IPL 2026: ముంబై ఇండియన్స్‌లో కెప్టెన్సీ వార్.. ఆ ఇద్దరిలో ఒకరు ఫైనల్‌గా..

Published : Mar 24, 2026, 08:22 AM IST

IPL 2026: ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ వ్యవహారం మళ్లీ హాట్ టాపిక్ గా మారింది. హార్దిక్ పాండ్యా తన బాధ్యతలను సూర్యకుమార్ యాదవ్ కు అప్పగించాలని మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

PREV
15
ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ రచ్చ

ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటైన ముంబై ఇండియన్స్, గత కొన్ని సీజన్లుగా కెప్టెన్సీ వివాదాలతో వార్తల్లో నిలుస్తోంది. ఐదు సార్లు టైటిల్ అందించిన రోహిత్ శర్మను తప్పించి హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించడంపై అభిమానులు ఇప్పటికే తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలోనే ఐపీఎల్ 2026 సీజన్ కు ముందు కెప్టెన్సీ మార్పుపై సరికొత్త డిమాండ్లు తెరపైకి వచ్చాయి.

25
శ్రీకాంత్ సూచన:

భారత మాజీ ఓపెనర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ముంబై ఇండియన్స్ యాజమాన్యానికి, హార్దిక్ పాండ్యాకు ఒక కీలక సలహా ఇచ్చారు. టీమ్ ఇండియాకు టీ20 ప్రపంచకప్ అందించిన సూర్యకుమార్ యాదవ్ కు హార్దిక్ స్వచ్ఛందంగా కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని ఆయన కోరారు. సూర్య నాయకత్వంలో జట్టు మళ్లీ గాడిన పడే అవకాశం ఉందని, అభిమానుల కోరిక మేరకు యాజమాన్యం ఈ విషయంపై పునరాలోచించాలని ఆయన పేర్కొన్నారు.

35
అభిమానుల డిమాండ్:

సోషల్ మీడియాలో ముంబై అభిమానులు హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. రోహిత్ శర్మ లేదా సూర్యకుమార్ యాదవ్ లలో ఒకరికి నాయకత్వ బాధ్యతలు ఇవ్వాలని వారు కోరుతున్నారు. 2024 సీజన్ లో ముంబై పట్టికలో అట్టడుగు స్థానంలో నిలవడం పాండ్యాపై విమర్శలకు ప్రధాన కారణమైంది. అయితే 2025లో జట్టు ప్లే ఆఫ్ చేరినప్పటికీ, టైటిల్ గెలవలేకపోవడం మళ్లీ మార్పు దిశగా ఆలోచించేలా చేస్తోంది.

45
నిర్ణయం ఎవరిది?:

కెప్టెన్ ఎవరనేది అంతిమంగా ఫ్రాంచైజీ నిర్ణయమే అయినప్పటికీ, రోహిత్, సూర్య, హార్దిక్ లతో కలిసి యాజమాన్యం ఒక స్పష్టమైన ప్రణాళిక రూపొందించుకోవాలని శ్రీకాంత్ సూచించారు. సూర్యకుమార్ యాదవ్ ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో తన కెప్టెన్సీ సామర్థ్యాన్ని నిరూపించుకోవడంతో, ముంబై ఇండియన్స్ కూడా అతని వైపు మొగ్గు చూపుతుందా అనేది వేచి చూడాలి.

55
ముంబై ఇండియన్స్ తుది జట్టు(అంచనా)

రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, విల్ జాక్స్, హార్దిక్ పాండ్యా, నమన్ ధీర్/షెర్ఫెన్ రూథర్‌ఫోర్డ్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్/శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, మయాంక్ మార్కండే(ఇంపాక్ట్)

Read more Photos on
click me!

Recommended Stories