందులు చేస్తూ వరుస ఓటములను చవిచూసింది. దీంతో భారత్ సెమీస్ ఆశలు సంక్లిష్టంగా మారాయి. ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా జట్లు సెమీస్ బెర్తును ఖాయం చేసుకున్నారు... మిగతా ఒక్క స్థానం కోసం భారత్, న్యూజిలాండ్, శ్రీలంక తలపడుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్ లో గెలిచే జట్టుకు సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి... అందుకే ఇది భారత్ తో పాటు కివీస్ కు కూడా చావోరేవో మ్యాచ్. బ్యాటింగ్ లో భారత్ ఆదిపత్యం సాగించింది… మరి బౌలింగ్ లో ఏం చేస్తుందో చూడాలి. 

Read more Photos on
click me!

Recommended Stories