Virat Kohli : విరాట్ కోహ్లీ 52వ వన్డే సెంచరీతో రాంచీలో రికార్డుల వర్షం కురిపించాడు. కోహ్లీకి తోడుగా భారత బ్యాటర్లు అద్భుతంగా రాణించడంతో సఫారీల ముందు 350 పరుగుల భారీ టార్గెట్ ను ఉంచారు.
రాంచీలో భారత బ్యాటింగ్ దూకుడు.. సఫారీల పై కోహ్లీ దెబ్బ
రాంచీ వన్డేలో భారత జట్టు బ్యాటర్లు అసలైన క్లాస్‌ను చూపించారు. టాస్ ఓడి ఫీల్డింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికాకు బిగ్ షాక్ ఇచ్చారు. దుమ్మురేపే ఆటతో సఫారీ బౌలింగ్ లో చితక్కొట్టారు. కోహ్లీ సెంచరీతో అదరగొట్టాడు.
ఆరంభంలో యశస్వి జైస్వాల్ (18) త్వరగా ఔటవడంతో కొంత ఒత్తిడి వచ్చినా, తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ మ్యాచ్ ను పూర్తిగా మార్చేశాడు. ఆరంభం నుంచే ఆత్మవిశ్వాసంతో ఆడిన కోహ్లీ.. స్ట్రైక్ రొటేట్ చేస్తూనే ఖచ్చితమైన షాట్లతో సింగిల్స్, బౌండరీలతో మరో క్లాస్ ఇన్నింగ్స్ ఆడాడు.
25
52వ సెంచరీ కొట్టిన కోహ్లీ
విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌లో పీక్ ఫామ్‌ను మరోసారి చూపించాడు. 102 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. కోహ్లీ, సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ఒకే ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీల రికార్డును అధిగమించాడు. సఫారీలపై 6వ వన్డే సెంచరీతో దుమ్మురేపాడు. మొత్తం 120 బంతుల్లో 135 పరుగులు చేసిన కోహ్లీ తన ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 7 భారీ సిక్సర్లు బాదాడు. అతడి ప్రతి షాట్‌లో నమ్మకం, నైపుణ్యం స్పష్టంగా కనిపించింది.
35
రోహిత్-కోహ్లీ భాగస్వామ్యం
యశస్వి ఔట్ అయిన తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కలిసి ఇన్నింగ్స్‌కు బలమైన పునాది వేశారు. రోహిత్ (57) తనదైన ఆటతో హాఫ్ సెంచరీ కొట్టాడు. 5 ఫోర్లు, 3 సిక్సర్లతో తన ఇన్నింగ్స్ ను కొనసాగించాడు. ఈ జోడీ 136 పరుగుల కీలక భాగస్వామ్యంలో భారత్ భారీ స్కోర్ నమోదుచేసింది.
రోహిత్ ఔట్ అయిన తర్వాత రుతురాజ్ గైక్వాడ్ (8), వాషింగ్టన్ సుందర్ (13) త్వరగా పెవిలియన్ చేరడంతో కొంత స్కోరింగ్ తగ్గినట్టు కనిపించింది. అయితే, కోహ్లీ-రాహుల్ కలిసి ఇన్నింగ్స్‌కు స్థిరత్వం తీసుకువచ్చారు.
కేఎల్ రాహుల్ 60 పరుగులతో కెప్టెన్ నాక్ ఆడాడు. చివర్లో రవీంద్ర జడేజా 32 పరుగులు చేయడంతో భారత స్కోరు 349కి చేరింది. దక్షిణాఫ్రికా తరఫున బర్గర్, బాష్, యాన్సెన్, బార్ట్‌మన్ చెరో రెండు వికెట్లు తీశారు.
55
సఫారీలకు 350 భారీ ఛాలెంజ్
భారత్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 349 పరుగులు చేసింది. రాంచీ మైదానంలో ఈ స్కోరును ఛేదించడం సౌతాఫ్రికాకు కఠిన పరీక్ష అనే చెప్పాలి. గత టెస్ట్ సిరీస్‌లో 2-0తో ఓడిన భారత్ ఈ వన్డే సిరీస్‌ను గెలిచి తిరిగి ట్రాక్‌లోకి రావాలని చూస్తోంది.