Virat Kohli : విరాట్ కోహ్లీ రాంచీ వన్డేలో సెంచరీ బాదాడు. ఈ క్లాసిక్ నాక్ తో అత్యధిక సెంచరీల ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. అలాగే, సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్ వంటి లెజెండరీల రికార్డులను బ్రేక్ చేశాడు.
భారత్, సౌతాఫ్రికా వన్డే సిరీస్ తొలి మ్యాచ్ రాంచీ JSCA ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్ లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సెంచరీతో కొత్త చరిత్ర రాశారు. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఒకే ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా ఘనత సాధించాడు. ఈ క్రమంలో కోహ్లీ, లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించారు.
25
102 బంతుల్లో సెంచరీ కొట్టిన కోహ్లీ
ఈ మ్యాచ్ లో సూపర్ నాక్ తో కోహ్లీ వన్డేల్లో 52వ సెంచరీని నమోదు చేశాడు. అంతకుముందు ఒకే ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీల రికార్డు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ పేరు మీద ఉంది. సచిన్ తన కెరీర్‌లో టెస్ట్ ఫార్మాట్‌లో 51 సెంచరీలు సాధించాడు. ఈ ఇన్నింగ్స్ తో కొట్టి కోహ్లీ ప్రపంచ క్రికెట్ లో ఒకే ఒక్కడిగా నిలిచాడు.
35
దేశంలో అత్యధిక 50+ స్కోర్లు.. టాప్ లో కోహ్లీ
వన్డే ఇంటర్నేషనల్స్‌లో భారత గడ్డపై అత్యధిక 50+ స్కోర్లు చేసిన బ్యాటర్‌గా కూడా కోహ్లీ ఇప్పుడు టాప్ ప్లేస్ దక్కించుకున్నారు. దేశంలో ఆయన చేసిన ఇది 59వ 50+ స్కోరు. దీంతో ఆయన సచిన్ టెండూల్కర్ (58 హాఫ్ సెంచరీలు)ను దాటేశాడు.
ఇక సౌతాఫ్రికా స్టార్ జాక్వెస్ కాలిస్ తన దేశంలో 46 సార్లు, రికీ పాంటింగ్ ఆస్ట్రేలియాలో 45 సార్లు 50+ స్కోర్లు చేశారు.
మ్యాచ్ విషయానికి వస్తే, యశస్వీ జైస్వాల్, రోహిత్ శర్మ కలిసి భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. ఇద్దరి మధ్య తొలి వికెట్‌కు 25 పరుగులు జోడించారు. జైస్వాల్ 18 పరుగులు చేసి అవుటయ్యారు. ఆయన వెంటనే మూడో స్థానంలో వచ్చిన కోహ్లీ, రోహిత్‌తో కలిసి కీలక భాగస్వామ్యం అందించారు. ఇద్దరి మధ్య 136 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. రోహిత్ 57 పరుగులు చేసి అవుటయ్యారు.
విరాట్ కోహ్లీ ఒకే ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డుతో టాప్ లో ఉన్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో 135 పరుగులు చేశారు. 120 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్సర్లతో ఈ ఇన్నింగ్స్ ఆడాడు. ఇది ఆయన వన్డే కెరీర్‌లో 52వ సెంచరీ. ఆయన ఇప్పటివరకు 306 వన్డేలు ఆడారు.
సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ జాక్వెస్ కాలిస్ టెస్ట్‌ల్లో 45 సెంచరీలు, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 41 టెస్ట్ సెంచరీలతో తరువాతి స్థానాల్లో ఉన్నారు. సచిన్ టెండూల్కర్ 51 సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నాడు.
55
పాంటింగ్, టెండూల్కర్ రికార్డులు బద్దలు
రాంచీ వన్డేలో కోహ్లీ పలు రికార్డులు బద్దలు కొట్టాడు. మూడో స్థానంలో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా కోహ్లీ కొత్త రికార్డు నమోదు చేశాడు. రికీ పాంటింగ్ చేసిన 217 సిక్సర్ల రికార్డును ఆయన అధిగమించారు. ఈ మ్యాచ్‌లో రెండు సిక్సర్లు కొట్టగానే ఈ రికార్డును అందుకున్నాడు.
ద్వైపాక్షిక సిరీస్ వన్డేల్లో 10,000 రన్స్ చేసిన ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా కోహ్లీ అవతరించారు. ఈ మ్యాచ్‌కు ముందు ఆయన ఖాతాలో 9,936 పరుగులు ఉన్నాయి. 64వ రన్ పూర్తి చేసిన వెంటనే ఈ రికార్డు ఆయన సొంతమైంది.
అలాగే హోం గ్రౌండ్ లో అన్ని ఫార్మాట్ల్లో కలిపి 50+ స్కోర్లు 100 మార్క్ దాటిన నాలుగో బ్యాటర్‌గా కూడా కోహ్లీ చరిత్ర సృష్టించారు. ఈ జాబితాలో టెండూల్కర్ (112), పాంటింగ్ (106), కాలిస్ (104) లు కోహ్లీ కంటే ముందున్నారు.