Vaibhav Suryavanshi: గేల్ రికార్డును బ్రేక్ చేసేది అప్పుడే.? జోస్యం చెప్పిన వైభవ్ కోచ్..

Published : Apr 13, 2026, 07:00 AM IST

Vaibhav Suryavanshi: రాజస్థాన్ రాయల్స్ యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026లో విధ్వంసం సృష్టిస్తున్నాడు. కేవలం 26 బంతుల్లో 78 పరుగులు చేసి ఆకట్టుకున్న ఈ 15 ఏళ్ల కుర్రాడు, త్వరలోనే క్రిస్ గేల్ రికార్డులను బద్దలు కొడతాడని.. 

PREV
15
ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ

ఐపీఎల్ 2026 సీజన్‌లో 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ తన బ్యాటింగ్‌తో ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పై కేవలం 26 బంతుల్లోనే 78 పరుగులు చేసి, క్రికెట్ ప్రపంచం తన వైపు చూసేలా చేశాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్ తర్వాత వైభవ్ కోచ్ మనీష్ ఓజా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

25
ఆర్సీబీపై విధ్వంసం..

రాజస్థాన్ రాయల్స్ తరపున బరిలోకి దిగిన వైభవ్, ఆర్సీబీ బౌలర్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు. 300 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసిన అతను, 8 ఫోర్లు, 7 భారీ సిక్సర్లతో విధ్వంసం సృష్టించాడు. ఒక దశలో క్రిస్ గేల్ పేరిట ఉన్న 30 బంతుల ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును వైభవ్ బద్దలు కొడతాడని అందరూ భావించారు. కానీ, కృణాల్ పాండ్యా బౌలింగ్ లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి అవుట్ కావడంతో ఆ రికార్డు తృటిలో చేజారింది.

35
కోచ్ ధీమా: 175 పరుగుల రికార్డు కూడా ప్రమాదంలోనే!

వైభవ్ ప్రదర్శనపై అతని కోచ్ మనీష్ ఓజా స్పందిస్తూ.. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని పేర్కొన్నారు. 2026 సీజన్ ముగిసేలోపే అసాధ్యమైన రికార్డులను వైభవ్ అధిగమిస్తాడని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ వైభవ్‌కి మొదట బ్యాటింగ్ చేసే అవకాశం వస్తే, క్రిస్ గేల్ నెలకొల్పిన 175 పరుగుల అత్యధిక స్కోరు రికార్డు కూడా ప్రమాదంలో పడుతుందని ఆయన జోస్యం చెప్పారు.

45
ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్థానం

బీహార్‌కు చెందిన ఈ కుర్రాడిని వేలంలో రూ. 1.10 కోట్లకు కొనుగోలు చేసినప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారు. కానీ ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ ఒక అసలైన వజ్రాన్ని వెలికితీసిందని ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం నాలుగు మ్యాచుల్లోనే 200 పరుగులు పూర్తి చేసిన వైభవ్ ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా కూడా అగ్రస్థానంలో నిలిచి, 266.66 అద్భుతమైన స్ట్రైక్ రేట్‌తో దూసుకుపోతున్నాడు.

55
పవర్ ప్లేలో అలవోకగా..

చిన్న వయసులోనే దిగ్గజ బౌలర్లను ఎదుర్కొంటూ, పవర్ ప్లేలో అలవోకగా సిక్సర్లు బాదే వైభవ్ శైలి అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సీజన్‌లో వైభవ్ బ్యాట్ నుంచి తొలి సెంచరీ ఎప్పుడు వస్తుందా అని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories