Virat Kohli : ఐపీఎల్ 2026లో ఆర్‌సీబీ స్టార్ విరాట్ కోహ్లీ సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నాడు. 9000 పరుగుల మైలురాయితో పాటు కోహ్లీ బ్రేక్ చేయనున్న 5 కీలక రికార్డులు ఏంటో మీకు తెలుసా?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ కు సర్వం సిద్ధమైంది. ఈ క్రమంలో అందరి దృష్టి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపైనే ఉంది. గత 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ, 2025 సీజన్‌లో ఆర్‌సీబీ తొలిసారి ఐపీఎల్ టైటిల్‌ను ముద్దాడింది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న బెంగళూరు జట్టును మరోసారి విజేతగా నిలిపేందుకు కోహ్లీ సిద్ధమవుతున్నాడు. 37 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన ఫామ్‌లో ఉన్న విరాట్, ఈ సీజన్‌లో పలు చరిత్రాత్మక రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉంది. వాటిలో..
26
1. 9,000 పరుగుల క్లబ్.. తొలి ఆటగాడిగా కోహ్లీ రికార్డు
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ ఇప్పటికే టాప్ లో ఉన్నాడు. 2024లో 8,000 పరుగుల మైలురాయిని అందుకున్న మొదటి ప్లేయర్‌గా నిలిచిన అతను, ప్రస్తుతం 8,661 పరుగులతో ఉన్నాడు. ఐపీఎల్ 2026లో విరాట్ మరో 339 పరుగులు చేస్తే, ఈ లీగ్ చరిత్రలో 9,000 పరుగులు పూర్తి చేసిన మొట్టమొదటి బ్యాటర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. గత మూడు సీజన్లలో వరుసగా 600 పైగా పరుగులు చేసిన కోహ్లీకి, ఈ 339 పరుగుల లక్ష్యం చాలా చిన్నదనే చెప్పాలి.
36
2. ఒకే ఫ్రాంచైజీ కోసం 10,000 పరుగులు
విరాట్ కోహ్లీ ఐపీఎల్ ప్రారంభం నుండి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్, ఇప్పుడు రద్దయిన ఛాంపియన్స్ లీగ్ టీ20 కలిపి విరాట్ ఇప్పటికే ఆర్‌సీబీ తరపున 9,000 పైగా పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో అతను మరో 915 పరుగులు సాధిస్తే, ఒకే ఒక టీ20 ఫ్రాంచైజీ కోసం 10,000 పరుగులు చేసిన తొలి ఆటగాడిగా గ్లోబల్ రికార్డు నెలకొల్పుతాడు. 2016లో అతను 973 పరుగులు చేసిన విషయాన్ని గుర్తు చేసుకుంటే, ఇది అసాధ్యమేమీ కాదు.
ఒకప్పుడు విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్‌పై విమర్శలు వచ్చేవి. కానీ గత రెండు సీజన్లలో కోహ్లీ తన శైలిని పూర్తిగా మార్చుకున్నాడు. ప్రస్తుతం అతను ఐపీఎల్‌లో 291 సిక్సర్లతో ఉన్నాడు. ఈ సీజన్‌లో కేవలం 9 సిక్సర్లు బాదితే, ఐపీఎల్‌లో 300 సిక్సర్ల మైలురాయిని అందుకున్న మూడవ ఆటగాడిగా నిలుస్తాడు. గతంలో క్రిస్ గేల్, రోహిత్ శర్మ మాత్రమే ఈ ఘనత సాధించారు. కోహ్లీ తాజా అగ్రెసివ్ బ్యాటింగ్ చూస్తుంటే, మొదటి కొన్ని మ్యాచ్‌ల్లోనే ఈ రికార్డు బద్దలయ్యేలా కనిపిస్తోంది.
56
4. ఒకే గ్రౌండ్ లో 4,000 టీ20 పరుగులు
బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియం విరాట్ కోహ్లీకి సొంత ఇల్లు లాంటిది. ఒకే స్టేడియంలో అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఇప్పటికే విరాట్ పేరుమీదే ఉంది. ఈ ఐపీఎల్ 2026లో చిన్నస్వామి స్టేడియంలో ఆడే మ్యాచ్‌ల్లో కోహ్లీ 382 పరుగులు చేస్తే, ఒకే స్టేడియంలో 4,000 టీ20 పరుగులు పూర్తి చేసిన ప్రపంచంలోనే మొదటి ప్లేయర్‌గా నిలుస్తాడు. స్టేడియం చిన్నది కావడం, కోహ్లీకి అక్కడ ఉన్న అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఈ రికార్డుకు కలిసొచ్చే అంశాలు.
66
5. తన సొంత రికార్డు (973 పరుగులు) బ్రేక్ చేస్తాడా?
2016 ఐపీఎల్ సీజన్‌లో విరాట్ కోహ్లీ 4 సెంచరీలతో 973 పరుగులు చేసి ఆల్ టైమ్ రికార్డు సృష్టించాడు. పదేళ్ల తర్వాత, అంటే 2026లో అదే తరహా జోరును విరాట్ ప్రదర్శిస్తాడని విశ్లేషకులు భావిస్తున్నారు. 2025లో ఆర్‌సీబీ టైటిల్ గెలవడంతో కోహ్లీ ఇప్పుడు చాలా స్వేచ్ఛగా, మరింత కసితో కనిపిస్తున్నాడు. ఒకవేళ అతను తన పాత రికార్డును దాటి 1000 పరుగులు చేస్తే, అది క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే అద్భుతం అవుతుంది. మూడవసారి ఆరెంజ్ క్యాప్ గెలవడమే లక్ష్యంగా కింగ్ కోహ్లీ బరిలోకి దిగుతున్నాడు.