ఎస్ఆర్హెచ్ ఎదుర్కోవాల్సిన ప్రధాన సవాలు బౌలింగ్ వైఫల్యం. బ్యాటర్లు భారీ స్కోర్లు సాధించినప్పటికీ, బౌలర్లు వాటిని కాపాడుకోలేకపోతే జట్టుకు ఇబ్బందులు తప్పవు. గత సీజన్‌లో గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ వంటి జట్లు ఎస్ఆర్హెచ్ బౌలింగ్ లోపాలను క్లియర్ గా ఎండగట్టాయి. ఒత్తిడిలో జట్టు కుప్పకూలే అలవాటు కూడా మరో ఆందోళన కలిగించే అంశం. కమిన్స్ వంటి అనుభవజ్ఞుడైన నాయకుడు మైదానంలో లేకపోవడం వ్యూహాల అమలులో లోపాలకు దారితీయవచ్చు. వీటిని అధిగమిస్తేనే హైదరాబాద్ ప్లేఆఫ్స్ రేసులో నిలుస్తుంది.
ఎస్ఆర్హెచ్ బెస్ట్ ప్లేయింగ్ 11
అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (కెప్టెన్/కీపర్), నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, లియామ్ లివింగ్‌స్టోన్, అనికేత్ వర్మ, హర్ష్ దూబే, హర్షల్ పటేల్, ఇషాన్ మలింగ/బ్రైడన్ కార్సే, జయదేవ్ ఉనద్కత్.