కావ్య పాప లేఆఫ్స్ ఇచ్చేసిందిగా.. ఈ 8 మంది ప్లేయర్స్‌కి SRH గుడ్‌బై.. ఎవరెవరంటే.?

Published : Oct 26, 2025, 04:00 PM IST

IPL 2026: ఐపీఎల్ 2026 మినీ వేలానికి సమయం ఆసన్నమైంది. ఈ నేపధ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఏయే ఆటగాళ్లను విడుదల చేయనుంది. రిటైన్ చేస్తుందన్న దానిపై కీలక విషయాలు బయటపడ్డాయి. మరి ఆ లిస్టులో ఎవరున్నారో తెలుసా..? 

PREV
15
ఐపీఎల్ మినీ వేలం తేదీ ఇదే..

ఐపీఎల్ 2026 మినీ వేలానికి సమయం ఆసన్నమైంది. డిసెంబర్ 13-15 మధ్య ఈ మినీ వేలం జరగనుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అన్ని జట్లు నవంబర్ 15 లోపు తమ రిటెన్షన్ లిస్టులను బీసీసీఐకి సమర్పించాల్సి ఉంది. మరో 20 రోజుల్లో ఈ రిటైన్ లిస్టుకు సమయం ఉండటంతో.. సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం లిస్టు ఎలా ఉండబోతోందన్న దానిపై ఓ క్లారిటీ వచ్చేసింది. పక్కా వ్యూహాలతో మినీ వేలంలోకి వెళ్లనుంది హైదరాబాద్ జట్టు.

25
విడుదల చేసే ఆటగాళ్లు వీరే..

ఐపీఎల్ 2026 మినీ వేలంలోకి పలువురు ఆటగాళ్ళను విడుదల చేసేందుకు సిద్దమైంది హైదరాబాద్ ఫ్రాంచైజీ. ఇప్పటికే ఆయా ఆటగాళ్ళకు కావ్య మారన్ లేఆఫ్స్ ఇచ్చేసినట్టు సమాచారం. ఇక ఆ లిస్టులో ఏడుగురు ప్లేయర్స్ కన్ఫర్మ్ కాగా.. వారు ఇలా ఉన్నారు. ఆడమ్ జంపా, సచిన్ బేబీ, సిమర్‌జీత్ సింగ్, వియాన్ మాల్డర్, అభినవ్ మనోహర్, రాహుల్ చాహర్, మహమ్మద్ షమీ ఉన్నారు. ముఖ్యంగా షమీని మెయిన్ బౌలర్ అనుకోగా.. గాయాల బెడద, ఫాంలేమి కారణంగా అతడ్ని రిలీజ్ చేస్తోంది హైదరాబాద్ ఫ్రాంచైజీ.

35
ఈ ఆటగాళ్లపై ఉత్కంఠ..

మిడిలార్డర్ బ్యాటర్ ఇషాన్ కిషన్, వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం సమాలోచనలు చేస్తోంది. గత సీజన్‌లో ఇషాన్ కిషన్ 14 మ్యాచ్‌ల్లో 354 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ(106), ఒక 94 పరుగుల నాటౌట్ ఇన్నింగ్స్ ఉన్నాయి. సగటు 35 కాగా, స్ట్రైక్ రేట్ 152గా ఉంది. అయినప్పటికీ, ఆ రెండు మ్యాచ్‌లు మినహా మిగిలిన వాటిలో నిరాశపరిచాడు. ఇతన్ని రూ. 11.25 కోట్లకు కొనుగోలు చేసింది.

45
క్లాసెన్ విషయంలో 50-50..

హెన్రిచ్ క్లాసెన్‌ను కూడా ఫ్రాంచైజీ రిలీజ్ చేయవచ్చని పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే, క్లాసెన్‌ను విడుదల చేస్తే తిరిగి బై బ్యాక్ చేయడం చాలా కష్టం. గతంలో రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్ వంటి కీలక ఆటగాళ్లను SRH విడుదల చేసి ఆ తర్వాత కొనుగోలు చేయలేక పశ్చాత్తాపపడిన సందర్భాలున్నాయి. కెమెరూన్ గ్రీన్ కోసం క్లాసెన్‌ను రిలీజ్ చేసి, ఇషాన్ కిషన్‌ను వికెట్ కీపర్‌గా నిలుపుకోవాలని జట్టు భావిస్తున్నట్లు సమాచారం.

55
పకడ్బందీగా SRH..

అటు ఇషాన్ కిషన్‌ను విడుదల చేసి.. క్లాసెన్, గ్రీన్‌ను మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేయించాలని హైదరాబాద్ యోచిస్తోంది. ఇక ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ప్యాట్ కమిన్స్ లాంటివారు ఈసారి కూడా రిటైన్ లిస్టులో ఉన్నట్టే. షమీ రిలీజ్ అయితే.. మెయిన్ బౌలర్ కోసం SRH కచ్చితంగా మినీ వేలంలో స్కెచ్ వేస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories