సచిన్ కు షాకిచ్చిన విరాట్ కోహ్లీ !

Published : Oct 26, 2025, 07:59 PM ISTUpdated : Oct 26, 2025, 08:06 PM IST

Virat Kohli Breaks Sachin World Record: విరాట్ కోహ్లీ ఇంటర్నేషనల్ వైట్ బాల్ క్రికెట్‌లో 18,443 పరుగులు సాధించాడు. అలాగే, లెజెండరీ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు.

PREV
16
కోహ్లీ సరికొత్త రికార్డ్‌

భారత స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ సాధించిన కోహ్లీ, అంతర్జాతీయ వైట్ బాల్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఘనత సాధించాడు. కోహ్లీ మొత్తం 18,443 పరుగుల మార్క్‌ను దాటాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ నమోదు చేసిన ప్రపంచ రికార్డును బ్రేక్ చేశాడు.

26
సిడ్నీలో సూపర్ నాక్ ఆడిన కోహ్లీ

మూడో వన్డేలో కోహ్లీ అద్భుత బ్యాటింగ్‌తో 81 బంతుల్లో అజేయంగా 74 పరుగులు చేశాడు. 7 ఫోర్లు బాదిన కోహ్లీ, 91.35 స్ట్రైక్‌రేట్‌తో తన ఇన్నింగ్స్ ను కొనసాగించాడు. ఈ ఇన్నింగ్స్‌తో కోహ్లీ తన వన్డే కెరీర్‌లో 75వ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

36
వైట్ బాల్ క్రికెట్‌లో నంబర్ వన్ కోహ్లీ

ఇంటర్నేషనల్‌ వైట్ బాల్‌ (ODI + T20I) క్రికెట్‌లో కోహ్లీ పరుగులు ఇప్పుడు 18,443 చేరుకున్నాయి. ఇదివరకు సచిన్ టెండూల్కర్ 18,436 పరుగులతో టాప్ ఉన్నాడు. కోహ్లీ వన్డేల్లో 14,255 పరుగులు, టీ20ల్లో 4,188 పరుగులు చేశాడు. సచిన్‌ వన్డేల్లో 18,426 పరుగులు, టీ20ల్లో 10 పరుగులు నమోదు చేశాడు. ఈ రికార్డ్‌ జాబితాలో సచిన్ ఇప్పుడు రెండో స్థానానికి చేరాడు.

46
ఇంటర్నేషనల్ వైట్ బాల్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు

1. విరాట్ కోహ్లీ (భారతదేశం) – 18,443 పరుగులు (410 ఇన్నింగ్స్ లు )

2. సచిన్ టెండూల్కర్ (భారతదేశం) – 18,436 పరుగులు (453 ఇన్నింగ్స్ లు)

3. కుమార్ సంగక్కర (శ్రీలంక) – 15,616 పరుగులు (433 ఇన్నింగ్స్ లు)

4. రోహిత్ శర్మ (భారతదేశం) – 15,601 పరుగులు (419 ఇన్నింగ్స్ లు)

5. మహేలా జయవర్ధనే (శ్రీలంక) – 14,143 పరుగులు (473 ఇన్నింగ్స్ లు)

6. రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) – 14,105 పరుగులు (381 ఇన్నింగ్స్ లు)

56
వన్డేల్లో రెండో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా విరాట్ కోహ్లీ

కోహ్లీ వన్డే క్రికెట్‌లో 305 మ్యాచ్‌ల్లో 57.71 సగటుతో 14,255 పరుగులు చేశారు. ఇందులో 51 సెంచరీలు, 75 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ ప్రదర్శనతో కోహ్లీ వన్డేల్లో రెండో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.

కుమార్ సంగక్కర 404 మ్యాచ్‌ల్లో 14,234 పరుగులు చేసి మూడో స్థానంలో ఉన్నాడు. వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్ గా సచిన్ టెండూల్కర్ (18,426 పరుగులు) టాప్ లో ఉన్నాడు.

66
వన్డేల్లో అత్యధిక పరుగులు : టాప్ 5 ప్లేయర్లు

1. సచిన్ టెండూల్కర్ (భారతదేశం) - 18,426 పరుగులు

2. విరాట్ కోహ్లీ (భారతదేశం) - 14,255 పరుగులు

3. కుమార్ సంగక్కర (శ్రీలంక) - 14,234 పరుగులు

4. రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) - 13,704 పరుగులు

5. సనత్ జయసూర్య (శ్రీలంక) - 13,430 పరుగులు

ప్రపంచంలో అత్యుత్తమ వన్డే బ్యాటర్‌లలో కోహ్లీ

కోహ్లీ ఇప్పటికీ 15 ఏళ్ల వన్డే కెరీర్‌లో సత్తా చాటుతూనే ఉన్నాడు. ర్యాంకులు, రికార్డులు, ప్రదర్శన అన్నీ కోహ్లీని ప్రపంచంలో అత్యుత్తమ వన్డే బ్యాటర్లలో ఒకరిగా నిలబెట్టాయి. క్రికెట్ రికార్డ్‌ల పట్టికలో కోహ్లీ పేరు మరోసారి అగ్రస్థానంలో నిలిచింది.

Read more Photos on
click me!

Recommended Stories