టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కొడుకు ఆర్యన్ కాస్త కూతురు అనయాగా మారిపోయాడు. ఇటీవల థాయ్‌లాండ్‌లో జెండర్-అఫర్మింగ్ సర్జరీ చేయించుకున్నట్లు వెల్లడించారు. తన తండ్రితో కలిసి హాస్పిటల్‌లో ఉన్న ఎమోషనల్ ఫోటోను షేర్ చేశారు.
Sanjay Bangar Daughter Anaya Bangar : టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కొడుకు ఆర్యన్ బంగర్ కాస్త కూతురు అనయా బంగర్ గా మారిపోయాడు. ఇటీవల థాయ్‌లాండ్‌లో జెండర్-అఫర్మింగ్ సర్జరీ (లింగ మార్పిడి చికిత్స) చేయించుకున్నట్లు ఇటీవలే బైటపెట్టారు. హాస్పిటల్ బెడ్‌పై ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తన సుదీర్ఘ ప్రయాణం గురించి వివరించారు. ఇది ఒక భావోద్వేగభరితమైన, జీవితాన్ని మార్చే క్షణమని ఆమె అభివర్ణించారు.
25
ఎవరీ అనయా బంగర్..
టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్-వైశాలి దంపతుల కుమారుడు ఆర్యన్ బంగర్. ఇతడు తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ క్రికెట్ ను కెరీర్ గా ఎంచుకున్నాడు... అండర్ 16, అండర్ 19 లో కూడా ఆడాడు. ఇలా అతడు క్రికెటర్ గా ఎదుగుతున్న సమయంలోనే కీలక నిర్ణయం తీసుకున్నాడు.
చిన్నప్పటినుండి హార్మోన్ సమస్యల కారణంగా అమ్మాయిగా ఉండేందుకు ఇష్టపడేవాడు ఆర్యన్... కానీ సమాజం కోసం తన భావాలను బైటపెట్టలేదు. అయితే పెద్దయ్యేకొద్ది ఈ లక్షణాలు పెరగడంతో పూర్తిగా అమ్మాయిగా మారేందుకు సిద్దమయ్యాడు. తల్లిదండ్రులు కూడా అతడి భావాలను గుర్తించి అమ్మాయిగా మారడానికి అంగీకరించారు. దీంతో ఆర్యన్ బంగర్ కాస్త అనయా బంగర్ గా మారారు.
35
సంజయ్ బంగర్ తో అనయా.. .
లింగమార్పిడికి తల్లిదండ్రులు అంగీకరించడంపై అనయా బంగర్ ఎమోషనల్ అయ్యారు. ఈ క్షణాన్ని మరింత ప్రత్యేకంగా మార్చింది తన తండ్రి సంజయ్ బంగర్ పక్కనే ఉండటమని సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు. తన కుటుంబం నుంచి లభించిన ప్రేమ, సపోర్ట్ గురించి అనయా మాట్లాడారు. ఇలాంటి వ్యక్తిగత నిర్ణయాలు, మార్పుల సమయంలో కుటుంబ అంగీకారం ఎంత ముఖ్యమో ఆమె నొక్కి చెప్పారు.
జెండర్-అఫర్మింగ్ సర్జరీ అంటే కేవలం శారీరక మార్పులు మాత్రమే కాదు. ఇది వ్యక్తులు తమ నిజమైన జీవితాన్ని గడిపేలా చేస్తుందన్నారు. ముఖ్యంగా జెండర్ డిస్ఫోరియాతో బాధపడే చాలా మందికి ఇది ఉపశమనం, ఆత్మవిశ్వాసం, అంతర్గత శాంతిని ఇస్తుందన్నారు అనయా బంగర్.
''తన జర్నీఅంత ఈజీ కాదు... తనకే కాదు కుటుంబసభ్యులకు కూడా. తన భావాలను అర్థం చేసుకున్నారు... అంగీకరించారు... కీలక సమయంలో తనవెంట నిలబడ్డారు. ఇది వెంటనే జరిగింది కాదు. ఎన్నో ప్రశ్నలు, ఎంతో కన్ప్యూజన్ తర్వాత ఇది జరిగింది. ఈ సమయంలో తండ్రి పక్కన ఉండటం నా జీవితంతో కీలక మూమెంట్. ఆయన సపోర్ట్ కూడా రాత్రికి రాత్రి వచ్చింది కాదు'' అని అనయా ఎమోషన్ అయ్యారు.
''లింగమార్పిడి సర్జరీ అనేది జీవితంలో తీసుకున్న అతిపెద్ద నిర్ణయం. ఎదుగుదలకు సమయం పడుతుంది... ప్రేమకు సమయం పడుతుంది... అన్నింటికంటే ఇవి విలువైనవి. నేను ఎప్పటికీ నాన్నకు రుణపడి ఉంటాను'' అంటూ తండ్రి తన పక్కనే ఉన్న ఫోటోను అనయా పోస్ట్ చేసింది.
55
తల్లి, తండ్రి ఇక ఆమే..
లింగమార్పిడి ద్వారా పూర్తిగా అమ్మాయిగా మారిన అనయ పిల్లలను కూడా కనేందుకు సిద్దమవుతోంది. ఆమె అమ్మాయిగా మారడానికి ముందే తన వీర్యాన్ని భద్రపర్చుకుంది… దీంతోనే పిల్లలను కంటుందట. ఇలా ఆమె పిల్లలకు తల్లి, తండ్రి కానుంది. ఇలాంటివి విదేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి... కానీ ఇండియాలో అరుదు. కానీ అనయా బంగర్ ఇది చేసి చూపిస్తానంటోంది.