టీమిండియా ఊపిరి పీల్చుకో..! టెస్టుల్లోకి విరాట్ కోహ్లీ రీఎంట్రీ.?

Published : Nov 30, 2025, 07:32 PM IST

Virat Kohli: టీమిండియా టెస్టుల్లో పేలవమైన ఆటతీరు కనబరుస్తోంది. చాలామంది అభిమానులు కోహ్లీ కెప్టెన్సీలోనే అద్భుత విజయాలను టీమిండియా అందుకుందని అంటున్నారు. మళ్లీ విరాట్ కోహ్లీ తిరిగి టెస్టుల్లోకి రావాలని కోరుతున్నారు. 

PREV
15
స్వదేశంలో పిల్లి..!

ప్రస్తుత పరిస్థితుల్లో టీమిండియా స్వదేశంలో పిల్లిలా మారింది. అప్పుడు న్యూజిలాండ్‌తో.. ఇటు దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లను వైట్‌వాష్ చేయించుకుంది. కోచ్‌గా గంభీర్ తీసుకున్న నిర్ణయాలు, కెప్టెన్సీ మార్పులతో పాటు సీనియర్ల రిటైర్మెంట్.. టీమిండియాను కష్టాల్లో పడేసిందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.

25
కోహ్లీ కెప్టెన్సీలోనే గ్రేట్..

టెస్టుల్లో కోహ్లీ కెప్టెన్సీ చేపట్టిన దగ్గర నుంచి టీమిండియా దూసుకుపోయింది. ఏడో స్థానంలో ఉన్న టీమిండియా.. అగ్రస్థానానికి చేరుకుంది. ఒక్క బౌలర్ మీద ఆధారపడకుండా.. మొత్తం బౌలింగ్ విభాగాన్ని పులులు మాదిరిగా మార్చాడు. ఐసీసీ ట్రోఫీ గెలవకపోయినప్పటికీ.. భారత్‌కు కోహ్లీ గ్రేటెస్ట్ టెస్ట్ కెప్టెన్.

35
బీసీసీఐ కీలక నిర్ణయం..

టెస్టు క్రికెట్‌లో టీమిండియా వరుస ఓటముల నేపధ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరే అవకాశం ఉందని జాతీయ మీడియా ఓ కథనాన్ని ప్రచురించింది. అలాగే మరికొద్ది రోజుల్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో.. వారి వన్డే ఫార్మటు భవిష్యత్తుపై కీలకంగా చర్చించనున్నారు. ఈ నేపధ్యంలో ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

45
నిర్ణయాన్ని వెనక్కి తీసుకోనున్నాడా..!

ఇదిలా ఉంటే.. బీసీసీఐ చర్చిస్తుందని ఇలా వార్త వచ్చిందో లేదో.. రిటైర్మెంట్ నుంచి తన నిర్ణయాన్ని మార్చుకునేందుకు ఓ ఆటగాడు సిద్దమైనట్టు తెలుస్తోంది. కాగా, కోహ్లీ, రోహిత్ శర్మ, అశ్విన్, పుజారా లాంటి సీనియర్ల రిటైర్మెంట్ తీసుకున్న విషయం తెలిసిందే. వీరిలో ఆ ఆటగాడు ఎవరు అనేది స్పష్టత లేదు. అటు ఈ ప్లేయర్స్ రిటైర్ అయిన తర్వాతే టీమిండియా దెబ్బతిన్నట్టు విశ్లేషకులు అంటున్నారు.

55
డబ్ల్యూటీసీకి భారత్ కష్టమే..

న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా సిరీస్‌లలో ఓటమిపాలైన టీమిండియా.. డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే కష్టం అయ్యేలా ఉంది. కచ్చితంగా తర్వాత జరిగే మ్యాచ్‌లలో కనీసం ఏడింట గెలవాలి. అటు భారత్, ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఐదు మ్యాచ్‌లు జరగనుండటంతో.. ఇవన్నీ ఇప్పటి టీంతో గెలవాలంటే సాధ్యం అయ్యేలా కనిపించట్లేదని క్రికెట్ అభిమానులు అంటున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories