RCB vs SRH : ఆర్‌సీబీ ప్లేయర్లు నల్ల బ్యాండ్‌లు ఎందుకు ధరించారు?

Published : Mar 28, 2026, 08:38 PM IST

RCB vs SRH : ఐపీఎల్ 2026 తొలి మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌తో ఆర్‌సీబీ తలపడుతోంది. అయితే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు నల్ల బ్యాండ్‌లు ధరించి గ్రౌండ్ లోకి అడుతుపెట్టారు. ఎందుకు?

PREV
16
విరాట్ కోహ్లీ చేతికి నల్ల రిబ్బన్.. ఐపీఎల్ 2026 తొలి మ్యాచ్‌లోనే ఆర్‌సీబీ ఎమోషనల్ ట్రిబ్యూట్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు ఐపీఎల్ 2026 సీజన్ తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడుతోంది. బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీతో సహా ఆర్‌సీబీ ఆటగాళ్లందరూ చేతికి నల్లటి బ్యాండ్‌ల ధరించి బరిలోకి దిగారు. ఇది కేవలం ఫ్యాషన్ కోసం కాదు, దీని వెనుక ఒక విషాదకరమైన, భావోద్వేగ కారణం దాగి ఉంది. గత ఏడాది జరిగిన ఒక దురదృష్టకర సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన తమ అభిమానులకు నివాళిగా జట్టు ఈ నిర్ణయం తీసుకుంది.

26
11 మంది అభిమానుల కోసం ఆర్సీబీ ప్రత్యేక నివాళి

గత ఏడాది ఆర్‌సీబీ తన చరిత్రాత్మక టైటిల్ గెలుచుకున్న తరుణంలో బెంగళూరులో పెద్ద ఎత్తున వేడుకలు జరిగాయి. ఆ సమయంలో చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాటలో 11 మంది ఆర్‌సీబీ అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. జూన్ 4న జరిగిన ఈ విషాద ఘటన క్రికెట్ లోకాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఏడాది తమ హోమ్ గ్రౌండ్‌లో ఆడుతున్న తొలి మ్యాచ్‌లోనే ఆ 11 మంది ఆత్మలకు శాంతి చేకూరాలని, వారి జ్ఞాపకార్థం ఆర్‌సీబీ ఈ నిర్ణయం తీసుకుంది.

36
ఆర్‌సీబీ అధికారిక ప్రకటనలో ఏం చెప్పింది?

ఈ నివాళి గురించి ఆర్‌సీబీ ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది. "జూన్ 4న జరిగిన దురదృష్టకర సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన 11 మంది ఆర్‌సీబీ కుటుంబ సభ్యులకు మేము నివాళులర్పిస్తున్నాము. వారికి గౌరవ సూచికగా, మ్యాచ్‌కు ముందు వార్మప్ సమయంలో ఆటగాళ్లు 11వ నంబర్ జెర్సీలను ధరిస్తారు. అలాగే మ్యాచ్ సమయంలో నల్ల బ్యాండ్‌లను ధరించి ఆడతారు" అని పేర్కొంది. అంతేకాకుండా, స్టేడియంలో 11 సీట్లను శాశ్వతంగా ఎవరికీ కేటాయించకుండా ఖాళీగా ఉంచుతామని, అది ఆ అభిమానుల పట్ల తమకున్న గౌరవమని జట్టు తెలిపింది.

46
బెంగళూరు స్టేడియం మూసివేత.. భద్రతా సవాళ్లు

అప్పుడు జరిగిన తొక్కిసలాట కారణంగా చిన్నస్వామి స్టేడియం భద్రతపై అనేక ప్రశ్నలు తలెత్తాయి. ఆ ప్రమాదం తర్వాత స్టేడియాన్ని చాలా కాలం పాటు మూసివేశారు. సరైన భద్రతా ప్రమాణాలు లేవని భావించి, అక్కడ జరగాల్సిన పలు మ్యాచ్‌లను ఇతర ప్రాంతాలకు తరలించారు. ఈ కారణం చేతనే 2027 టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం జాబితా నుండి కూడా ఈ మైదానాన్ని మినహాయించారు. ఇది స్థానిక క్రికెట్ అభిమానులకు, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్‌కు పెద్ద దెబ్బగా మారింది.

56
కొత్త హంగులతో తిరిగి ప్రారంభమైన చిన్నస్వామి స్టేడియం

ప్రమాదం తర్వాత ప్రభుత్వం, క్రికెట్ బోర్డు కలిసి స్టేడియంలో భారీ మార్పులు చేశాయి. నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు భద్రతా మెరుగుదలలు చేసిన తర్వాతే ఐపీఎల్ మ్యాచ్‌లకు అనుమతి లభించింది. కర్ణాటక హోం మంత్రి జి. పరమేశ్వర తుది అనుమతి ఇవ్వడంతో, కేఎస్‌సీఏ (KSCA) ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచ్‌లతో పాటు ప్లేఆఫ్స్, ఫైనల్‌ను నిర్వహించేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం ఈ స్టేడియం 33,000 మంది ప్రేక్షకులను తట్టుకోగల పూర్తి సామర్థ్యం కలిగి ఉంది.

66
భద్రతలో కీలక మార్పులు.. ఇరు జట్ల ప్లేయింగ్ 11 వివరాలు ఇవే

ప్రేక్షకుల రద్దీని నియంత్రించడానికి స్టేడియంలో గేట్లను వెడల్పు చేశారు. కబ్బన్ రోడ్, లింక్ రోడ్ నుండి అదనపు ఎంట్రీ పాయింట్లను ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో జనాన్ని తరలించడానికి ప్రత్యేక హోల్డింగ్ ఏరియాలను నిర్మించారు.

ఈ మ్యాచ్‌లో తలపడుతున్న జట్లు ఇవే:

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Playing XI): విరాట్ కోహ్లీ, సాల్ట్, రజత్ పాటిదార్ (కెప్టెన్), జితేష్ శర్మ (కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, జాకబ్ డఫీ, సుయాష్ శర్మ.

సన్‌రైజర్స్ హైదరాబాద్ (Playing XI): అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (కీపర్/కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, సలిల్ అరోరా, హర్ష్ దూబే, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, ఈషన్ మలింగ.

Read more Photos on
click me!

Recommended Stories